31. అన్నప్రాశనము | Annaprasana Ceremony
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

31. అన్నప్రాశనము | Annaprasana Ceremony

P Madhav Kumar
శిశువు జన్మించిన 6-8 మాసములలో దంతములు వచ్చినపిదప శిశువుకు అన్నప్రాశనము చేయించవలెను. అన్నమును తినిపించుటకు మొదటి దినము పుణ్యాహవాచనము, నాందీ సమారాధనము నాచరించి, అన్నప్రాశన దినమున ప్రాతఃకాలము స్నానము ఇష్టలింగార్చన ముగించుకొని దేశ కాలాదులనుచ్చరించి.

మంత్రము :- 
"ఏవంగుణ... శుభతిథౌ ధర్మపత్న్యాంజాతస్య మమ కుమారస్యాయుష్యభి వృద్ధ్యర్థం ఇ(...) శర్మణం కుమారం అన్న ప్రాశనేన కర్మణా సంస్కరిష్యే" అని చెప్పి.

మంత్రము :- "అన్న ప్రాశనాంగత్వేన ఆచమనాధికార సిద్ధ్యర్థం రక్షాబంధనం కరిష్యే" అని శిశువుచేతికి (రక్ష) కంకణమును కట్టాలి.

కంకణధారణ మంత్రము :-

మంత్రము :- 
"బృహత్సామచక్ర భృద్వృద్ధవృష్ణియం । 
త్రిష్టభోజ ఉక్షిత ముగ్రవీరం ఇంద్రం సోమేన 
పంచదశేన మధ్యమిదం వాతేన సగరేణరక్ష ॥"

పై మంత్రము నుచ్చరించి (రక్ష) కంకణ బంధనమును గావించి తదుపరి ఆచమనము ప్రాణాయామము నాచరించి, ఒక పాత్రలో పెరుగు, నెయ్యి, తేనె, అన్నమును గల్పి దీసికొని.

మంత్రము :- 
"భూరపాంత్యషధినాగ్ం రసం ప్రాశయామి శివాస్తా ఆప ఓషధయస్సంతు । 
అనమీవాస్తా ఆపఓషధయస్సంతు । ...శర్మన్ ॥"

భూరపాంత్యౌషధీనాగ్ం రసం ప్రాశయామి। 
శివాస్తా ఆప ఓషధయస్సంతు। 
శర్మన్ సువరపాంత్యౌషధీనాగ్ం రసం ప్రాశయామి । 
శివాస్తా ఆప ఓషధయస్సంతు ...శర్మన్ ॥

ఓం భూర్భువస్సువరపాం త్యౌషధీనాగ్ం రసం ప్రాశయామి । శివాస్తా ఆప ఓషధయస్సంతు అనమీవాస్తా ఆప ఓషధయస్సంతు ...శర్మన్ ॥

అను మంత్రము నుచ్చరించి శిశువు నోటిలో బుక్క బెట్టవలెను. మిగత అన్నమును మౌనముతో (మంత్రము నుచ్చరించకుండా) తినిపించవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow