Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

21. పూజ చేయనా పాద పూజ చేయనా | Lord Hanuman Devotional Telugu Song | Anjaneya Swamy Songs

P Madhav Kumar
పూజ చేయనా పాద పూజ చేయనా ||2||
శ్రీ హనుమాన్ బంగారు పాదాలకు పూజ చేయనా

పన్నీరు జలాలతో పాదాలు కడగనా
పట్టు వస్త్రాలతో పాదాలు తుడవనా
||పూజ చేయనా||
పసుపు కుంకుమలతో పాద పూజ చేయనా
పన్నీరు గంధము పాదాలకు పూయనా
||పూజ చేయనా||
చామంతి గులాబీ సంపెంగ పూలతో
నిత్య మాలలతో నిత్యము పూజించనా
||పూజ చేయనా||
మారేడు తులసి దళములతో
గులాబీ పూలతో హారాలే వేయనా
||పూజ చేయనా||
కరుణ కురిసే కళ్ళు చల్లగా మొక్కునా
సింధూర తిలకము నీకు దిద్దనా
||పూజ చేయనా||
భక్తుని బ్రోచేటి బంగారు హనుమకు
పాదాభివందనం మరి మరి చేయనా

పూజ చేయనా పాద పూజ చేయనా
శ్రీ హనుమాన్ బంగారు పాదాలకు పూజ చేయనా
శ్రీ హనుమాన్ బంగారు పాదాలకు…

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow