కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది.. ఎలాగంటే..

P Madhav Kumar

 గంగలో స్నానమాచరిస్తున్న లక్షలాది మందిని చూసిన ఒక ఋషికి ఒక సందేహం వచ్చింది!


వెంటనే గంగానదినే అడిగాడట!


*అమ్మా! ఎందరో ఎన్నో పాపాలు చేసి నదిలో మునకలేస్తున్నారు. వారి వారి పాపం వదిలేస్తున్నారు. మరి ఇందరి, ఇంత పాప భారం ఎలా మోస్తున్నావు తల్లీ? అని.*


అందుకా తల్లి *"నాయనా నేనెక్కడ ఆ పాపభారం మోస్తున్నాను? అవి అన్నీ తీసుకెళ్ళి ఎప్పటికప్పుడు సముద్రంలో కలిపేస్తున్నాను"* అని బదులిచ్చిందట.


అయ్యో అన్ని పుణ్య నదులు ఇంతేకదా! పాపాలన్నీ సముద్రంలోనే కలిపేస్తే ఆ సముద్రుడు ఎలా భరిస్తున్నాడో? అనుకొని!


సముద్రాన్నే అడిగాడు!


*ఎలా మోస్తున్నావు? ఈ పాపభారాన్ని!?! అని!*


దానికా సముద్రుడు!


*నేనెక్కడ భరిస్తున్నాను?! ఆ పాపాలను వెంట వెంటనే ఆవిరిగా మార్చి, పైకి మేఘాల లోకి పంపిస్తున్నాను' అని బదులు ఇచ్చాడట.*


అరే!!! ఎంతో తేలికగా కదిలి పోయే మేఘాలకు ఎంత కష్టం వచ్చింది! అని అనుకుంటూ!


*ఓ మేఘ మాలికల్లారా ఎలా భరిస్తున్నారు? ఈ పాప భారాన్ని! అని అడగగా!!!*


*అవి పకపకా నవ్వి! మేమెక్కడ భరిస్తున్నాం? ఎప్పటి కప్పుడే మీ మీదే కురిపించేస్తున్నాం వర్ష రూపేణా'! అని బదులివ్వగా,*


*ఓహో!!! ఆ పాపాలన్నీ మన మీద పడి మనమే అనుభవిస్తున్నా మన్నమాట!*


*అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా! ఎవరూ కూడా! కర్మ ఫలితాలు వదిలించు కోలేమని!!!! గ్రహించాడు అక్కడ స్నాన మాచరిస్తున్న ఋషి!*

                 

*ఇదం తీర్ధమిదం తీర్ధం భ్రమన్తి తామసా జనాః *

*ఆత్మతీర్ధం నజానన్తి కధం మోక్షః శృణు ప్రియే.*


పరమశివుడు పార్వతీ దేవికి ఉపదేశించిన శ్లోకమిది!.


*ఈ తీర్ధంలో స్నానమాచరించిన పుణ్యం కలుగును! ఆ తీర్ధంలో స్నానమాచరించిన మోక్షం కలుగును! అని తీర్ధ స్నానమునకై పరుగు లెత్తెడు మానవులు "భ్రమకు లోబడిన వారు"!*


*ఆత్మ జ్ఞాన తీర్ధంలో స్నాన మాచరించని వారికి మోక్ష మెటుల కలుగును?!? అని ఈ శ్లోకం అర్థం.*


*కర్మ కర్మణా నశ్యతి కర్మ!*


*అంటే కర్మ అనేది కర్మతోనే నశిస్తుంది.* 🙏🙏👍🙏🙏




#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat