Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

241. చెట్టునక పుట్టునక వాగునక వంకనక | Chettanaka Puttanaka Vaaganaka | అయ్యప్ప స్వామి భజన పాటల లిరిక్స్

P Madhav Kumar
చెట్టునక పుట్టనక వాగనక వంకనక
నీ కొండకొస్తున్నానయ్య అయ్యప్ప
నిన్ను చూడ వస్తున్నానయ్య!

రాళ్లనక రప్పనక రేయినక పగలనక
నీ నడిచి వస్తున్నానయ్య అయ్యప్ప
వెనకడుగు నేనేయ్యనయ్యా!

నా గుండె చాటున బాధల భారాన్ని
ఇరుముడిలో ముడుపు కట్టి
నా కంటి కన్నీళ్లను నా ఇంత కష్టాలు
తొలగిపోవాలని మొక్కే “ఓ”

శరణమంటూ నిన్ను పిలిచిన వాడినయ్య
ఆ కొండపై కుదురున్నావు అయ్యప్ప
నీవెంత చూస్తున్నావు మా
శరణాలు వింటున్నావు
మణికంఠ నా కంట నీవున్నావు

చెట్టునక పుట్టనక వాగనక వంకనక
నీ కొండకొస్తున్నానయ్య అయ్యప్ప
నిన్ను చూడ నేనూ వస్తున్నానయ్య!
Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow