రావయ్య మా అయ్యప్ప దేవా
నైవేద్య మొందగ రావయ్యా. ఆ.... ఆ.....(2)
ధూప దీపమ్ నీకే తండ్రి అటుకులు బెల్లం నీకే తండ్రి
ఆరవన్న పాయసం నీకే తండ్రి పంచామృతములు నీకే తండ్రి
అలకమానీ...... .
అలకమాని రావయ్యా......ఆ..ఆఆ....
ఆరగించి పోవయ్యా...
//రావయా//
తెలిసీ తెలియక చేసినట్టి తప్పులు ఎన్ని ఉన్న గాని
తండ్రిలాగా ఆదరించి తప్పులన్నీ మన్నించవయ్యా....
భారమంతా నీదయా....... బంగారు తండ్రి మా అయ్యప్ప
అలకమానీ...... .
అలకమాని రావయ్యా......ఆ..ఆఆ....
ఆరగించి పోవయ్యా
//రావయా//
కల్లకపటం లేని స్వాములు, కరములెత్తి వేడినారు
ఆత్మ బంధువు నీవే నంటు, ఆర్తితో నిను పిలిచినారు
అలకమానీ...... .
అలకమాని రావయ్యా......ఆ..ఆఆ....
ఆరగించి పోవయ్యా
//రావయా//
సర్వము నీవు అంటూ నమ్మి, దివ్య మైన దీక్ష బూని
శ్రమలనెన్నో ఓర్చుకోని, నియమ నిష్ఠలు పాటించి
నీకు సేవలు చేయగా.. ఆ.... వేచిరయ్యా స్వాములు
అలకమానీ...... .
అలకమాని రావయ్యా......ఆ..ఆఆ....
ఆరగించి పోవయ్యా
//రావయా//