Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

39. బంతిపూలదండ అటేత్తునా నేనిటేత్తునా | bantipoola danda Atettuna |

P Madhav Kumar
బంతిపూలదండ అటేత్తునా నేనిటేత్తునా
అంజన్న మెడలో మా లేత్తునా మణిహారమెత్తునా ॥4॥

అందాల మారుతి నిన్ను చేరి వేడితి ॥4॥
బాల బ్రహ్మచారివని భక్తితోడ మ్రొక్కితి ॥4॥
రామాంజనేయ మమ్ము రక్షించు మంటిమి ॥4॥
కపిరాజ కరుణతోడ కాపాడమంటివి 
॥బంతి పూలదండ॥
ముక్కోటి దేవతల రూపమే అంజన్న ॥4॥
మూడు లోకాలకు దీపము నీవన్న ॥4॥
ముక్కోటి రూపమే నీదివ్య తేజమయ్య ॥4॥
సంజీవని నాయుడ చక్కని దేవుడ

కేసరి నందన భక్తజనవందన ॥4॥
ఇలలోని జనులకు ఇలవేల్పు నీవయ్య ॥4॥
నీ భజన చేసిన భాగ్యాలు కలుగునయ్య ॥4॥
నీ రూపమే నాకు ఎదనిండ వెలుగునయ్య 
॥బంతి పూలదండ॥
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow