🍁🍁🍁🍁🍁🍁
*ధాన్య మాలికి శాప విమోచనం* ✴️✴️✴️✴️✴️✴️
రామ ,రావణ యుద్ధం మహా భీకరం గా సాగుతోంది .ఇంద్రజిత్ ను లక్ష్మణుడు వధించి అందరి ప్రశంశలు పొందాడు .కోపం తో రెచ్చి పోయి రావణుడు లక్ష్మణుని మీదకు శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు .దాని ప్రభావం వల్ల లక్ష్మణుడు మూర్చ పోయాడు .రాముడు కలవర పడ్డాడు .హనుమను ప్రార్ధించాడు తన తమ్ముని బ్రతికించమని .వెంటనే హనుమ ద్రోనాద్రి మీదకు ప్రయాణం సాగించాడు .అక్కడ ఒక ముని ఆశ్రమం కనిపించింది .చాలా ప్రశాంతం గా వుంది ఆశ్రమం .హనుమ మనసు అటు లాగింది .అక్కడ వున్న తాపసి ని దర్శించి ,ఆశీర్వచనం పొందాలని భావించాడు .కొంచెం అనుమానమూ వచ్చింది .ఇదివరకు వచ్చినపుడు ఈ ఆశ్రమం లేదు .ఇప్పుడెలా వచ్చింది ?సరే చూద్దాం అని లోనికి ప్రవేశించాడు .సమాధి నిష్ఠ లో వున్న ముని కనిపించాడు .దాహం వేసి మంచి నీళ్ళు ఇవ్వమని మునిని అడిగాడు .ఆయన కొంచెం సేపు హనుమను ప్రశ్న ల తో కాల హరణం చేసి ప్రక్కనే వున్న జలాశయం దగ్గరకు వెళ్ళమని చెప్పాడు .
మంచి నీరు తాగుదామని అందు లోకి దిగాడు హనుమ .వెంటనే అకస్మాత్తుగా ఒక మొసలి హనుమ కాలు పట్టుకొని నీటి లోకి లాగడం ప్రారంభించింది .భయపడని మారుతి చేతులతో దాని దవడలను చీల్చి పారేశాడు .వెంటనే అది ఒక అందమైన స్త్రీ రూపం గా మారి హనుమకు కనిపించింది .అద్భుత సౌందర్య రాశి గా వుంది ఆ సుందరి .సమ్మోహనం కల్గిస్తోంది .ఆమె ఆన్జనేయున్ని భక్తీ తో ఇలా ప్రార్ధించింది
”జయ సంసార మహాంధ కారతరనీ ,సౌవర్ణ భూభ్రుద్ఘ్రునీ
జయ,నానాగమ తత్వ భవ్య సరణీ ,సద్భక్త చింతామణీ
జయ దుష్టాసుర జీవ మారుత ఫణీ ,చంచత్ప్రతాపారానీ
జయ సాదూత్తమ చిత్త వారణ సృణీ ,శాఖామ్రుగా గ్రామానీ .
దీని అర్ధం తెలుసు కొందాం .వో!హనుమా !సముద్రం దాటి రామ ముద్రను సీత కు ఇచ్చావు .లంకను దహించి రాక్షసుల గర్వం అణచావు .బుద్ధి శాలివి .ఆర్త జన బాన్ధవుడవు .నీకు నమస్కారం .మొసలి రూపం తో ఈ బురదలో పొర్లుతున్ననన్ను నీ పాద స్పర్శ తో పునీతం చేశావు .నీ మహిమ ను పొగడటం ఎవరి వల్లా కాదు .నీకు ఒక ఉపాయం సూచిస్తాను .ఇక్కడ నీకు కనిపించిన వాడు దొంగ వేషం లో వున్న కాలనేమి అనే రాక్షసుడు .ముని వేషం తో వున్నాడు .మోసగాడు .నీ ప్రయాణానికి ఆటంకం కలిగించ టానికే రావణుడు వాడిని ఇక్కడ ఉంచాడు .వాడిని చంపి నువ్వు ముందుకు సాగిపో .జయం లభిస్తుంది ”.ఈ మాటలు విన్న హనుమ హృదయం కరిగి పోయింది .ఇంతకీ ఆమె ఎవరు ?ఎందుకు మొసలి రూపం వచ్చిందో తెలుసు కోవాలని ఆమెనే అడిగాడు ఆమె వృత్తాంతాన్ని సవివరం గా చెప్పమన్నాడు .ఆమె ఏమి చెప్పిందో తరువాత తెలియ జేస్తాను .
సర్వ వేదాంత వేద్యాయ –పూర్ణయ పరమాత్మనే –సచ్చిదానంద రూపాయ –భవిష్యద్ బ్రహ్మనే నమః