స్త్రీలు జుట్టు విరబోసుకుని ఎందుకుండరాదు..?

P Madhav Kumar


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸పిశాచాలకు ఆహ్వానం వంటిది ఆ చర్య. అనేక దుష్టగ్రహాలు ఆ సమయంలో ఆవహించి కల్లోల పరిచే శక్తి జుట్టు విరబోసుకున్నప్పుడే వాటికి వస్తుంది.


🌿దానికి తోడు విరబోసుకున్న స్త్రీని చూసిన పరపురుషుడుకి ఆ స్త్రీ మీద అనవసరపు కోర్కె కలిగేలా చేస్తుంది. తద్వారా అనేక కుటుంబ సమస్యలు వస్తాయి.


🌸అలాగే జుట్టు విరబోసుకు తిరుగుతుంటే లక్ష్మీదేవి అక్కకు కూడా ఆహ్వానమే.


🌹ఏ దేవుడ్ని దర్శించేటప్పుడు ఏ రంగు దుస్తులు ధరించాలి?


🌿సరస్వతీ దేవినీ, శ్రీమహలక్ష్మిని, మహేశ్వరుడ్ని దర్శించటానికి వెళ్ళేటప్పుడు తెల్లని దుస్తులు ధరించాలి.


🌸పార్వతీదేవినీ, ఆమె పుత్రుడైన వినాయకుడ్ని దర్శించటానికి వెళ్ళేటప్పుడు ఎరుపు బట్టలు ధరించాలి.


🌿శ్రీమహావిష్ణు రూపాలైన శ్రీరామ, శ్రీకృష్ణ, శ్రీవేంకటేశ్వరస్వామినీ దర్శించేటప్పుడు మంగళకరమైన పసుపు దుస్తులు ధరించాలి.


🌹స్త్రీ మూర్తులకి ఇవి అవసరం..🌹


🌸1.స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు అర చెంచాడు వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది.


🌿2.బయటకు వెళ్లే ముందు మెడకు కాస్త కింద చిన్న కాటుక చుక్క కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు..


🌸3.అరికాలులో కాటుక కానీ కాస్త, ఓ చుక్క పరిమాణంలో కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోటళ్లా ప్రతికూల శక్తులు వెంటరావు..


🌿4.తల స్నానం చేశాక వారానికి ఒక సారి అయినా తల వెంట్రుకలుకు సాంబ్రాణి వేసుకోవాలి, ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది..అది పోతుంది.


🌸5.అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో కచ్చితంగా దుర్గా స్త్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం, బైరవుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది..


🌿6.ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి , నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది.


🌸7.మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి ఉదా: వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి.


🌿8.తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది. అలా పొడిగా ఉంచకుండా తలలో ఏదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి. 


🌸9.ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడకూడదు. కొత్తవారికి కష్టాలు చెప్పుకోకూడదు, పరిచయం లేని వారిని సహాయం కోరకూడదు..


🌿10.పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి..మంగళవారం రోజు ముఖానికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు..


🌸11.కుటుంబ సభ్యులు దగ్గర ఏది దాపరికం ఉండకూడదు..


🌿12.అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే, మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్ధతులు.


🌸13.నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి, అమంగళం పలకకూడదు. పొలాలు, బీడు ప్రాంతంలో ఏదైనా దొరికిన వస్తువులు తెచ్చి దాచకూడదు. కొన్ని మంత్రించి దాచినవి ఉంటాయి. (తాంత్రిక విద్యలు వంటివి అంతరించిపోయాయని చెప్పవచ్చు)


🌿14.గోరోజనం వశీకరణకు వాడుతారు, మీకు తెలియని కొత్త వారి నుండి మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు. (ఇప్పుడు ఇలాంటి వశీకరణ, తాంత్రిక విద్యలు లేవని చెప్పవచ్చు)


🌸15.చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్లకూడదు. నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు..స్వస్తి..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿



#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat