ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటిగాధ వుంటుంది. మంచి నీతి కథ

P Madhav Kumar

 ✍🏼💧


*ఓ వ్యాపారి భార్య డెలివరీకి వెళ్ళింది, అప్పటిదాకా తాముంటున్న సింగిల్ బెడ్ రూమ్ ఇంటిని ఖాళీ చేసి ఊరికి కొంచెం దూరంగా ఓ సొసైటీలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసుకుని చేరాడు*


ఆరోజు పోర్టికోలో కూర్చుని కాఫీ తాగుతున్నాడు, ఆకు కూరలు, ఆకు కూరలు అని కేక వినిపించింది, డెబ్బై ఏళ్ల వృద్ధురాలు తలపై కూరల గంప పెట్టుకుని కనిపించింది, పిలిచాడు, కాస్త గంప దించయ్యా అన్నది అవ్వ, పాలకూర కట్ట ఎంత ? అడిగాడు, పది రూపాయలకు మూడయ్యా చెప్పింది అవ్వ, మరీ అన్యాయం, బయట అయిదు ఇస్తున్నారు అన్నాడు చిరుకోపంగా, నాలుగు తీసుకో కట్టలు తీసింది అవ్వ.


*పదిరూపాయలు ఇచ్చాడు, గంప కాస్త పట్టయ్యా అన్నది అవ్వ, గంపను తనవైపు ఎత్తి పట్టుకుని, గంపను పైకి లేపుతూ రెండు కట్టలు పాలకూర తీసి ఇంట్లోకి విసిరాడు, అమ్మయ్య పది రూపాయలకు ఆరు కట్టలు వచ్చాయి అనుకున్నాడు, ఎంత ఆశో ఈ ముసలిదానికి, ఇవాళో రేపో చావబోతుంది, ఇంకా డబ్బు మూటలు కడుతున్నది అని ముసిముసిగా నవ్వుకున్నాడు, అప్పటినుంచి అవ్వ వచ్చినపుడల్లా గంప ఎత్తడానికి సాయం పడుతూ ఒక బీరకాయో, రెండు వంకాయలో, ఒక దోసకాయో, చిన్న సొరకాయో తీయడం మొదలుపెట్టి ముసలిదాని రోగం కుదిర్చానని సంతోషపడసాగాడు*


కొన్నాళ్ల తరువాత ఎప్పటిలాగే గంప పైకెత్తుతూ రెండు కొత్తిమీర కట్టలు లేపేశాడు, అంతలోనే ఎవరిదో ఏడుపు వినిపించింది, ఎనిమిదేళ్ల అమ్మాయి పుస్తకాల సంచీని మోస్తూ అమ్మమ్మ నన్ను స్కూల్ నుంచి పంపేశారు, ఏడుస్తూ వచ్చింది, అవ్వ కంగారుగా, అయ్యో నా బిడ్డ, బాబూ... కాస్త గంప కిందికి దించునాయనా అన్నది వ్యాపారితో, ఏడవకమ్మా, నేనొచ్చి చెబుతాలే, రేపు యూనిఫామ్ కొనిస్తా, ఫీజు కడతాలే, నా తల్లే, ఇంటికిపొదాం, ఆ చిన్నారి కన్నులు తుడుస్తూ, వ్యాపారికి అర్ధం కాలేదు, ఎవరీ పిల్ల..? అని అడిగాడు అవ్వను 


మనవరాలు బాబూ, ఆడపిల్ల పుట్టిందని అల్లుడు, కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు, ఇల్లు సాకడానికి చిల్లిగవ్వ లేదు, అందుకే కూరగాయలు తీసుకుని మోస్తూ ఇల్లిల్లూ తిరుగుతూ అమ్ముకుంటూ పైసాపైసా కూడబెట్టి దీన్ని చదివిస్తున్నా, స్కూలో మొన్న కొంత ఫీజు కట్టాను, ఇంకా వెయ్యి రూపాయలు పెరిగిందని చెప్పారు, నెలరోజుల్లో కడతానని చెప్పి బతిమాలితే సరే అన్నారు, ఈరోజు చూడు బాబు, పసిపిల్ల అనే కనికరం కూడా లేకుండా బయటకి పంపించారు, అన్నది కళ్ళు తుడుచుకుంటూ


*వ్యాపారి నరాలు మొత్తం బిగుసుకునిపోయాయి, రక్తం స్తంభించిపోయింది, అతని హృదయం ఆకాశం చిల్లులు పడేలా ఏడుస్తున్నది, ఎంత నిగ్రహించుకున్నా కళ్ళు ధారలు కట్టాయి, ముసల్దానికి ఎంత డబ్బు ఆశ అన్న మాటలు, వెయ్యి గునపాలై దేహాన్ని కుళ్ళబొడిచింది, ప్రతి కష్టం వెనుకా ఒక కన్నీటిగాధ ఉంటుందని తెలియని, తన అజ్ఞానానికి తనను తానే శపించుకున్నాడు, తన పర్సులో చెయ్యి పెట్టి, అవ్వాకి ఓ రెండు వేల రూపాయలు బలవంతంగా ఇచ్చాడు*


బాబూ, ఇంత అప్పు తీర్చాలంటే నాకు ఏడాది పడుతుంది అన్నది అవ్వ వణుకుతూ, అప్పని ఎవరు చెప్పారు? ఇప్పుడే కాదు, నీ మనవరాలి చదువు అయ్యేంతవరకు నేనే ఫీజ్ కడతాను, రేపటినుంచి రోజూ, నేను ఉన్నా లేకపోయినా పదిరూపాయల ఆకు కూరలు ఇచ్చేసి వెళ్ళు, అంటూ గంప పైకెత్తాడు, మరునాడు నిద్రలేచి తలుపు తీశాడు, వాకిట్లో ఆరు ఆకు కూర కట్టలు కనిపించాయి


*నేనే బాగుండాలి అనుకోవడం స్వార్థము, అందరూ బాగుండాలి అనుకోవడం లోకకళ్యాణార్థము*


🪷🪷🪷  Ⓜ️  🪷🪷🪷

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat