*ఓం నమో భగవతే* *వాసుదేవాయ ఈ మంత్రం* *ఎందుకు జపించాలి?*

P Madhav Kumar


 (భవిష్యపురాణం)ఒక ముసలివాడు ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని వల్లెవేస్తూ గంగానది తీరంలో నడుస్తున్నాడు. చేతిలో జపమాల, మేడలో రుద్రాక్ష హారం ధరించాడు. అతను ఈ "ఓంనమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రం చదవడం వలన ఆతరంగాలు కలిపురుషుడిని తాకాయి. ఎక్కడి నుండి వస్తున్నది ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్ర శబ్దం అని చుట్టూ పరికించాడు. గంగానది తీరంలో ఒక బక్కచిక్కిన ముదుసలి ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని జపించడం చూసి ఆ మంత్ర జపాన్ని ఆపాలని ఆ ముసలివాడి దగ్గరికి వెళ్లి పట్టుకోబోయాడు. అయన మీద చేయి వేసిన వెంటనే ఎగిరి అర కిలోమీటరు దూరం లో పడ్డాడు. 



కొంతసేపు ఏమి జరిగిందో తెలియక చూస్తే ఆ ముసలివాడు ముందు ఎక్కడో ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని జపిస్తూ వెళ్తున్నాడు. ఎలాగైనా పట్టుకుని నామజపాన్ని ఆపాలని దగ్గరికి వెళ్ళాడు. పట్టుకోబోతే ఈసారి యోజనం దూరంలో పడ్డాడు. ఆ దెబ్బకి కలిపురుషుడు గజగజ ఒణికిపోయాడు. చూస్తే బక్కచిక్కి ఉన్నాడు. గట్టిగా గాలి ఒస్తే ఎగిరిపోయేలా ఉన్నాడు. కాని పట్టుకుందామంటే నేను ఎక్కడో పడుతున్నాను.


ఒకవేళ నాశక్తి సన్నగిల్లిందా, కలియుగం ఆరంభంలో కృష్ణుడు వలన నా రాక ఆలస్యం అయింది. ఇదేమైన శ్రీకృష్ణుడి మాయా ప్రభావమా, అసలు ఇంతకీ ఆ ముసలివాడు ఎవ్వడు. శివుడా...? విష్ణువా...? అనుకుంటూ ఉండగా అటుగా వెళ్తున్న ''వేదవ్యాసుడు'' కనిపించాడు. కలి వెంటనే వ్యాసుడు దగ్గరికి వెళ్లి మహానుభావా! సమయానికి వచ్చావు. నా సందేహాన్ని నివృత్తి చేయండి అన్నాడు. వ్యాసుడు నవ్వి ఇది నీరాజ్యం ఈ కలికాలం నీది, నీకు సందేహమా... ఏ ఇద్దరిని కూడా సక్రమంగా కలిసి ఉండనివ్వవు కదా. ఎవరైనా కలిసున్నారంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటావు. ఇలాంటి నీకు నా అవసరం ఏముంది కలిపురుషా..? ఇంతకి నువ్వు కుశలమే కదా! అన్నాడు వేదవ్యాసుడు


కుశలమే! నారాజ్యంలో నేను కాక నువ్వు పాలించవు. కదా! అదిగో ఆ దూరంగా వెళ్తున్నాడే ఆ ముసలివాడు ఎవరు, ఆయన్ని పట్టుకోబోతే నా బలం సరిపోవడం లేదు. ఇదసలు నా రాజ్యమేనా? లేక మీరందరూ కలిసి నన్ను మాయ చేస్తున్నారా? చెప్పండి అని వేడుకున్నాడు. వేదవ్యాసుడు నవ్వి, ఓహో అదా నీ సందేహం. అయన పరమ విష్ణు భక్తుడు. అయన జపించే నామం వలన విష్ణు శక్తి ఉత్పన్నమై నిన్ను దగ్గరికి రానివ్వదు. పట్టుకోవాలని ప్రయత్నించావా! విష్ణువు నిన్ను నాశనం చేసి కలియుగాన్నే లేకుండా చేస్తాడు. త్రికరణ శుద్దిగా నిత్యం '' ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే నామాన్ని ఎవరు పఠిస్తూ ఉంటారో వారిని నువ్వు కనీసం తాకనుకూడా తాకలేవు. కనుక ''ఓం నమో భగవతే వాసుదేవాయ'' అనే మంత్రాన్ని ప్రజలు పట్టుకునే లోపే నువ్వు పట్టుకో. లేదంటే నీ రాజ్యంలో నువ్వు ఉండలేవు. అని చెప్పి వెళ్ళిపోయాడు.


ఇంతటి మహత్తరమైన ఈ మంత్రాన్ని నిత్యం జపించండి.🙏🕉️

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat