భక్తులు అనే వారికి, భగవంతుని పై ముందుగా నమ్మకం, విశ్వాసం ముఖ్యం!!

P Madhav Kumar

 


*మనం రైల్వే స్టేషన్‌కు చేరుకునే వరకు, మన సామాను తీసుకెళ్లడానికి ఒక గుర్రపు బండి లేదా సైకిల్ రిక్షా లేదా టాక్సీలో తీసుకెళ్తాం.*


*ఇవేవీ లేని పక్షంలో లగేజీని తలపై మోయాల్సి వస్తుంది, స్టేషన్‌కు చేరుకుని రైలులో కూర్చున్నాక, రైలు మన లగేజీతో పాటు మనల్ని తీసుకువెళుతుంది.*


*రైలు ఎక్కిన తర్వాత కూడా లగేజీని తలపై పెట్టుకుంటామా? అలా పెట్టుకుంటే అంతటి కన్నా మూర్ఖత్వం ఇంకేముంటుంది??*


*మనల్ని మోసే రైలు మన లగేజిని మోయాలేదా?! *


*అలాగే మనం భగవంతునికి శరణాగతులమయి ఉండాలి, నిస్సందేహంగా, షరతులు లేకుండా ప్రతిదీ ఆయనకు సమర్పించాలి..!* 


*అప్పుడు ఆయనే అన్నీ చూసుకుంటాడు, ఎప్పుడు చేయాలి, ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది పూర్తిగా భగవంతునికి వదిలేయాలి, ఆయన మనకు మంచిదానినే యిస్తాడు.*


*ఇది కేవలం ఆయనపై అచంచల విశ్వాసంతో వున్నపుడే సాధ్యమవుతుంది...*✍️

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


   🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat