శరంగుత్తిలో బాణాలు విడవడమంటే

 

    

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం వెళ్లే భక్తులు మాలను ధరించి, 41 రోజుల పాటు దీక్షచేస్తారు


 కఠిన నియమాలతో దీక్షచేసి ఇరుముడి ధరించి శబరిమల చేరుకుంటారు. అయితే అయ్యప్ప దీక్షలో కన్నెస్వాములకు ప్రత్యేక స్థానం ఉంది


 తొలిసారి దీక్ష తీసుకున్న వారిని కన్నెస్వాములని అంటారు. పందళరాజు కుమారుడిగా పెరిగిన మణికంఠుడు తల్లి శిరోవేధనకు పులిపాలు తీసుకురావడానికి అడవికి వెళ్లారు. నారద మహర్షి వల్ల తాను మహిషి సంహారం కోసం భూమిపై అవతరించినట్లు స్వామి తెలుసుకున్నారు. మహిషి సంహరించిన స్వామివారు అలాగే అడవి దొంగ వావర్‌‌ను తన భక్తుడిగా చేసుకున్నారు 


శరంగుత్తిలో బాణాలు విడవడమంటే..!

అంతేకాదు మున్ముందు కాలంలో నా దర్శనం కోసం అడవి మార్గంలో నడచి వచ్చి, సన్నిధానానికి చేరుకునే భక్తులకు ఎలాంటి ఆపద కలగకుండా తోడుగా నిలవాల్సిన బాధ్యత మీదే’ వావర్, కరుప్పస్వామికి అయ్యప్ప ఆదేశించారు. అందుకే ఎరుమేలిలో పేటతుళ్లి ఆడిన తర్వాత కన్నిస్వాములకు బాణాలు వాటిని భద్రపరమని గురుస్వామి చెబుతారు.


 వనయాత్రలో వావర్‌ స్వామి, కరుప్పస్వామి, కడుత్తు స్వామి, కరిమల భగవతి దేవతలు ఆ శరంలో ఆవాహనమై భక్తునికి అండగా నిలిచి వన్యమృగాలు తిరిగే ఘోర అడవిని దాటిస్తారని నమ్మకం. పంబ నుంచి సన్నిధానానికి వెళ్లే మార్గంలో శబరిపీఠం దాటిన తర్వాత వచ్చే శరంగుత్తిలో ఎరుమేలి నుంచి తమ వెంట తెచ్చిన శరములను కన్నిస్వాములు గుచ్చుతారు. అంతవరకూ తోడుగా వచ్చిన వన దేవతలు శరంగుత్తిలో ఆగిపోతారని ప్రగాఢ నమ్మకం.


మొదటి ఏడు బాణం తీసుకెళితే ఆ తరవాత కత్తి, గంట, గద, తేరు ఇలా ఏడాదికో వస్తువుని దీక్ష తీసుకున్న వారు తమ వెంట తీసుకెళ్లి శరంగుత్తిలో వదిలిపెడతారు. అలా ఈ పద్దెనిమిదింటి స్వామివారి ఆయుధాలని అంటారు.


 మరో కథ కూడా ప్రచారంలో ఉంది మహిషి సంహారం కోసం అడవికి వచ్చిన మణికంఠుడు.. అది పూర్తయ్యాక ఆయుధాలను శరంగుత్తిలో విడిచి పెట్టారని అంటారు. అంతేకాదు కన్నిస్వాములు తన దర్శనానికి రాని ఏడాది నిన్ను వివాహం చేసుకుంటానిని మాలికాపురత్తమ్మకు అయ్యప్ప వాగ్దానం చేశారు. తమ యాత్రను ధ్రువీకరించడానికే కన్నిస్వాములు శరములను శరంగుత్తిలో గుచ్చుతారు.


స్వామి శరణం అయ్యప్ప శరణం

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!