🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿
🌸పిల్లలు పుట్టిన వెంటనే జన్మనక్షత్రం ప్రకారం దోషం ఉన్నదా? జన్మలగ్నం దశాత్ ఏమైనా దోషములు ఉన్నాయా? అనేది పరిశీలించడం ఒక ఆనవాయితీ. అలా ఎందుకు చేయాలి.
🌿జనన కాలమునకు గండ నక్షత్రములు అని పేరుతో కొన్ని నక్షత్రాలు చెప్పారు కదా. ‘అశ్విన్యాది చతుష్కంచ పుష్య ప్రభృతి పంచకం; రాధేంద్ర భాతి త్రితయం పూర్వాభాద్రా చరేవతీ చిత్తార్ర్దా బహు దోషంస్సాత్ పితృ మాతృ హానిం వదేత్’ అని వున్నది. ప్రతి పంచాంగంలోను ఉదహరిస్తున్నారు.
🌸ఆ పట్టికను ఆధారంగా ఏ నక్షత్ర పాదంలో పుడితే తల్లికి గండము, ఎందులో పుడితే తండ్రికి గండము అనే అంశాలు మనం తెలుసుకొని నక్షత్ర శాంతి చేయించుకొని ముందుకు వెళ్లాలి.
🌿వైదిక సంప్రదాయంలో ఏ నక్షత్రంలో పిల్లలు పుట్టినా‘ముభావ లోకనం’ (నూనెలో ముఖం చూచుట) శిశువును ప్రథమతః నూనెలో ముఖం చూచి తరువాతనే ప్రత్యక్షంగా చూడడం శ్రేయస్కరం అని పెద్దల వాదన.
🌸శాస్త్రాన్ని అనుసరిద్దాం అనే ఉద్దేశం వున్నప్పుడు వేద విహితమైన వైదిక మార్గానికి పెద్ద పీట వేయవలసిందే.
🌿ఇక జన్మలగ్నాత్ చాంద్రాష్టమంచ ధరణీ సుతస్సప్తమంచ రాహుర్నవంచ శని జన్మ గురున్తృపతీయే అర్కస్తు పంచ భృగుషట్క బుధశ్చతుర్దే కేతో వ్యయోస్తు బాలారిష్టానాం’ అని ఎక్కువ వాడకంలో వున్న సూత్రం.
🌸జన్మ లగ్నము నుండి అష్టమంలో చంద్రుడు వున్ననూ, కుజుడు సప్తమంలో వున్ననూ, రాహువు నవమంలో వున్ననూ, జన్మంలో శని వున్ననూ, గురువు తృతీయంలో వున్ననూ, రవి పంచమంలో వున్ననూ, శుక్రుడు ఆరవ యింట వున్ననూ, బుధుడు చతుర్ధంలో వున్ననూ, కేతువు వ్యయంలో వున్ననూ బాలారిష్టములుగా చెబుతారు.
🌿పరాశరుల సిద్ధాంతం ప్రకారం మరియు ఇతర గ్రంథకర్తల వ్యాసములు ఆధారంగా 12వ సంవత్సరం వరకు ఈ బాలారిష్టములు ఉంటాయి. అంతేకాకుండా పితృ మాతృ పూర్వ జన్మల ఫలితంగానే ఈ బాలారిష్టములు కూడా అందిస్తాయి.
🌸అష్టమాధిపతి దశ అయినను అష్టమంలో వున్న గ్రహం యొక్క దశ అయినను ప్రారంభంలో వస్తే ప్రమాదమే.
🌿అలాగే లగ్నంలో షష్ట్ధాపతి, షష్ఠంలో లగ్నాధిపతి, ఇదే రీతిగా లగ్న వ్యయాధిపతుల విషయంలో కూడా చర్చనీయాంశ ప్రమాదకర అంశాలు ఉంటాయి.
🌸అందువలన ఆయా బాలారిష్టముల విషయములు మరియు గండ నక్షత్ర విషయములు ముందుగానే శోధింప చేసుకొని తగిన శాంతి మార్గములు వెదికి చేయించుట శ్రేయస్కరము.
🌿బాలారిష్టములు ఇచ్చే గ్రహముల దశలు అంతర్దశలు 12వ సంవత్సరం వయసులోపుగా కనుక వస్తే అది ఇంకా ప్రమాదమే. అప్పుడు బహు జాగ్రత్తలు తీసుకోవాలి.
🌸అలాగే బాలారిష్టములు వున్న శిశువుకు 12వ సంవత్సరం వరకు తరచుగా ఆరోగ్య సమస్యలు రావడం పెద్దల శోధనల వలన వెల్లడి అవుతోంది. గండ నక్షత్ర శాంతి బాలారిష్ట శాంతి విధానములు వైదిక మార్గంలో నిష్ణాతులయిన పండితుల ద్వారా తెలుసుకోవాలి.
🌿ఎలాంటి జాతకంలో పుట్టినా నామకరణం రోజు నక్షత్ర హోమం, నవగ్రహ హోమం చేయించడం సర్వదా శ్రేయస్కరం..