Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

22. దీపాల కాంతుల్లో మా అంజన్న | Deepala Kantullo Maa anjanna | హనుమాన్ భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
దీపాల కాంతుల్లో నా అంజన్న
దివ్య స్వరూపుడవే మా అంజన్న

కొండగట్టు క్షేత్రమందు మా అంజన్న
ఎంత గొప్ప దేవుడవే మా అంజన్న

మా పిల్లపాపల్ని చల్లగా చూడయ్య
మా పాడి పంటల్ని పచ్చగా చూడయ్య
మా అండదండగా నీవుండ అంజన్న
ఎంత చక్కని దేవుడవే మా అంజన్న
మా అండ నీవుండయ్య మా అంజన్న

గుండంలో స్నానాలు.. గుడి చుట్టూ దండాలు
గుడిలోన నీ పూజ మెండుగా చేసేము
టెంకాయ కొట్టేము.. కోర్కెలు తీర్చయ్య
జిల్లేడాకుల దండలు మా అంజన్న
మనసుతో నీకేతుము మా అంజన్న

ఘనఘన గంటలు నీ గుడిలో మోగంగా
లక్షల భక్తులు నీ పూజ చేసేరు
భక్తుల కాపాడే భగవంతుడవు నీవే
సిరి గల దేవుడవే మా అంజన్న
చింతలు తీర్చావయ్య మా అంజన్న

వారవారం నాడు.. మంగళవారం నాడు
మరువకుండా నిన్ను కొలుచుకుంటామే
ఒక్కపొద్దులతోని పూజల్ని జరిపేము
కోటొక్క భక్తులంత మా అంజన్న
నిను కొలిచే భక్తులంత మా అంజన్న
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow