Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

ప్రశ్న: దీక్షా మాలలోని 108 సంఖ్యా బలమేమిటి? What is the significance of the number 108 in the Deeksha Mala?

P Madhav Kumar
సమాధానం:

సర్వాంతర్యామి, సకల జీవకోటి వ్యాపకుడు, అమిత నామధేయుడైన భగవంతుడిని భక్తులు వివిధ రూపాలలో కొలుస్తూ, సకల నామాలతో పూజిస్తారు. భక్తులు ఏ పేరుతో పిలిచినా, భక్తజన చిత్తస్వరూపుడైన ఆ సర్వేశ్వరుడు వారి వారి మనోభీష్టం ప్రకారం ప్రసన్నుడవుతాడు.

భక్తుల నమ్మకాలకు అనుగుణంగా ప్రత్యేక పేర్లతో పిలవబడే స్త్రీ, పురుష దేవతలందరి సేవ కొరకు మహర్షులు, యోగులు తమ పూజా విధానంలో భాగంగా సహస్రనామావళిని, అష్టోత్తర శతనామావళిని (108) రూపొందించారు.

జపమాలలు - పూసల సంఖ్య (ఫలితాలు)

పూజా క్రతువులలో భగవంతుని ధ్యానించడానికి 108 పూసలు గల (రుద్రాక్ష, తులసి, గంధం) మాలను జపమాలగా ధరించి, ఒక్కొక్క పూసకు ఒక్కొక్క నామాన్ని స్మరిస్తారు. వివిధ కోరికల సిద్ధికోసం యోగీశ్వరులు మాలలలోని పూసల సంఖ్యను ఈ క్రింది విధంగా నిర్దేశించారు.

శక్తి సాధనకు 15 పూసలు
మోక్షం మరియు పుత్ర సంతానం కొరకు.
25 పూసలు ఆరోగ్య రక్షణకు
27 పూసలు ధనాభిలాషకు (ఐశ్వర్యం)
30 పూసలు సంపూర్ణ ఫలం & భగవత్ సాక్షాత్కారం కొరకు 108 పూసలు..

అందుకే, పూర్ణ ఫలితాన్నిచ్చే 108 పూసలు గల మాలను మెడలో ధరించి, దీక్షా కాలమంతా ఆ అయ్యప్ప స్వామిని జపించాలి. ఇలా కంఠంలో ధరించిన మాల భక్తుని వక్షస్థలమును (హృదయాన్ని) తాకుతూ... త్రికరణ శుద్ధిగా భగవంతుని ధ్యానించడానికి, ఆత్మనిగ్రహం పెంపొందించుకోవడానికి అద్భుతంగా తోడ్పడుతుంది.

ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప! 🙏

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow