33. గర్భాధాన విధి | Garbhadhana | Veerashaiva Purohitam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

33. గర్భాధాన విధి | Garbhadhana | Veerashaiva Purohitam

P Madhav Kumar
జ్యోతిష్కుల నుండి నిశ్చయింపబడిన శుభదినమునందు దంపతులు మంగళస్నానము నాచరించి పూజా సామగ్రిని సంగ్రహించుకొని ఒక భద్రాసనమున గూర్చొని

మంత్రము : 
హరిః ఓం తదేవ లగ్నం, సుదినము తదేవ-తారాబలం చంద్రబలం తదేవ-విద్యాబలం దైవతదేవ, గౌరిపతే తేంఘ్రి యుగం స్మరామి ॥ "యశ్శివో నామ రూపాభ్యాం, యాదేవీ సర్వమంగళా । తయోస్సంస్మరణా త్పుంసాం, సర్వతో జయ మంగళం, ॥ సుముహూర్తమస్తు ॥ సుప్రతిష్ఠమస్తు ॥

అని యీశ్వరుని ప్రార్థించి వెనుక సర్వపూజా ప్రకరణమునందలి మంత్రములను బఠించి, వెనుక జెప్పిన సమస్త పూజా ప్రకరణమునందు చెప్పబడిన మంత్రమును బఠించి ఘంటానాదము నాచరించి

మంత్రము :- 
"ఋగ్వేదాయస్వాహా । యజుర్వేదాయస్వాహా । సామ వేదాయ స్వాహా । అధర్వణ వేదాయస్వాహా । ఇతిహాస పురాణాయస్వాహా । అనంతాయ నమః । సూక్ష్మాయనమః । శివోత్తమాయ నమః । ఏక నేత్రాయ నమః । త్రిమూర్తయే నమః । శిఖండినే నమః । శ్రీ కంఠాయ నమః । హృదయాయ నమః । శిరసే స్వాహా । శిఖాయై నమః । కవచాయ నమః । నేత్రత్రయాయ నమః । అస్త్రాయ నమః ॥

ఈ వాక్యములను జెప్పి, ఆ చమనము నాచరించి । జలముతో నలదా జ్ఞానేంద్రియములను ముట్టి, ప్రాణాయామము నాచరించి, మనస్సును స్థిరపరచవలెను ॥ అనంతరము వెనుక జెప్పిన మంత్రముల నుచ్చరించి దేశకాలాదులనుచ్చరించి

"ఏవంగుణ విశేషణ విశిష్టాయామ్స్యాం శుభతిథౌమమధర్మపత్న్యాః గార్భిక భేజిక దోష పరిహారార్థం, ఆధార, ఈ పంక్తులు వదిలినారు. మా, తిథౌఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ సాంబసదాశివ ప్రీత్యర్థే ॥ ( ) గోత్రోద్భవయోః ఆవయోః సత్సంతాన సౌభాగ్య ఫల సిద్ధ్యర్థం రాత్రౌ గర్భాధానార్థం కర్మ కరిష్యమాణః గర్భాధానాంగభూతనందీ శోభన దేవతా ప్రీత్యర్థనాందీ సమారాధనాభ్యం కర్మకరిష్యమాణః । గర్భాధాన లగ్నకాలె ఫల దానానికరుం ఫలపూజాభ్యం కర్మకరిష్యమాణః । తదంగత్వేన తదా దోషదృ్శర్థం వృద్ధ్యర్థం అభ్యుదయార్థం, శాంత్యర్థంచ మాహేశ్వరై సహస్వస్తి పుణ్యాహవాచనం కరిష్యే ॥

తదాదౌని నిర్విఘ్నేన పరిసమాప్తి ద్వారా ఉత్తరోత్తరాభి వృద్ధ్యర్థం శ్రీమహా గణాధిపతి పూజాం కరిష్యే॥

అని సంకల్పమును జెప్పి, మొదలు గణపతిపూజను జేయవలెను. గణపతి పూజను సర్వపూజా ప్రకరణమున జెప్పినట్లు గా జేయవలెను.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow