వస్తున్నాడమ్మా అంజనతనయుడు
అంజన్న వచ్చెనమ్మా ఆనంద మాయెనమ్మా
మన యింట లక్ష్మీదేవి కొలువై యుండెనమ్మా
దానవులను సంహరించిన దేవుడొచ్చేనమ్మా
ధర్మమును కాపాడే స్వామి వచ్చెనమ్మా
భక్తుల కోరికలు తీర్చే స్వామి వచ్చెనమ్మా
మన యింట ఆనంద నిలయమాయెనమ్మా
శాంతి సౌఖ్యములు ఒసగే స్వామి వచ్చెనమ్మా
కంటికి రెప్పలా కాపాడే దేవుడొచ్చేనమ్మా
శ్రీరామ దూత మన యింటికి వచ్చెనమ్మా
అష్టైశ్వర్యములు ఇచ్చే స్వామి వచ్చెనమ్మా
