కాలనేమి ని వధించిన హనుమ
ధాన్య మాలికి శాప విమోచనం కల్పించి హనుమంతుడు ,,ఆమె చెప్పినట్లే కపట ముని గా ఆశ్రమం లో రావణుని కుటిలం తో కూర్చున్న కాలనేమి అనే రాక్షసుడిని ఒక్క దెబ్బకు సంహరించాడు హనుమ .వెంటనే ద్రోనాద్రి మీదకు చేరాడు అతివేగం గా లక్ష్మనుడిని కాపాడాలనే తొందరలో .ఆ కొండ రత్న ,మాణిక్య ,గిరిక మొదలైన ఒశాదులతో వెలిగి పోతోంది .తనకు ,అవసరమైన ,లక్ష్మణుని ప్రాణరక్షణ చేసే ఔశాడిని కనిపించేట్లు చెయ్యమని ఆ గిరి ని ప్రార్ధించాడు .అదేమీ విని పించు కోలేదు .హనుమకు ఆగ్రహం వచ్చి ”రావణుని శక్తి ఆయుధానికి లక్ష్మణ స్వామికి మూర్చ వచ్చింది .దాన్ని చూడ లేక శ్రీ రాముడు తల్లడిల్లు తున్నాడు .రామానుజున్ని పునర్జీవిమ్పజేయ టానికి తగిన ఓషధి ని చూపించమంటే నువ్వు చూపించట్లేదు .నిన్ను క్షమించాను ”అని ఆకొండకు చెప్పి భీకరం గా సింహం లా గర్జించాడు .ఆ ద్రోనాద్రి మీద వున్న సకల ప్రాణి కోటి గజ గజ వణికి పోయింది .భయం తో పరుగులు తెశారు అందరు .రక్షించండి రక్షించండి అంతు గగ్గోలు పెడుతున్నారు .కోపం తో హనుమ ద్రోనాద్రి ని తన తోకకు చుట్టి ,దాన్ని పెకలించాతానికి ప్రయత్నం చేస్తున్నాడు .అప్పుడు ఆ గిరిమీద వున్న పదమూడు కోట్ల గంధర్వులు మహా క్రోధం తో ఆంజనేయుడి తో తలపడటానికి సిద్ధమయారు .హనుమ ర్చి పోయాడు వీళ్ళా నన్ను ఎదిరించేది అనుకోని తోకతో వాళ్ల గొంతుకల్న్నీ బిగించి ,ఆకాశం లోకి వారిని అందర్నీ ఎగరేశాడు .కాళ్ళు చేతులు విరిగి కుయ్యో ,మొర్రో అంతు ,ఆర్తాక్ నాదాలతో వాళ్ళు కాకా వికలం అయారు .బుద్ధి వచ్చి ,చెంపలేసుకొని ,తమ తప్పును కాయమని కాళ్ళా వెళ్ళ పడ్డారు .క్షమించమని ప్రాధేయ పడ్డారు .బుద్ధి గడ్డి తిన్నాడని ఒప్పుకొన్నారు .కనికరించిన హనుమ వాళ్ళందరినీ మళ్ళీ ఆ కొండ శిఖరం మీదకు చేర్చాడు .బతుకు జీవుడా అంతు వాళ్ళు ఊపిరి పీల్చుకొన్నారు .
హనుమ నుఅడ్డ గిన్చాలి అనే నెపం తో రావణుడు మాల్యవంతుడు అనే క్రూర రాక్షసుడిని పంపాడు సైన్యం తోడూ ఇచ్చి .వాడు హనుమతో ”ఏమయ్యా !నీకేమీ పనీ పాటు లేదా .ఎన్ని సార్లు వచ్చి ఈద్రోనాద్రి మీద వున్న మందుల్ని పెకలించుకు తీసుకొని వెళతావు /నా ముందు ఈశ్వరుడు కాని ,విష్ణువు కాని నిలవ లేడ్రు .నువ్వో లెక్కా ?ఆ కొండను సముద్రం లో పారేసి అప్పుడు కదులు ”అని బెదిరించాడు .హనుమకు తీవ్ర కోపం వచ్చింది .”ఒరే రాక్షసా ! కొండను కాదురా నిన్ను సముద్రం లోకి విసురుతా చూడు ”అన్నాడు .వాడు రాక్షస వీరుల్ని అందర్నీ రెచ్చగొట్టి మారుతి మీదకు వుసి గోలిపాడు .వాళ్ళందరినీ ఒక్కడు కూడా మిగలకుండా చంపేశాడు హనుమ .మాల్యవంతుడు యుద్ధానికి దిగాడు .హనుమంతుని ముందు కుప్పి గంతులా ?వాన్ని తోకతో చుట్టి గిర గిరా తిప్పి సముద్రం లోకి విసిరి పారేశాడు .అఆకాశం లోని దేవతలందరూ పూల వర్షం కురిపించారు .ఆంజనేయుని బల ,పరాక్రమాలను స్తుతించారు .సమయానికి తగిన మందుల మొక్కలతో వచ్చి లక్ష్మణుని ప్రాణాలు కాపాడాడు శ్రీ హనుమ .శ్రీరాముడు సంతోషమ్ పట్టలేక కృతజ్ఞతతో మారుతికి ఆలింగాన సౌఖ్యం కలిగిస్తూ ”నాయనా హనుమా !లక్ష్మణ మూర్చ చేత రఘువంశం అనే పైరుతాత్కాలికంగా ఎండి పోయింది .దానికి నువ్వు మేఘం లాగా వర్షించి ,మళ్ళీ వృద్ధి చెందిన్చావు .నీకు నేనేమీ ప్రత్యుపకారం చేయ లేను ”.అని ఆప్యాయం గా కౌగిలించుకునాడు .
హనుమంతుని దివ్య శక్తులను పొగడటం ఎవరి వల్లా కాదు .అతని మైత్రీబంధం ,శక్తి ,యుక్తి ,కార్య దీక్ష ,స్వామి భక్తీ మాటలతో వర్ణించ లేనివి అతని తోక ఒక్కటి చాలు లంకను పిండి బొమ్మ లా సముద్రం లో పడ వెయ్య టానికి .అతనికి అసాధ్యమైనది ఏమీ లేదు ..