ప్రశ్న;:
భగవాన్! యోగాభ్యాసము ఎంత కాలము సాగవలెను?
మహర్షి :
ఆత్మసిద్ధి కలిగేవరకు యోగాభ్యాసము సాగవలెను. ఒక్కొక్క ఆటంకాన్ని జయిస్తూ చివరకు అన్ని ఆటంకాలను జయించే వరకు సాధన సాగవలెను.
ఈ పద్ధతి ఎలాంటిది అంటే 'కోట నుండి వెలువడుతున్న శత్రు భటులను ఒక్కొక్కరిని హతమారుస్తూ చివరికు కోటనే వశం చేసుకోవటం లాంటిది.
శ్రీ రమణా మహర్షీ
జై శబరీష భక్త బృందం - పాలమూరు.
