(విఘ్నములు తొలగి విజయప్రాప్తి కొరకు)
శ్రీ పార్వతీపుత్ర, లోకత్రయూస్తోత్ర, సత్పుణ్యచారిత్ర, భద్రేభవక్రా మహాకాయ, కాత్యాయణీ నాధ సంజాత స్వామీ, శివాసిద్ధి విఘ్నేశ, నీ పాదపద్మంబులన్, నీదు కంఠంబు నీ బొజ్జ నీ మోము నీ మౌళి బాలేందు. ఖండంబు నీ నాల్గు హస్తంబులు నీ కరాళం నీ పెద్ద వక్త్రంబు దంతంబు నీ పాద హస్తంబు లంబోదరంబున్ సదా మూషకాశ్వంబు నీ మందహాసంబు నీ చిన్న తొండంబు నీ గుజ్జు రూపంబు నీ శూర్పకర్ణంబు నీ నాగయజ్ఞోపవీతంబు నీ భవ్య రూపంబు దర్శించి హర్షించి సంప్రతీ మ్రొక్కంగ శ్రీ గంధమున్ కుంకుమంబ క్షతల్జామ్రొలున్ చంపకంబుల్ తగన్ మల్లెలున్మోల్ల లున్మంచి చేమంతులున్ లెల్లగన్నేరులన్ మంకెనల్ పొన్నలన్ పువ్వులనుంచి దూర్వంబులన్డెంచి శాస్త్రోక్తరీతిన్ సమర్పించి సాష్టాంగముంజేసి విఘ్నేశ్వరా నీకు టెంకాయ పొన్నంటి పండ్లున్ మరిన్మంచినౌని నిక్షఖండంబులున్ రేగుపండ్లప్పడాల్ వడల్ నేయి బూరెల్ మరిన్ గోధుమస్పంబులున్వడల్ పునుగులు న్బూరెలున్రెలున్ చొక్కమౌ చల్మిడిన్ బెల్లమున్ దేనెయంజున్న బాలాజ్యమున్నాను బియ్యంబు నామ్రంబు బిల్వంబు మేలు బంగరున్ బళ్ళెమందుంచి నైవేద్యముంబంచ నీ రాజనంబున్ నమస్కారముల్ చేసి విఘ్నేశ్వరా నిన్ను బూజింపకే యన్య దైవంబులంబ్రార్ధనల్చేయుటల్ కాంచనం బొల్లకేయినుదాగోరు చందంబుగాదే మహాదేవ యోభక్తమందారయోసుందరాకార యోభాగ్య గంభీరయోదేవ చూడామణీ లోకరక్షామణీ బంధుచింతామణీ స్వామి నిన్నెంచ నేనెంత నీదాస దాసాది దాసుండ శ్రీ దొంత రాజన్వయుండ రామాభిధానుడ నన్నిపుడు చేపట్టిను శ్రేయునింజేసి శ్రీమంతుగన్చూచి హృత్పద్మ సింహాసనారూఢతన్నిల్పి కాపాడుటే కాదు నిన్గోల్చి ప్రార్థించు భక్తాళిన్ కొంగుబంగారమై కంటికిన్ రెప్పవై బుద్ధియు న్విద్యయున్పాడియున్ బుత్రపౌత్రాభివృద్ధిన్ దగన్ గల్గ రాజేసి పోషించు మంటిన్ గృహన్ గావుమంటిన్ మహాత్మాయినే వందనంబుల్ శ్రీ గణేశ నమస్తే నమస్తే నమస్తే నమః: