30. నామ కర్మణ విధానము : ఆందోళారోహణం | Namakarana Vidhanamu : Andolarohanam | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

30. నామ కర్మణ విధానము : ఆందోళారోహణం | Namakarana Vidhanamu : Andolarohanam | Veerashaiva Purohitam

P Madhav Kumar

జ్యోతిశ్శాస్త్రోక్త శుభ దినమునందు బిడ్డతోబాటు దంపతులు మంగళస్నానము నాచరించి, శుభాసనములో గూర్చుండి ఆచమన ప్రాణాయామములజేసి, దేశకాలాదులనుబేర్కొని

మంత్రము :- “ఏవంగుణ...శుభ తిథౌ అస్యశిశోః ఆయు ష్యాభివృద్ధ్యర్థం వ్యవహారార్థమావాం నామకరవావహై” ॥

అని సంకల్పమును జెప్పి, ఒక కంచు పాత్రలో బియ్యమునునింపి దాన్నిదీసికొని అందు ఏమాసములో శిశు జననమో ఆ మాసముయొక్క పేరు, పుట్టినదినము, నక్షత్రము, పేరును ఉన్నదున్నట్లుగా వ్రాయుట.


నామకరణ విధి (Naming Ritual Details)

మాసము పేరు, నక్షత్రనామము, వ్యవహారనామము, వీటిని వ్రాసి (అందులో వ్యవహారనామము మగశిశువుకు శివ, రుద్ర, మొదలగునవి సమాక్షరములను, ఆడబిడ్డకు పార్వతీ, రుద్రాణి, మున్నగు అసమాక్షరములతో నుండవలెను.) పేరునకు మొదలు చివరకి శ్రీకారసువ్రాసి

మంత్రము :- “మాసనామ, నక్షత్రనామ, వ్యవహార నామాధిష్ఠిత దేవతాభ్యోన్నమః” ॥

అను నామ మంత్రమును గంధాక్షతాదులతో బూజించి, శిశువు తండ్రి ఇది శిశువుయొక్క పేరని అందరికి తెలుపవలెను.

అందరు “తథై వాస్తు” అని చెప్పవలెను.

ఆపేరునే శిశువుయొక్క కుడిప్రక్క చెవిలో జెప్పి, అదే పేరుతోనే గురువులకు, మాహేశ్వరులకు శిశువుచేత నమస్కరింపం జేయవలెను. ఆ మీదట (జాతకకర్మలో జెప్పిన)

మంత్రము :- “అంగాదంగా త్సంభవసి...శరదశ్శతం”

అనే మంత్రముతో మరల మరల మూఁడు సార్లు అభిమంత్రించి శిశువుయొక్క మస్తకమును ఆఘ్రాణించవలెను. పిదప మాస నామాదుల నుచ్చరిస్తూ గురు-లింగ-జంగములకు బిడ్డతో నమస్కరింపం జేయవలెను. తరువాత

మంత్రము :- “అగ్నిరాయుష్మాంత్సవనస్పతిభిరాయుష్మాన్ తేనత్వాయుషా యుష్మంతం కరోమి ॥౧॥ సోమ ఆయుష్మాంత్స ఓషధీభి రాయుష్మాంతేన త్వాయుషా యుష్మంతం కరోమి ॥౨॥ యజ్ఞ”


ఆశీర్వాదము & ముగింపు (Blessings & Conclusion)

“ఆయుష్మాంత్సదక్షిణాభిరాయుష్మాన్ తేన త్వాయుషా యుష్మంతం కరోమి ॥౩॥ బ్రహ్మాయుష్మత్తద్బ్రాహ్మణై రాయుష్మత్తేన త్వాయుషా యుష్మంతం కరోమి ॥౪॥ దేవా ఆయుష్మంతస్తే ఒమృతే నాయుష్మంతేస్తేన త్వాయుష్మంతం కరోమి ॥౫॥”

ఈ ఐదు మంత్రములను శిశువు చెవిలో ఉచ్చరించవలెను. (ఆడ) శిశువైతే:

మంత్రము :- “సర్వస్మాదాత్మనః సంభూతాని సాజీవః శరదః శతం”

అను మంత్రము చేత నభిమంత్రించ వలెను. తరువాత మాహేశ్వరులందరు:

మంత్రము :- “శతమానంభవతి శతాయుః పురుషశ్శతేంద్రియః । ఆయుష్యేవేంద్రియే ప్రతి తిష్ఠతి”

అని ఈ ఆశీర్వాద మంత్రమును బఠిస్తూ శిశువు నాశీర్వదించ వలెను. తదుపరి శక్త్యానుసారముగా మాహేశ్వరులకు భోజన దక్షిణ తాంబూలాదులతో తృప్తి పరచవలెను. ఆమీదట అదేదినమునందు వృద్ధాచారము ననుసరించి ముత్తయిదువలతో ఆందోళారోహణ (తొట్టెలలో బెట్టుట) కార్యమును నెరవేర్చి, పూర్వోక్త నామమును ముత్తయిదువలతో జెప్పించవలెను. మరియు ముత్తయిదువలకు భోజనము జేయించి వాయినము లొసంగి వారిని తృప్తి పరచవలెను.

(ఇది నామకరణము-ఆందోళనారోహణ విధానము) సమాప్తము.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow