నల్లని మేఘం చినుకుగ మారి పంబా నదిలో నీరుగ మారి
అభిషేకం చేస్తానంది అయ్యప్పా
నీకు కలశాభిషేకమంది అయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప ॥2॥
పుంగావనమే పువ్వుగ మారి చల్లని నీ! చిరునవ్వుగ మారి
పుష్పాంజలి చేస్తానంది అయ్యప్పా
నీకు పుష్పాభిషేకమంది అయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప ॥2॥
మలయ మారుతం శబరికి చేరి చల్లని నీ! గుడి సన్నిధి చేరి
వింజామర వీస్తానంది అయ్యప్పా
నీకు వింజామరవీస్తానంది అయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప ॥2॥
నెమలియె నీకై పురులే విప్పి పంబాసుందర తీరం చేరి
నాట్యాలు చేస్తానంది అయ్యప్పా
నీకై నాట్యాలు చేస్తానంది అయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప ॥2॥
వేదమంత్రమే తండ్రిగ మారి విశ్వవిధాత విరించిగ మారి
పడి పూజలు చేయగ వచ్చారయ్యప్పా
నీకు పడి పూజలు చేయగ వచ్చారయ్యప్పా
శరణం శరణం స్వామి - శరణం శరణం అయ్యప్ప ॥2॥