⚜️ పూంగావనం ⚜️
కోట్టైపడి దాటినచో తదుపరి వచ్చే వన ప్రదేశమంతయు భగవాన్ శబరిమల ధర్మశాస్తా వారి యొక్క పూంగావనమనియే ఆర్యులు సంబోధించెదరు. కానీ అళుదానది యొక్క అవతల తీరము నుండియే నేటి వన ప్రదేశము ప్రారంభమగుచున్నది. శబరిమల దేవాలయమునకు ముంగిట పదునెనిమిది సోపానములు ఉన్నట్లే ఈ పూంగావనమునందు గూడా పదునెనిమిది కొండలు గలవు. ఆ పదునెనిమిది పుణ్య పర్వతములను తనలో దాచుకొన్న పూంగావనము భగవాన్ శ్రీ అయ్యప్ప స్వామి వారి దివ్యపాద స్పర్శము సోకిన పుణ్యస్థలమనునది మన ఆర్యుల ధృఢవిశ్వాసము.
🙏🌸ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప🌹🙏