పంబ తీరం మణిహారంతో దొరికిన మణికంఠా పందళ రాజుకు మణికంఠా ||పంబ||
పరి పరి విధముల పిలిచేమయ్యా రావా మణికంఠా
హరిహర తనయ మణికంఠా ||పంబ||
నిత్య సత్యవో దేవా నీకు నీరాజనమయ్యా దేవా నీరాజనమయ్యా
నిర్మల రూపా నీలిమలేశా నిత్య నందమయ్యా ||పంబ||
ముల్లోకాలను మెప్పించిన ఓ దివ్యశక్తి మూర్తి ఓ దివ్యశక్తి మూర్తి ||2||
అండపిండ బ్రహ్మాండము నీవే కలియుగ వరదయ్యా స్వామి ||పంబ||
పంచగిరిశా ఓ శబరిశా స్వామి జగదీశా
ఓ స్వామి జగదీశా ||2||
పరమ దయళ పతితపావన పూర్ణ నందమయ్యా ||పంబ|