*భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ భీష్మ పంచకం అని పిలుస్తారు.*
*వ్యాసుడు భారతాన్ని ప్రజలకు అందించి ఉండవచ్చు. కానీ భీష్ముడే కనుక లేకపోతే భారతమే లేదు ! తండ్రి సౌఖ్యం కోసం తన సింహాసనాన్నే త్యాగం చేసిన ధీరుడు భీష్ముడు. తన ద్వారా కలిగే సంతానం వల్ల ఆ త్యాగం ఎక్కడ పొల్లు పోతుందో అన్న సంశయంతో.... ఆజన్మాంతం పెళ్లి చేసుకోనంటూ ‘భీషణ’ ప్రతిజ్ఞ చేసిన ధీరుడు.*
*భీష్మునికి తను కోరుకున్న సమయంలో తనువు చాలించగలిగే వరం ఉంది. అందుకే ఆయన మార్గశిర మాసంలో అంపశయ్య మీదకి చేరుకున్నా... ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకూ వేచి ఉన్నాడు. ఉత్తరాయణం ప్రవేశించిన తరువాత అష్టమి రోజున , తనని ఐక్యం చేసుకోమని ఆ కృష్ణ పరమాత్ముని వేడుకున్నాడు. భీష్ముడు జీవితం యావత్తూ పరిపక్వంగానే గడిచింది. ఇక తన మరణ సమయంలోనూ తన విశిష్టతను చాటుకున్నాడు ఈ కురువృద్ధుడు. *
*తనను చూసేందుకు అంపశయ్య వద్దకు వచ్చిన ధర్మరాజుకు , రాజనీతిలోని సారాంశమంతా బోధించారు. పాండవులతో పాటుగా ఉన్న కృష్ణుని వేనోళ్ల స్తుతిస్తూ విష్ణు సహస్ర నామాన్ని పలికారు. అలాంటి భీష్ముని కొలుచుకునేందుకు ఆయన నిర్యాణం చెందిన తరువాత వచ్చే ఏకాదశి భీష్మ ఏకాదశిగా జరుపుకొంటున్నాము.*
*ప్రతి ఏకాదశికి ఉండే నియమాలే భీష్మ ఏకాదశికీ వర్తిస్తాయి. దశమినాటి రాత్రి నుంచి ద్వాదశి ఉదయం వరకూ ఉపవాసం ఉండమనీ , ఏకాదశి రాత్రివేళ జాగరణ చేయమనీ పెద్దలు సూచిస్తారు. దీంతో పాటుగా విష్ణు పూజకు ఈ వేళ విశేష ప్రాధాన్యం ఉంటుంది. భీష్ముడు అందించిన విష్ణుసహస్రనామాలను ఈనాడు జపిస్తే , విశేష ఫలితం దక్కుతుంది. అందుకనే ఈ రోజుని శ్రీ విష్ణు సహస్ర నామ జయంతి అని కూడా పిలుచుకోవడం జరిగినది . భగవద్గీతను పఠించేందుకు కూడా ఇది అనువైన రోజని అంటారు.*
*భీష్మ ఏకాదశిని ‘జయ ఏకాదశి’ అని కూడా పిలుస్తారు. ఈ రోజు మొదలుపెట్టిన ఏ కార్యమైనా విజయవంతం అవుతుందని ఓ నమ్మకం. అందుకనే ఆ పేరు. ఇక భీష్ముడు భారతీయులందరికీ పూర్వీకుడే ! ఆచార్యునిగా , భరతవంశంలోని ఆది పురుషునిగా ఆయన మనకు స్మరణీయుడు. అందుకే ఈ రోజున ఆయనకు తర్పణాలను విడవాలని సూచిస్తారు. భీష్ముని తమ పూర్వజునిగా భావిస్తూ ఎవరైతే ఆయనకు తర్పణం విడుస్తారో వారి పాపాలన్నీ దహించుకుపోతాయని పెద్దలు చెబుతారు.*
*రథసప్తమి నుంచి సూర్యుని తీక్షణత పెరుగుతూ వస్తుంది కాబట్టి , బహుశా ఈ సూచని చేసి ఉంటారు. ‘భీష్మాష్టమి మొదలుకొని భీష్మద్వాదశి వరకూ ఉన్న ఐదు రోజులనూ ‘భీష్మ పంచకం’ అని పిలుస్తారు. ఈ అయిదు రోజులూ భీష్ముని వ్యక్తిత్వాన్ని తలచుకుంటారు. భీష్ముని జీవితం నుంచి ప్రేరణ పొందేందుకు ఈ అయిదు రోజులనూ కేటాయిస్తారు. మనం తరచూ వినే వ్యక్తిత్వ వికాస తరగతులకు ఏమాత్రం తీసిపోని ఆచారం ఇది. పైగా భీష్మ ఏకాదశినాడు ఉపవాసం ఉంటూ , విష్ణుసహస్రనామాలను జపిస్తూ , భగవద్గీతను పఠిస్తూ , భీష్ముని తల్చుకుంటే సాగే క్రతువుతో మనిషి వ్యక్తిత్వమే సాత్వికంగా మారిపోతుంది.*
*ఓం నమో భగవతే వాసుదేవాయ* ✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*