మంత్రము :- “ఏవం గుణవిశేషణ...అస్యాం శుభతిథౌ శివలింగస్య దేవతా బీజత్వ సిద్ధ్యర్థం ధాన్యాధివాసం కరిష్యే”
అని సంకల్పించి, శివకలశముయొక్క జలముతో ఈశాన్య దిగ్భాగమున షట్చుమ్మార్జనతో భూశుద్ధి గావించి, ఆ స్థలములో రంగవల్లి చేత అష్ట దళముల కమలమును వ్రాసి, దానిపైన బియ్యముతో నింపిన పాత్రనుంచి శివలింగమును రెండు దర్భలను, రెండు వస్త్రములతో చుట్టి పూర్వపు దిక్కుకు లింగము యొక్క శిరస్సునుంచి, గోముఖమును అధోముఖముగా నుండునట్లుంచి,
మంత్రము :- “తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహే | తన్నోరుద్రః ప్రచోదయాత్” ||
ఈ మంత్రమును పఠిస్తూ ధాన్యపు పాత్రలో పరుండబెట్టి, దానిని ఎడమ చేయితో బట్టుకొని ప్రాణాయామము నాచరించి. వేయి అథవా నూటావకటి సార్లు శివపంచాక్షరి మంత్రము చేత నభిమంత్రించవలెను. తదుపరి ఆ శయన స్థలమునుండి శివలింగమును దీసికొని (పూ॥ ప॥ చెప్పిన విధముగా) పంచామృతముచేత వేర్వేరుగా అభిషేకమొనర్చవలెను. అది (అభిషేకము) జేయువిధము.
క్షీరాభిషేక మంత్రము :- ఓం, ఆప్యాయ...సంగథే” ఓం శివలింగాయ నమః క్షీరేణ స్నాపయామి
అని పాలతో నభిషేకించి, ఆ పిదప శుద్ధోదకముతో నభిషేకింపవలెను.
మంత్రము :- “ఈశానః సర్వవిద్యానామీశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి, బ్రహ్మణోధిపతిబ్రహ్మా శివోమే అస్తు సదాశివోమ్” ఓం, శ్రీ శివలింగాయనమః శుద్ధోదకేన స్నాపయామి ||
అని యుచ్చరించి శుద్ధోదకముతో నభిషేకించి ఆ మీదట పెరుగుతో నభిషేకింపవలెను.
మంత్రము :- “ఓం దధిక్రావణ్ణే అకారిషం...” ఓం శ్రీ శివలింగం దధ్నా స్నాపయామి
అని పెరుగుతో నభిషేకించి, తదుపరి శుద్ధోదకముతో అభిషేకింపవలెను.
మంత్రము :- “తత్పురుషాయ విద్మహే, మహాదేవాయ ధీమహే | తన్నోరుద్రః ప్రచోదయాత్” ||ఓం|| శ్రీ ||శివలింగం|| శుద్ధోదకేన స్నాపయామి ||
అని శుద్ధోదకముతో నభిషేకింపవలెను. ఆ మీదట నెయ్యి గల్సిన జలముచేత నభిషేకింపవలెను.
మంత్రము :- “శుక్రమసి...సూర్యస్యరశ్మిభిః” ఓం || శ్రీ || శివలింగం || ఘృతేన స్నాపయామి ||
అని ఘృతముతో నభిషేకించి, పిదప శుద్ధోదకంతో నభిషేకింపవలెను.
మంత్రము :- “అఘోరేభ్యో థఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః, సర్వేభ్యో సర్వ శర్వేభ్యోనమస్తే అస్తు రుద్రరూపేభ్యః || ఓం||శ్రీ|| శివలింగం|| శుద్ధోదకేన స్నాపయామి ||
అని శుద్ధోదకముతో నభిషేకింపవలెను. పిదప తేనె గల్సిన జలముతో నభిషేకింపవలెను.
మంత్రము :- “ఓం మధువాతాఋతాయతే, మధుక్షరంతి సింధవః, మాధ్వీర్నస్సంత్వోషధీః మధునక్తముతోషసి। మధుమత్పార్థివగ్రంరజః। మధుద్యౌరస్తునః పితా, మధుమాన్నోవనస్పతిః। మధుమాగ్రం అస్తు సూర్యః మాధ్వీర్గా వోభవంతునః” ||ఓం|| శ్రీ ||శివలింగం|| మధునా స్నాపయామి ||
అని తేనె గల్సిన జలముతో నభిషేకించిన పిదప శుద్ధోదకముతో నభిషేకించునది.
మంత్రము :- “వామదేవాయ నమోజ్యేష్ఠాయనమో రుద్రాయనమః। కాలాయనమః కలవికరణాయనమో బలవికరణాయనమో బలప్రమథనాయ నమస్సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః” ||ఓం|| శ్రీ ||శివలింగం|| శుద్ధోదకేన స్నాపయామి ||
అని శుద్ధ జలముచేత అభిషేకింపవలెను. ఆ పైన శర్కర మిశ్రితమైన జలముతో నభిషేకింపవలెను.
మంత్రము :- ఓం స్వాదుః...ఆదాభ్యః ||ఓం|| శ్రీ ||శివలింగం శర్కరోదకేన శుద్ధోదకేన స్నాపయామి ||
మంత్రము :- “సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయవై నమః | భవే భవేనాతి భవే భజస్వ మాంభవోద్భవాయనమః || శ్రీ శివలింగాయ నమః శుద్ధోదకేన స్నాపయామి ||
అని యుచ్చరించి శుద్ధోదకముతో నభిషేకింపవలెను. (ఇట్టి శుద్ధ జలాభిషేక మంత్రములకు పంచబ్రహ్మ మంత్రములని పేరు) ఈ విధముగా పంచామృతా భిషేకమొనర్చి ప్రాణప్రతిష్ఠ జేయవలెను.
