27. స్త్రీ దేవతను ఆరాధించునప్పుడు మంత్రములు | Strī dēvatanu ārādhin̄cunappuḍu mantramulu | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

27. స్త్రీ దేవతను ఆరాధించునప్పుడు మంత్రములు | Strī dēvatanu ārādhin̄cunappuḍu mantramulu | Veerashaiva Purohitam

P Madhav Kumar

హరిద్రా ధారణ మంత్రము :- “హరిద్రా స్వర్ణ వర్ణాభా - సర్వసౌభాగ్యదాయినీ | సర్వాలంకారముఖ్యాహి - దేవీత్వం ప్రతిగృహ్యతాం || (ఓం...నమః) హరిద్రాం సమర్పయామి.

కుంకుమధారణ మంత్రము :- “హరిద్రాచూర్ణ సంయుక్తం - కుంకుమం కామదాయకం | వస్త్రాలంకరణం సర్వం - దేవీత్వం ప్రతిగృహ్యతాం || (ఓం...నమః) కుంకుమం సమర్పయామి.

కజ్జల ధారణము (కాటుక) :- “కజ్జలం కామికం రమ్యం - కామినీ కామసంభవం | నేత్రయోర్భూషణార్థాయ - కజ్జలం ప్రతిగృహ్యతాం || (ఓం...నమః) కజ్జలం సమర్పయామి.

సింధూర ధారణము :- “ఉదితారుణ సంకాశం - జపాకుసుమ సన్నిభం | సీమంత భూషణార్థాయ - సింధూరం ప్రతిగృహ్యతాం || (ఓం...నమః) సింధూరం సమర్పయామి.


కంఠసూత్ర ధారణము :- “మాంగళ్యం తంతుమణిభి - ర్ముక్తా ఫలవిరాజితం | కంఠస్య భూషణార్థాయ - ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం || (ఓం...నమః) కంఠసూత్రం సమర్పయామి.

కంకణ ధారణము :- “కాచస్యనిర్మితం దివ్యం - కంకణంచ సురేశ్వరీ | హస్తాలంకరణార్థాయ - కంకణం ప్రతిగృహ్యతాం || (ఓం...నమః) కంకణం సమర్పయామి.

తాళపత్ర ధారణము (కర్ణ కుండలాలు - కమ్మలు) :- “నానాభరణ శోభాఢ్యం - నానారత్నోపశోభితం | అర్పితంచమయాదేవీ - కుండలం ప్రతిగృహ్యతాం || (ఓం...నమః) కర్ణకుండలం సమర్పయామి.

నాసికా భూషణ మంత్రము :- “మహేశ్వర మహాదేవి - శారదా భువనేశ్వరీ | ఇదం స్వర్ణం ప్రదాస్యామి - శాంతిస్తుష్టిశ్చాస్తు పుష్టిశ్చాస్తు || (ఓం...నమః) నాసికాభరణం సమర్పయామి.

(ఇదిస్త్రీ దేవతా విశేషోపచారము)

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow