🔱🔥శక్తిపీఠం అంటే ఎన్నున్నాయి ఎక్కడెక్కడున్నాయి🔥🔱

P Madhav Kumar



పురాణ కథ..

ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేయదలంచి అందరినీ ఆహ్వానించాడు, కానీ తనకిష్టం లేని శివుడిని పెళ్ళాడిందన్న కోపంతో తన కూతురైన సతీదేవి (దాక్షాయణి) ని, అల్లుడైన శివుడిని పిలవలేదు, 

ఈ కార్యక్రమ విషయం తెలిసిన సతీదేవి, శివుడు వారించినా వినకుండా, పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని ప్రమథగణాలను వెంటబెట్టుకొని యాగానికి వెళ్ళింది గాని, అక్కడ తన తండ్రి వల్ల అవమానానికి గురయ్యింది.

ముఖ్యంగా తండ్రి చేస్తున్న శివనింద సహించలేక ఆమె యాగాగ్నిలోకి దూకి మరణించింది.దీనికి ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను ధ్వంసం చేశాడు. .                                                                                                                                                                                                                                                                                                        


సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు. దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.

సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.

ప్రతీ శక్తిపీఠంలోనూ, దాక్షాయణీ, భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.శక్తిపీఠాలు ఉన్న స్థలాలను గుర్తించడంలో భిన్నాభిప్రాయాలు, భేదాభి ప్రాయాలున్నాయి.

ఒక వివరణ ప్రకారం ఈ స్థలాలు ఇలా ఉన్నాయి:


18 శక్తిపీఠాలు..

అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం.


లంకాయాం శాంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే

ప్రద్యుమ్నే శృంఖళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగుళాంబా, శ్రీశైలే భ్రమరాంబికా

కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా

ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ

జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారణాస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ

అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్

సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్


1. శాంకరి - శ్రీలంక

ఈ మందిరం ఎక్కడుందో స్పష్టమైన ఆధారాలు లేవు. కాని ఒక వివరణ ప్రకారం ఇది దేశం తూర్పుతీరంలో ట్రిన్‌కోమలీలో ఉండవచ్చును. 17వ శతాబ్దంలో పోర్చుగీసు వారి ఫిరంగుల వల్ల మందిరం నాశనమయ్యిందంటారు. ప్రస్తుతం ఆ ప్రదేశంలో ఒక స్తంభం మాత్రం ఉంది. దగ్గరలో 'త్రికోణేశహవర స్వామి' అని పిలువబడే శివుని మందిరం ఉంది. ఆ మందిరం ప్రక్కనే ఒక దేవీ మందిరం కూడా ఉంది. ట్రిన్‌కోమలీ నగరంలో కాళీమందిరం ప్రసిద్ధమైనది.


2. కామాక్షి - కాంచీపురం.

తమిళనాడు - మద్రాసు నగరానికి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది.


3. శృంఖల ప్రద్యుమ్ననగరం.

పశ్చిమ బెంగాల్ ఇది కొలకత్తాకు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాని ఇప్పుడు ఏ విధమైన మందిరం గుర్తులూ లేవు. అయితే కొలకత్తాకు 135 కిలోమీటర్ల దూరంలోని గంగాసాగర్ కూడా ఒక శక్తిపీఠంగా పరిగణింపబడుతున్నది.


4. చాముండి - క్రౌంచ పట్టణం.

మైసూరు, కర్ణాటక - అమ్మవారు చాముండేశ్వరీ దేవి.


5. జోగుళాంబ-అలంపూర్.

తెలంగాణ 'తుంగభద్ర' & కృష్ణ నదుల సంగమ క్షేత్రంలో ఉంది.


6. భ్రమరాంబిక - శ్రీశైలం.

ఆంధ్రప్రదేశ్ - కృష్ణానదీ తీరాన అమ్మవారు మల్లికార్జునస్వామి సమేతంగా ఉంది. శ్రీశైలం 12 జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి.


7. మహాలక్ష్మి - కొల్హాపూర్..

మహారాష్ట్ర - ఆలయంలో ప్రధాన దేవత విగ్రహం స్వచ్ఛమైన మణిశిలతో చేయబడింది. అమ్మవారి తలపైన ఐదు తలల శేషుని ఛత్రం ఉంది. ప్రతి సంవత్సరం మూడు మార్లు అమ్మవారి పాదాలపై సూర్యరశ్మి పడుతుంది.


8. ఏకవీరిక - మాహుర్యం..

లేదా మహార్, నాందేడ్ జిల్లా, మహారాష్ట్ర - ఇక్కడి అమ్మవారిని 'రేణుకా మాత'గా కొలుస్తారు. షిరిడీ నుండి ఈ మాతనుదర్శించుకొనవచ్చును.


9. మహాకాళి - ఉజ్జయిని..

మధ్య ప్రదేశ్ - ఇదే ఒకప్పుడు అవంతీ నగరం అనబడేది. ఇది క్షిప్రా నది తీరాన ఉంది. మహాకవి కాళిదాసుకు విద్యను ప్రసాదించిన అమ్మవారు మహాకాళియే.


10. పురుహూతిక - పీఠిక్య..

లేదా పిఠాపురం, ఆంధ్ర ప్రదేశ్ - కుకుటేశ్వర స్వామి సమేతయై ఉన్న అమ్మవారు.


11. గిరిజ - ఓఢ్యదేశం ఒడిశా..

జాజ్‌పూర్ కే రోడ్ నుండి 20 కిలోమీటర్లు - వైతరిణీ నది తీరాన ఉంది.


12. మాణిక్యాంబ - దక్షవాటిక..

లేదా ద్రాక్షారామం, ఆంధ్ర ప్రదేశ్ - కాకినాడ నుండి 20 కిలోమీటర్ల దూరంలో.


13. కామరూప-హరిక్షేత్రం..

అసోం, గౌహతి నుండి 18 కిలోమీటర్లు, అసోం - బ్రహ్మపుత్రా నదీతీరాన వుంది. ఇక్కడ ప్రతి సంవత్సరం ఆషాఢమాసంలో అంబవాచి ఉత్సవం జరుగుతుంది.


14. మాధవేశ్వరి -ప్రయాగ..

(అలహాబాదు), ఉత్తర ప్రదేశ్, త్రివేణీ సంగమం సమీపం - 

ఈ అమ్మవారిని అలోపీదేవి అని కూడా అంటారు.


15. వైష్ణవి - జ్వాలాక్షేత్రం..

కాంగ్రా, హిమాచల్ ప్రదేశ్ - 

ఇక్కడ అమ్మవారి విగ్రహం ఉండదు. ఏడుజ్వాలలు పురాతన కాలంనుండి వెలుగుతున్నాయి.


16. మంగళ గౌరి - గయ.

బీహారు - పాట్నా నుండి 74 కిలోమీటర్లు.


17. విశాలాక్షి - వారణాసి..ఉత్తర ప్రదేశ్.


18. సరస్వతి - జమ్ముకాష్మీరు.

అమ్మవారిని కీర్ భవాని అని కూడా అంటారు.పాక్ ఆక్రమిత కాశ్మీరులో ముజఫరాబాద్ కు 150 కి.మీ.ల దూరంలో ఉందంటారు.


51 శక్తి పీఠాలు..


1- సంఖ్య-స్థలము

2- శరీరభాగము / ఆభరణము

3- శక్తిరూపము

4- శివరూపము


1. హింగుళ, కరాచీ నుండి 125 కి.మీ., పాకిస్తాన్ 

బ్రహ్మరంథ్రము (శిరోభాగము)

కొత్తారి

భీమలోచనుడు


2. షర్కారె,సుక్కార్ స్టేషను వద్ద, కరాచీ, పాకిస్తాన్

కన్నులు 

మహిషమర్దిని

క్రోధీశుడు


3. సుగంధ, షికార్ పూర్, బారిసాల్ నుండి 20 కి.మీ., బంగ్లాదేశ్ - సోంధ్ నది ఒడ్డున

ముక్కు 

సునంద

త్ర్యంబకేశ్వరుడు


4. అమరనాధ్ శ్రీనగర్ నుండి 94 కి.మీ, కాష్మీర్ 

గొంతు 

మహామాయ

-త్రిసంధ్యేశ్వరుడు


5.జ్వాలాముఖి, కాంగ్రా, పఠాన్ కోట్ వద్ద 

నాలుక 

సిద్ధిద (అంబిక)

ఉత్తమ భైరవుడు


6. జలంధర్ (దేవీ తాలాబ్)

ఎడమ స్తనము

త్రిపురమాలిని

భీషణుడు


7. వైద్యనాధం, దేవోగర్, ఝార్ఖండ్ 

గుండె 

జయదుర్గ

వైద్యనాథుడు


8. గుజ్యేశ్వరి మందిరము, పశుపతినాథ మందిరం వద్ద, నేపాల్ 

మోకాళ్ళు 

మహాశిర

కపాలి


9. మానస, టిబెట్కు దగ్గర, కైలాసపర్వత సమీపమున మానస సరోవరంలో ఒక శిల

కుడి చేయి 

దాక్షాయిని

అమరుడు


10. బిరాజా, ఒడిషా 

నాభి 

విమల

జగన్నాథుడు


11. ముక్తినాథ మందిరం, గండకి నది ఒడ్డున, పోఖ్రా, నేపాల్ 

నుదురు 

గండకీ చండి

చక్రపాణి


12. బహుళ, అజయ నది ఒడ్డున, కేతుగ్రామ్, కటువా దగ్గర, బర్ద్వాన్, పశ్చిమ బెంగాల్ 

ఎడమ చేయి 

బహుళా మాత

భిరుకుడు


13. ఉజ్జయిని, గుస్కురా స్టేషను, బర్ద్ వాన్, పశ్చిమ బెంగాల్  

కుడి మణికట్టు 

మంగళ చండిక

కపిలాంబరుడు


14. ఉదయపూర్ వద్ద, త్రిపుర, మతబారి కొడలపైన, రాధాకిషోర్ గ్రామం 

కుడి కాలు 

త్రిపురసుందరి

త్రిపురేశుడు


15. ఛొట్టోగ్రామ్, చంద్రనాధ్ కొండలపైన, సీతాకుండ్ స్టేషను వద్ద, చిట్టగాంగ్ జిల్లా, బంగ్లాదేశ్ 

కుడి చేయి 

భవాని

చంద్రశేఖరుడు


16. త్రిస్రోత, శల్బారి గ్రామం, జల్పాయ్ గురి జిల్లా, పశ్చిమబెంగాల్ 

ఎడమ కాలు 

భ్రామరి

అంబరుడు


17. కామగిరి, కామాఖ్య, నీలాచల పర్వతాల వద్ద, గౌహతి, అస్సాం 

యోని 

కామాఖ్య

ఉమానందుడు


18. జుగాద్య, ఖీర్ గ్రామ్, బర్ద్వాన్ జిల్లా, పశ్చిమబెంగాల్

కుడి పాదము 

జుగాద్య

క్షీర ఖండకుడు


19. కాళిపీఠ్, కాళీఘాట్, కొలకత్తా 

కుడి బొటనవేలు 

కాళిక

నకులీషుడు


20. ప్రయాగ, త్రివేణీ సంగమము, అలహాబాదు, ఉత్తర ప్రదేశ్ 

కుడి వేళ్ళు 

లలిత

భవుడు


21. జయంతి, కాలాజోర్ బోర్ భోగ్, ఖాసి గ్రామం, జయంతియా పరగణాలు, సిల్హెట్ జిల్లా, బంగ్లాదేశ్ 

ఎడమ తొడ

జయంతి

క్రమదీశ్వరుడు


22. కిరీత్, కిరీత్ కొండ గ్రామం, లాల్ బాగ్ కోర్ట్ స్టేషను వద్ద, ముషీరాబాద్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

కిరీటము 

విమల

సంవర్తుడు


23. వారణాసి (కాశి), గంగానది ఒడ్డున మణికర్ణికా ఘట్టము, ఉత్తరప్రదేశ్

చెవిపోగు 

విశాలాక్షి, మణికర్ణి

కాలభైరవుడు


24. కన్యాశ్రమము, కన్యాకుమారి, కుమాఱి మందిరం ప్రాంగణంలో భద్రకాళి గుడి, తమిళనాడు 

వీపు 

శర్వాణి

నిమీశుడు


25. కురుక్షేత్రం, హర్యానా

మడమ ఎముక 

సావిత్రి

స్థాణువు


26. మణిబంధ్, పుష్కర్, గాయత్రి కొండల వద్ద, ఆజ్మీర్, రాజస్థాన్ 

రెండు చేతి కడియాలు

గాయత్రి

సర్వానందుడు


27. శ్రీశైల్, జైన్ పూర్, సిల్నెట్, బంగ్లాదేశ్ 

మెడ 

మహాలక్ష్మి

సంబరానందుడు


28. కంచి, కొపై నది వద్ద, బోల్పూర్ స్టేషను, బీర్బమ్, పశ్చిమబెంగాల్ 

ఎముక 

దేవగర్భ

రురుడు


29. కల్మాధవ్, శోన్ నది ఒడ్డున కొండ గుహలో, అమరకంటక్, మధ్యప్రదేశ్ 

ఎడమ పిరుదు 

కాళి

అసితాంగుడు


30. షోన్ దేశ్, నర్మదా నది మూలము వద్ద, అమరకంటక్, మధ్యప్రదేశ్ 

కుడి పిరుదు 

నర్మద

భద్రసేనుడు


31. రామగిరి, చిత్రకూటం, ఝాన్సీ, మాణిక్ పూర్ వద్ద, ఉత్తరప్రదేశ్ 

కుడి స్తనం 

శివాణి

చందుడు


32. వృందావనం, భూతేశ్వర మాధవ మందిరం, ఉత్తరప్రదేశ్

కేశాభరణం 

ఉమ

భూతేశ్


33. శుచి, శుచితీర్థం శివమందిరం, కన్యాకుమారి వద్ద, తమిళనాడు

పై దవడ పండ్లు 

నారాయణి

సంహరుడు


34. పంచసాగరం (స్థలం తెలియదు) 

క్రింది దవడ పండ్లు

వారాహి

మహారుద్రుడు


35. కార్తోయతాత్, భవానీపూర్ గ్రామం, సెర్పూర్, బగురా జిల్లా, బంగ్లాదేశ్

ఎడమకాలి పట్టీ 

అర్పణ

వమనుడు


36. శ్రీ పర్వతం, లడక్ వద్ద, కాష్మీర్ - (శ్రీ శైలం, ఆంధ్రప్రదేశ్ అని కూడా చెబుతారు)

కుడికాలి పట్టీ 

శ్రీ సుందరి

సుందరానందుడు


37. విభాష్, తమ్లుక్ వద్ద, తూర్పు మేదినీపూర్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

ఎడమ కాలి మణికట్టు

కపాలిని (భీమరూప)

సర్వానందుడు


38. ప్రభాస్, వీరవల్ స్టేషను, సోమనాథ్ మందిరం వద్ద, జునాగధ్ జిల్లా, గుజరాత్

ఉదరం 

చంద్రభాగ

వక్రతుండుడు


39. భైరవ పర్వతం, శిర్పా నది ఒడ్డున, ఉజ్జయిని, మధ్య ప్రదేశ్ 

పై పెదవి పైభాగం 

అవంతి

లంబ కర్ణుడు


40. జనస్థానం, గోదావరీ లోయ, నాసిక్ వద్ద, మహారాష్ట్ర

చుబుకం 

భ్రామరి

వికృతాక్షుడు


41. సర్వశైలం, గోదావరీ తీరం, రాజమండ్రి వద్ద, కోటిలింగేశ్వర మందిరం, ఆంధ్రప్రదేశ్ 

బుగ్గలు 

రాకిణి / విశ్వేశ్వరి

వత్సనాభుడు / దండపాణి


42. బిరత్, భరత్ పూర్ వద్ద, రాజస్థాన్ 

ఎడమ కాలి వేళ్ళు 

అంబిక

అమృతేశ్వరుడు


43. రత్నావళి, రత్నాకర నది ఒడ్డున, ఖనకుల్-కృష్ణనగర్ వద్ద, హూగ్లీ జిల్లా, పశ్చిమ బెంగాల్

కుడి భుజం 

కుమారి

శివుడు


44. మిథిల, జనక్ పూర్, భారత్-నేపాల్ సరిహద్దులో

ఎడమ భుజం 

ఉమ

మహోదరుడు


45. నల్హతి, కొడపైన, బీర్భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్

కాలి పిక్క ఎముకలు

కాళికా దేవి

యోగేశుడు


46. కర్ణాట్ (స్థలం తెలియదు) 

చెవులు 

జయదుర్గ

అభీరుడు


47. వక్రేశ్వరి, పాపహర నది ఒడ్డున, దుబ్రాజపూర్ స్టేషను వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

కనుబొమల మధ్య భాగము

మహిష మర్దిని

వక్రనాథుడు


48. జెస్సోర్ (యశోరి), ఈశ్వరిపుర్ వద్ద, ఖుల్నా జిల్లా, బంగ్లాదేశ్ 

చేతులు, కాళ్ళు 

యశోరేశ్వరి

చందుడు


49. అత్థాస్, లాభపూర్ వద్ద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

పెదవులు 

ఫుల్లార

విశ్వేశుడు


50. నందిపూర్, సైంతియా రైల్వే స్టేషనులో ఒక మఱ్ఱి చెట్టు క్రింద, బీర్ భమ్ జిల్లా, పశ్చిమ బెంగాల్ 

మెడలో హారం 

నందిని

నందికేశ్వరుడు


51. శ్రీలంక (ట్రింకోమలి లో, హిందూమహాసాగర తీరాన ఉన్న ఈ మందిరం శిథిలమైనదనీ, కేవలం ఒక స్తంభం మాత్రమే మిగిలి ఉన్నదనీ ఒక వివరణ) 

కాలి పట్టీలు 

ఇంద్రాక్షి

రాక్షసేశ్వరుడు


🌹🙏ఓం శ్రీ మాత్రే నమః🙏🌹

🌻🍏🌼🍍🌹🍈🌿🥥🥥🌿🌷🍋🍁🌻

Tags

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat