జపమాల జాగ్రత్తలు

P Madhav Kumar



జపమాలను అటూ ఇటూ ఊపకూడదు. అలా ఊపితే సాధనఫలం పూర్తిగా దక్కదు. మాలలోని పూసలు విరిగి ఉంటే, దుఃఖం ప్రాప్తిస్తుంది. కనుక కొన్ని పూసలు విరిగి ఉన్న మాలతో జపం చేయకూడదు. జపం చేసేటప్పుడు మాల నుంచి శబ్దం రాకుండా చూసుకోవాలి. అలా శబ్దం వచ్చే మాలతో జపం చేసుకునే సాధకుడు వ్యాధిగ్రస్తుడవుతాడు. జపం చేసుకునే సమయంలో మాల చేతినుంచి జారి కింద పడిపోతే సాధన లేక ఉపాసన పరిపూర్ణం కాదు. జపం చేసుకునే సమయంలో జపమాల దారం తెగిపోతే సాధన – జపాల ఫలం ప్రాప్తించదు. ఇది అరిష్టాన్ని సూచిస్తుంది. కనుక ఈ జాగ్రత్తలన్నిటినీ సాధకుడు పాటిస్తూ జపమాలను ఉపయోగించుకుంటే సత్ఫలితాలను పొందవచ్చు. కుడిచేతిని గౌముఖి (ఆవుముఖం వంటి సంచి)లో పెట్టుకుని జపం చేసుకోవాలి. గౌముఖి లేకపోతే శుభ్రమైన వస్తంతో కుడిచేతిని కప్పి ఉంచాలి. తలమీద చేతిని గాని, బట్టను గాని ఉంచకూడదు. చూపుడు వేలును వేరుగా ఉంచి జపం చేసుకోవాలి. మనిమాలను ఉంగరం వేలుమీద పెట్టి, బొటనవేలితో స్పృశిస్తూ మధ్యవేలు మీదుగా ఆ మాలను తిప్పాలి. సుమేరును అతిక్రమించకూడదు. ఒక మాలజపం పూర్తయిన తరవాత మళ్ళి తిప్పే సమయంలో సుమేరు దగ్గర నుంచి మాలను వ్యతిరేక దిశలో తిప్పి జపం చేసుకోవాలి. జపం చేసుకునే సమయంలో అటూ ఇటూ కదలటం, కునిపాట్లు పడటం, మాట్లాడటం, మాలను చేతిలోంచి కింద పడేయటం ఇవన్నీ చేయకూడదు. మధ్యలో మాట్లాడాల్సివస్తే భగవంతుణ్ణి స్మరించుకుని జపాన్ని మళ్ళీ మొదలుపెట్టాలి. ఇంట్లోని ఏకాంతప్రదేశం, గోవులకు సమీపంగా ఉన్న చోటు, పవిత్రమైన అడవి, తోట, తీర్తస్థలం, నదీతీరం, దేవాలయం ఇవన్నీ జపం చేసుకోవడానికి ఉత్తమమైన ప్రదేశాలు. ప్రాతఃకాలంలో అయితే చేతిని తిన్నగా, వేళ్ళు పైకి ఉండేట్లుగా, హృదయానికి సమీపంలో ఉంచుకుని జపం చేసుకోవాలి. సాయం సమయంలో అయితే కుడిమోకాలును నిలబెట్టి, చేతిని కిందవైపు ఉండేట్లుగా వెనక్కి తిప్పి, ముక్కుకు సమీపంలో ఉంచి జపం చేసుకోవాలి. మధ్యాహ్న వేళ అయితే చేతివేళ్లు పైకి ఉండేట్లు చేతిని నిలువుగా నాభికి సమీపంలో ఉంచి జపం చేసుకోవాలి. మంత్రాన్ని మెల్ల మెల్లగా నోటితో పలుకుతూ చేసె జపాన్ని ‘వాచిక జపం’ అని అంటారు. ఇతరుల చెవికి వినపడనంత మెల్లగా మంత్రాన్ని పలుకుటూ చేసే జపం ‘సుపాంశు జపం’. నాలుక, పెదవులను కదల్చకుండా చేసే జపాన్ని ‘మానసిక జపం’ అని అంటారు. మనసులోనే చేసుకునే జపవిధానం కనుక ఇది ఉత్తమమైనదిగా భావింపబడుతోంది. జిహ్వ-పెదవులు కదల్చకుండా మనసులోనే జపించటం జరుగుతుంది. కనుక ఈ జపవిధానంలో స్వర, లయాదుల దోషాల ప్రసక్తి ఉండదు. శుద్ధి చేసిన తరువాతే మణిమాలను ఉపయోగించాలి. మణిమాలను శుద్ధి చేసే విధానం – తొమ్మిది తమలపాకులను గాని, రావి ఆకులను గానీ తీసుకొచ్చి, ఎనిమిది ఆకులతో అష్టదళాకృతిని తాయారుచేసుకోవాలి. తొమ్మిదో ఆకును అష్టాదళాకృతి మధ్యలో పెట్టి, దానిమీద మాలను ఉంచి పవిత్రపరచాలి. ఊం, అం, ఆం, ఇం ఈం, ఉం, ఋం, లుం, ల్రుం, ఎం, ఏం ఓం, ఔం, అం, అః, కం, ఖం, గం, ఘం, డం, చం, ఛం, జం, ఇ’ం, టం, ఠం, డం, ణం, తం, థం, దం, ధం, నం, పం, ఫం బం, భం మం, యం, రం, లం, వం, శం, షం, సం, హం, క్షం – ఈ మంత్రాలను జపిస్తూ పంచగవ్యాలతొ మాలను అభిషేకించాలి. దాని తరవాత దిగువ ఇచ్చిన మంత్రాన్ని ఉచ్చరిస్తూ గంగాజలంతొ మాలకు స్నానం చెయించాలి. మంత్రం: – ఓం సద్యోజాతం ప్రపధాని సద్యోజాతాయ వై నమోనమః| భవే భవే మాటి భవే భవస్య మం భావోబ్దవాయ నమః||

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat