దానవులు బ్రహ్మ ను మెప్పించి వరములు పొంది మునులను జనులను హింసించి నప్పుడు మహావిష్ణువు మరియు పరమేశ్వరుడు, మునులను మరియు భక్తులను రాక్షసుల భాధల నుండి రక్షించుటకు అనేక రూపములలో అవతారములు ఎత్తియున్నారు.
వారు రాక్షసులను నిర్జించి, మునులను, భక్తులను, రక్షించిన ప్రదేశములు అన్నియు దివ్య క్షేత్రములు గా,
వారు రూపు దాల్చిన నామములతో పిలువబడుచున్నవి.
శివ క్షేత్రములు 64 ఉన్ననూ, అందు 12 మాత్రము, ద్వాదశ జ్యోతిర్లింగములు గా ఖ్యాతి గాంచినవి.
కేదార్నాధ్ తప్ప, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు లో లింగాకారం లో శివుడు దర్శనం ఇచ్చును.
ద్వాదశ జ్యోతిర్లింగ దర్శనం ఆధ్యాత్మికము గా ఉన్నత స్థితి పొందిన సమయం లో సాధ్యపడును.
జ్యోతిర్లింగాలు వివిధ రూపముల తో ఖ్యాతి నార్జించాయి.
శివపురాణం నందు చెప్పబడిన కధనం ప్రకారం,
బ్రహ్మ మరియు విష్ణువు ఇద్దరిలో ఎవరు గొప్పవారు అను తర్కం వచ్చింది.
శివుడు మూడు లోకములు కలుపుచూ జ్యోతిర్లింగ రూపంలో, వెలుతురు తో ఒక స్తంభం సృస్టించి, స్తంభం చివర కనుగొనిన వారు అధికులని తెలిపినాడు.
బ్రహ్మ మరియు విష్ణువు స్తంభం చివర కనుగొనుటకు,
బ్రహ్మ స్తంభం పైకి,
విష్ణువు క్రిందకు ప్రయాణించినారు.
బ్రహ్మ మొగలి పూవు సాక్షము తో స్తంభము చివర చూసినానని బొంకినాడు.
విష్ణువు మాత్రం కనపడ లేదని అంగీకరించినాడు.
శివుడు రెండవ స్తంభం రూపం లో ప్రత్యక్షమై బ్రహ్మను క్రతువు లందు, పూజలందు, పూజ్య స్థానము లేకుండా,
మొగలిపువ్వు తన పూజకు అనర్హము గాను శపించినాడు.
విష్ణువు మాత్రము శాశ్వతము గా పూజలు అందుకొను వరం ఇచ్చాడు.
జ్యోతిర్లింగములు అన్నియు మండుచూ వెలుగు నిచ్చు స్థలములు గా పేరు కాంచినవి.
కేదార్నాధ్ తప్ప, పరమ శివుని కి సంబంధించిన ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రములు అన్నిటి లోనూ లింగాకారం లోనే శివుడు దర్శనం ఇస్తాడు.
భారతదేశము నకు ఉత్తరము గా హిమాలయము లందు శివుని నివాసమైన కైలాస పర్వతం నకు సమీపంలో,
ఉత్తరాఖండ్ రాష్ట్రము నందున్న ఏకైక జ్యోతిర్లింగం కేదారేశ్వర జ్యోతిర్లింగం.
కేదార్నాథ్ జ్యోతిర్లింగం, ద్వాదశ జ్యోతిర్లింగము లలో, పదకొండవ జ్యోతిర్లింగం.
మరియు జ్యోతిర్లింగ యాత్ర లో కష్టతరమైన యాత్ర.
కేదార్నాధ్ జ్యోతిర్లింగ దర్శనము నకు సంవత్సరము లో సుమారు మే లేదా జూన్ నెల నుండి నవంబరు నెల లో దీపావళి వరకు మాత్రమే సాధ్య పడుతుంది.
ఆరు నెలలు మాత్రమే ఆలయం తెరచి ఉంటుంది.
నవంబరు నుండి మరుసటి సంవత్సరం మే లేదా జూన్ మాసం లో బదరీ, కేదార్ ఆలయ కమిటీ నిర్ధారించిన తేదీ వరకు గంగోత్రి, యమునొత్రి మరియు బదరీనాద్ ఆలయములతో పాటుగా మూయబడి ఉంటుంది.
ఈ ఆరునెలలు చలి కాల మగుట వలన విపరీతము గా కురియు మంచు వలన రవాణా సదుపాయం కూడా ఉండదు.
కేదార్నాధ్ యాత్ర చేయుటకు గాను రుద్రప్రయాగ లో ఆగి, రుద్రప్రయాగ నుండి ప్రయాణించ వలెను.
రుద్రప్రయాగ నుండి గౌరీకుండ్ వరకు ఆగస్త్య ముని, గుప్తాక్షి, పాత, సీతాపూర్ మరియు సొనప్రయాగ (పంచ ప్రయాగల లోది కాదు) ద్వారా,
ప్రవేటు వాహనం లేదా బస్సులో ఆచట చేరి, స్థానిక ఆలయములు దర్శించి,
గుర్రం లేదా నడచి లేదా పల్లకీ పై కేదార్నాధ్ చేర వలయును.
ప్రయాణం చేయలేని వారు, గుప్తాక్షి వరకు రోడ్డు ప్రయాణం చేసి,
గుప్తాక్షి వద్ద నున్న పాత హెలీపేడ్ నుండి, హెలీకాప్టర్ ముందుగా బుక్ చేసుకొని కేదార్నాథ్ వెళ్ళి రావచ్చును.
హేలీకాప్టర్ సౌకర్యము ఉదయం నుండి సాయంత్రం వరకు మాత్రమే లభించును.
హెలీకాప్టర్ సర్వీసు వారి ఛార్జీలు ఈ క్రింది విధము గా ఉన్నాయి.
గౌరీకుంద్ నుండి పల్లకి లేదా గుర్రము పై ప్రయాణించుటకు సుమారు 4000 నుండి 5000 వరకు చెల్లించ వలసి ఉంటుంది.
అటులనే, గుప్తాక్షి నుండి హెలీకాప్టర్ నకు రమారమి 9000 వరకు ఖర్చు కాగలదు.
హేలీకాప్టర్ సర్విస్ వారు, కేదార్నాధ్ నందు దర్శనము నకు 2 గంటలు సమయము కేటాయించి,
దర్శనము పిమ్మట మరలా పాత హేలీపాడ్ వరకు తీసుకు వచ్చేదరు.
దర్శనము నకు అదనపు రుసుం చెల్లించ వలసి ఉంటుంది.
కానీ దీని ఆవశ్యకత అంతగా లేదు.
2013 సం కేదార్నాథ్ వద్ద సంభవించిన జలప్రళయము నందు,
ఆలయము వెనుక భాగము నకు పెద్దబండ కొట్టుకు వచ్చి వరద నీటి వలన, ఆలయము నకు నష్టము కలుగ కుండా రక్షణ ఇచ్చినది.
అంతయు ఈశ్వరేచ్చ కానీ మరి యొకటి కాదు.
12 జ్యోతిర్లింగముల లో కేదార్నాథ్ పరమ పవిత్రమైనది.
మిగిలిన జ్యోతిర్లింగ దర్శనము నకు పడని శ్రమ కేదార్నాథ్ దర్శనము నకు శ్రమ పడ వలెను.
సముద్ర మట్టము నకు సుమారు 11000 అ. ఎత్తులో ఉన్న యీ పవిత్ర శైవ పుణ్యక్షేత్రము నందు, ప్రాణవాయువు అందుట కొంచెము కస్టతరము.
కావున హుద్రోగులు దర్శనము చేసుకొనుటకు వెళ్ళే అప్పుడు ఆక్సిజన్ సిలిండరు అందుబాటు లో నుంచు కొనవలయును.
ఇచట చలి చాలాఎక్కువ.
నర నారాయణులు ప్రతి రోజు, శివుని కేదార్నాథ్ నందు నివసించ వలసినది గా ప్రార్ధించెడి వారు.
శివుడు అంగీకరించి, కేదార్నాథ్ నివాసం గా చేసుకొని నాడు
నంది మూపురరూపము లో పరమశివుడు కొలువ బడుచున్న కేదార్నాధ్ దర్శనము నకు ముందుగా
శివుని తలభాగం పూజింప బడుచున్న ఖాట్మండు నకు 25 కి.మీ దూరము లో
భక్తాపూర్ వద్ద సూర్యభినయక్ పట్టణం లో నున్న దౌలేశ్వర్మహదేవ్ ఆలయం దర్శించ వలసి ఉంది
శివ రూపమైన నంది తల భాగము ఈ ఆలయము నందున్నదని, మిగతా భాగములు ఉత్తరాఖండ్ నందలి పంచకేదార్ క్షేత్రములని భావించేదరు
కేదార్నాధ్ చిహ్నము పశుపతినాధ్ ఆలయ గోపురం నందు దర్శనం ఇచ్చును
గర్భ గృహమందలి లింగము ఎద్దు మూపురము వలె త్రిభుజాకారము లో దర్శన మిస్తుంది
గుడి చుట్టూ పాండవులకు సంబంధించిన అనేక గుర్తులు కలవు
ఇక్కడి గిరిజనులు పాండవనృత్యము అనే పేరు తో నృత్యం చేసేదరు
బదరీనాథ్ నందు, స్వర్గారోహిణి పర్వత శిఖరం కేదార్నాధ్ పర్వత పంక్తి లోనిదే
స్వర్గారోహణం చేయు సమయం నందు ధర్మరాజు చేతివేలు ఇచ్చట పడినట్లు చెప్పెదరు
ధర్మరాజు బోటకనవేలు పరిమాణము లో ఒక లింగమును ఇచట ప్రతిష్టించాడు
మహిష రూపము లో శివుడు భీముని తో ఇచ్చట యుద్ధము చేసినట్లు, యుద్ధం లో భీముడు పరాజితుడై నట్లు చెపుతారు
భీముడు శివుని శరీరము ను నేతి తో మర్ధన చేసినాడు
అప్పటి నుండి ఇక్కడి త్రిభుజాకారపు జ్యోతిర్లింగము నకు, నేతి తో మర్ధన లేదా అభిషేకము చేసేదరు
నీరు మరియు బెల్ ఆకుల తోనూ చేయదురు.
స్థానిక స్థల పురాణం ప్రకారం, మహా భారత కాలం నందు
పాండవులు తమ దాయాదులు అయిన కౌరవులను కురు క్షేత్ర సంగ్రామము నందు సంహరించిన పిమ్మట
యుద్ధము నందు జరిగిన గోత్రీకుల హత్య మరియు గో హత్యల పాపముల నుండి విముక్తులు కావలెనని
తమ రాజ్య భారమును వంశీకులకు వప్పగించి
శివుని వెదకి దీవెనలు పొంద వలేనని వెతుకుచూ బయలు దేరినారు
వారు శివునికి ప్రీతి పాత్రమైన వారణాశి పుణ్యక్షేత్రము ను చేరగా
శివుడు వారిపై కురుక్షేత్ర సంగ్రామం నందు వారి వలన కలిగిన జన నష్టమునకు కోపించి
వారి నుండి తప్పించు కొనవలెనని తలచి
ఎద్దు (నంది) రూపము పొంది హిమాలయ ప్రాంతము నందు అదృశ్యమైనాడు
కాశీ నందు శివుని కనుగొన లేక పాండవులు హిమాలయము లకు వెళ్ళారు
భీముడు రెండు పర్వతముల మధ్య నిలబడి చూడగా
నంది గుప్తాక్షి వద్ద గడ్డి మేయుచూ కనిపించింది
భీముడు నంది తోక పట్టుకొని ఆపుటకు ప్రయత్నించ గా అదృశ్యమై ఆరుభాగాలు గా విడిపోయింది.
తల నేపాల్ నందు
సూర్యభినయక్ నందు
దౌలేశ్వర మహదేవ్
మూపురం కేదార్నాధ్
చేతులు తుంగనాధ్
బొడ్డు మరియు ఉదరభాగము మధ్యమహేశ్వర్
ముఖ భాగము రుద్రనాధ్
మరియు జుట్టు కల్పెశ్వర్ నందు పడినవి
పాండవులు శివుని కొలుచుటకు గాను సూర్యభినాయక్ నందు తప్ప
అయిదు స్థలాలు లో ఆలయములు నిర్మించి
వారి పాపముల నుండి విముక్తి పొందా
అయిదు ఆలయములు పంచకేదార్ అని ఖ్యాతి గాంచినవి
శివుని ముందు భాగము పడిన ప్రదేశము నందు నేపాల్ లోని ధోలేశ్వర్ ఆలయము ఉన్నది, అనిచెపుతారు
పాండవులు ఈ పంచకేదార్ ఆలయములు నిర్మించిన పిమ్మట
కేదార్నాధ్ నందు తపస్సు చేసి, యజ్ఞము చేసి
వారు స్వర్గలోక ప్రయాణం ప్రారంభించారు
కుంభరాశి కి చెందిన స్త్రీ పురుషులు,
కేదారేశ్వర్ జ్యోతిర్లింగము అర్చించిన, దోషములు తొలగునని చెప్పబడినది
కేదార్నాధ్ యాత్ర లో అందమైన జలపాతములు సరస్సులు చూడ వచ్చును
మనసు నకు మిక్కిలి ఆహ్లాదము గా యుండును.
*చొరబోరి తాల్
ఇది పురాతన సరస్సు.
దీనిని గాంధీ సరస్సు అని కూడా అంటారు
మహాత్మాగాంధీ అస్థికలు ఇచట నిమజ్జనం చేసినారు
ఇచ్చటనే శివుడు యోగ విద్య ను సప్త మహా ఋషులకు నేర్పినాడు.
*వాసుకి తాల్
ఇది హిమాలయము లపై కల అద్భుతమైన సరస్సు.
*గౌరీకుండ్
కేదార్నాథ్ యాత్ర లో గౌరీకుండ్ ప్రారంభ స్థానమై యున్నది.
ఇది సముద్ర మట్టమునకు సుమారు 6000 అ. ఎత్తున ఉన్నది
గౌరీకుండ్ ఉకీమత. * * ్ నకు 28 కి.మీ. మరియు
సోనప్రయాగకు 6 కి.మీ. దూరము లో నున్నది.
2013 వరదల లో గ్రామము మొత్తము గా కొట్టుకొని పోయినది.
కానీ ఇప్పటికినీ ఇచ్చట, గౌరికుంఢ్ ప్రాంతము లో చిన్న వేడినీటి ధార ఉన్నది.
2013 వరదలకు ముందు గౌరికుండ్, కేదార్నాధ్ యాత్రికులకు కేంద్ర స్థానమై యుండేదిది.
వరదలకు కొట్టుకొని పోయిన పిమ్మట ప్రభుత్వము వారు, నెమ్మది గా పునర్నిర్మించి యున్నారు.
శివుని భార్య అయిన పార్వతి/గౌరి పేరున ఈ పుణ్య స్థలము ప్రశస్తమైనది.
ఇచట గౌరీదేవి ఆలయమున్నది.
శివుని ప్రసన్నము చేసు కొనుటకు, పార్వతీమాత ఇచ్చటనే ప్రాయచ్చిత్తం చేసు కొనినట్లు తెలియుచున్నది.
పార్వతీమాత సరోవరము లో స్నానముకు వెళ్ళుటకు ముందుగా విఘ్నేశ్వరుని సృష్టించినది ఇచ్చటనే.
త్రియుగినారాయణ్ ఆలయం సొనప్రయాగ కు, పడమరగా సుమారు 11 కి.మీ. దూరంలో, గౌరికుండ్ నకు దగ్గరలో, త్రియుగినారాయణ్ అనే ఆలయం ఉంది.
ఇది చాలా పురాతన మైన పవిత్ర పుణ్యస్థలం.
ఈ ఆలయం లో రెండు అడుగుల ఎత్తు గల శ్రీలక్ష్మీనారాయణుల విగ్రహమూర్తులు ఉన్నాయి.
ఈ ఆలయం ప్రాంగణం లోనే 3 కుండములు వరుసగా ఉన్నాయి.
వీటిని బ్రహ్మ కుండం, విష్ణు కుండం, సరస్వతి కుండం.
అయితే శ్రీమహావిష్ణువు యొక్క నాభి నుండి సరస్వతి నది జన్మించి,
ఈ సరస్వతి కుండం లో కలుస్తుందని స్థలపురాణం చెబుతుంది.
ఈ జలం మహిళలను సంతానవంతులు గా చేస్తుందని నానుడి.
బ్రహ్మకుండం లోని నీరు, పసుపుపచ్చ రంగులో ఉంటాయి.
కుండం లో బంగారురంగు తో ఉండే రెండు చిన్నపాములు ఉంటాయి.
ఇవి ఎవరిని ఎం చేయవని చెబుతారు.
యీ ఆలయము వద్ద శివుడు పార్వతీ దేవిని సత్యయుగం లో అందరు దేముళ్ళ ఎదుట వివాహం చేసుకొన్నాడు.
మాహాశివుడు పార్వతిదేవిని వివాహం చేసుకుని ఆ తరువాత అర్ధనారీశ్వర రూపం తో దర్శన మిచ్చారు.
ఇక్కడ ఉన్న పీఠం పైన వారి వివాహం జరిగిందని పురాణాలు చెబుతున్నాయి.
ఆలయము నకు ఎదురుగా బ్రహ్మశిల అని పిలవబడు రాయి ఉన్నది.
ఇచ్చటనే పార్వతీపరమేశ్వరుల వివాహ కాలం నుండి వెలుగుచున్న అఖండజ్యోతి ఉన్నది.
ఈ జ్యోతి నిరంతరం మండుతూనే ఉంటుంది.
మూడుయుగముల నుండి ఆ మంట ఆరిపోకుండా నిరంతరం మండుతూనే ఉందని చెబుతారు.
ఇలా మూడుయుగముల నుండి మంట నిరంతరం అలాగే మండుతూ ఉండగా,
దీనికి నారాయణుడు సాక్షి అని,
స్వామి కి త్రియుగినారాయణ్ అనే పేరు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది.
ఈ అగ్ని నుండి వచ్చే బూడిద, దంపతుల వివాహబంధాన్ని ఆశీర్వదిస్తుందని చెబుతారు.
*ధారాదేవి ఆలయం*
ధారాదేవి ఆలయం అలాకనందా నది ఒడ్డున,
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో కేదార్నాధ్ పోవు మార్గము లో,
శ్రీనగర్ మరియు రుద్రప్రయాగ మధ్య ఉన్నది.
ధారాదేవి విగ్రహం పై సగ భాగము ఆలయము లో,
క్రింది సగభాగము కాళీమఠ్ నందు కాళీరూపములో పూజింప బడుచున్నది.
ధారాదేవి చార్ ధామ్ ఆలయము లకు సంరక్షకురాలి గా,
భారతదేశము నందున్న 108 శక్తి పీఠముల లో ఒకటి గాను,
శ్రీమధ్ భగవతి పేరు తో కొలువబడుచున్నది.
ధారాదేవి పూర్వ ఆలయం నందలి మూర్తి ని,
2013 సంవత్సరము జూన్ 16 వ తేదీన, అలకనంద నది పై పవర్ప్రాజెక్టు కట్టుటకు గాను అలకనంద నది లో మునుగ కుండా,
ఎగువ భాగమున నిర్మించిన కాంక్రీటు ఫ్లాట్ ఫారం పైకి మార్పు చేసి యున్నారు.
ధారాదేవి విగ్రహము ను మార్చిన పిమ్మట,
వెంటనే, అదే రోజు సాయంత్రం ఉత్తరాఖండ్ రాష్ట్రమునకు విపరీతమైన వరదలు వచ్చుట ద్వారా,
రుద్రప్రయాగ వరకు మొత్తము కొట్టుకు పోయి వందలాది మంది స్థానికులు,
మరియు ఆ సమయము యందు దర్శనార్ధము వచ్చిన భక్తులు,
మరణించుట తో పాటు కోట్ల రూపాయల ఆస్తినష్టము జరిగినది.
స్థానికులు మరియు భక్తులు,
అమ్మ వారిని మూల స్థలము నుండి మార్చి నందు వలనే వరదలు వచ్చి, ఆస్తినష్టము, ప్రాణనష్టము, జరిగినదని తలచెదరు.
అంతే కాకుండా ఇంత వరదల లోనూ ఒక పెద్ద బండరాయి,
కేదారనాధ్ ఆలయం వెనుక భాగమునకు కొట్టుకు వచ్చి,
అచట నిలబడి, వరద నీటి వలన, కేదార్నాధ్ ఆలయము నకు ఏ విధమైన నష్టం కలుగకుండా కాపాడినది.
ఈశ్వరకటాక్షం నకు ఇది నిదర్శనము.
గతము లో రెండు వందల సంవత్సరములకు పూర్వం,
ఒక రాజు ఈ తీరుననే ధారదేవి విగ్రహము మార్చుటకు ప్రయత్నించగా,
భూకంపం వచ్చి కేదార్నాధ్ ప్రాంతము నకు నష్టము కలిగినదని, ప్రజలు చెపుతారు.
2013 నందు వరదలలో కేదార్నాథ్ వెళ్ళు నడక మార్గము,
కేదార్నాథ్ నందు కల తాత్కాలిక వసతి భవనములు అన్నియు కొట్టుకొని పోయినవి.
దర్మిలా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం వారు కేంద్ర ప్రభుత్వ సహకారం తో కేదార్నాధ్ ఆలయము ను చేరు నడకమార్గము నిర్మించారు.
మరియు ప్రస్తుతము ఇచట రాత్రి బస చేయుటకు తాత్కాలిక వసతి భవనములు కూడా నిర్మించినారు.
జి.వి.యం.యన ్. వారు, వసతి సౌకర్యమునకు పూర్తి స్థాయి భవనములు ఇటీవలనే నిర్మించబడి, యాత్రికులకు అందుబాటులో ఉన్నవి.
ఇచట కామన్ బాత్రూమ్ మరియు పరిమిత నీటి సౌకర్యము, టిఫెన్ భోజన సదుపాయములు కలవు.
ఇవే కాక నూతనముగా నిర్మించిన అనేక ప్రయివేట్ హోటల్స్ మరియు వసతి గృహములు ఉన్నవి.
*ఆది శంకరాచార్య విగ్రహం*
హిందూమత వ్యాప్తికి అవిరళ కృషి చేసిన ఆది శంకరా చార్యులు వారు,
తన 32 సం.ల వయస్సు లో తమిళనాడు లోని కాంచీపురం నందు మరణించి నారని కొందరు,
కేరళ నందు మరణించినట్లు కూడా కధనములున్నను,
భారతదేశము నకు ఉత్తరమున హిమాలయము లందు,
పుణ్య క్షేత్రమైన బదరీనాధ్ వద్ద జోషీమఠ్ స్థాపించి,
ఆచటి నుండి కేదార్నాధ్ పయనించి,
అచ్చటనే శివైక్యం చెందినట్లు గా భావిస్తారు.
శంకరాచార్యుల వారి మరణ విషయమై నిర్ధిష్ట సమాచారం ప్రకారం,
ఆయన శిష్యులు చివరిసారి గా శంకరాచార్యుల వారిని కేదార్నాథ్ పుణ్యక్షేత్రము నందు ఆలయము నకు వెనుక భాగమున చూసినట్లు గా తెలియుచున్నది.
కేదార్నాధ్ ఆలయము అభివృద్ధి పరచి అచ్చటనే నివసించినారని,
ప్రధాన శిష్యులు నలుగురుని,
హిందూ ధర్మ ప్రచారము నకై తనను విడిచి వారి ప్రయాణము కొనసాగించమని ఆదేశించినట్లు, తెలియు చున్నది.
శిష్యులను అక్కడి శీతల వాతావరణం నుండి కాపాడుటకు,
కేదార్నాధ్ నకు 16 కి.మీ దూరము లో గౌరీకుంద్ వద్ద వేడినీటి ఊట సృష్టించారని అని నానుడి.
కేదార్నాధ్ ఆలయము వెనుక ముప్పై నిమిషములు నడచిన, శంకరాచార్యుల వారి సమాధి స్థలమును చేరవచ్చును.
2013 సం.నందు కేదార్నాధ్ నందు సంభవించిన వరదల యందు శంకరుల సమాధి ధ్వంశమైనది.
శంకరాచార్యుల సమాధి స్థలము లో శ్రీ ఆదిశంకరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని ప్రభుత్వము వారు సంకల్పించి,
12 అడుగుల ఎత్తు, మరియు 35 టన్నుల బరువు తో, నల్లరాతి తో కూర్చొని ఉన్న భంగిమ లో విగ్రహం,
కర్ణాటక నందు తయారు చేయించి,
ఇటీవల కేదార్నాధ్ నందు ప్రతిష్టించి యున్నారు.
కేదార్నాథ్ యాత్ర పుణ్యము, మనోజ్ఞం, ఆహ్లాదము.
సర్వం శ్రీ పాద శ్రీ వల్లభ చరణారవిందమస్తు 🙏🙏