మైరావణ వధ
— రామ ,ఆంజనేయ పరాక్రమానికి రావణుడు భయపడి పోయాడు .వెంటనే నాగ లోకాదిపతి మై రావణునికి తక్షణమే రమ్మని కబురు చేశాడు .అతను రాగానే తనభయాన్ని చెప్పుకొని ,ఉపాయం చెప్పమన్నాడు .వాడు నవ్వి ,భయపడాల్సిన అవసరం లేదనీ ,వానరులన్దర్నీ పాతాళంలో అమ్మ వారికి బలి ఇస్తాననీ ధైర్యం చెప్పి మళ్ళీ తన లోకానికి వెళ్లి పోయాడు .అతని భార్య కు విషయం తెలియ జేశాడు .ఆమె ”హనుమ వంటి మేధావి,రామునికి మంత్రిగా ,నమ్మిన బంటు గా వుండగా ,రాముని జయించటం కష్టం కాలనేమిని ,మాల్యవంతుని ,అక్ష,ధూమ్రాక్ష ,దానవ సంహారం చేసిన సంగతి గుర్తు లేదా ?హనుమ పై భక్తీ కలిగి వుండటం మంచిది .”అని హితవు చెప్పింది .ఆమె మాటలను పెడ చెవిని పెట్టి మైరావణుడు తన ప్రయత్నం లో వున్నాడు .మైరావనుని దుస్త పన్నా గాన్ని తెలుసు కొన్న తన భర్త విభీషణునికి ఈ విషయం తెలియ జేసింది .అతను వెంటనే హనుమ కు చెప్పాడు .రాక్షస మాయ చాలా భయంకరం గా ఉంటుందనీ ,వారి మాయను తెలుసు కోవటం కష్టమని ,వివేకం తో కపిసేనను ,తనను ,రామ లక్ష్మణులను కాపాడే బాధ్యత హనుమదే నని స్పష్టం గా చెప్పాడు . ,
అప్పుడు హనుమ కాలవ్యాలము అనే పేరు గల తన తోకను పెంచి ,కపిసేన చుట్టూ కోటగా కట్టి దానిపైకి ఎక్కి కూర్చున్నాడు .మైరావణుడు దొంగ వేషం లో వచ్చాడు .హనుమ తోక కోటను గురించి వేగుల వారి ద్వారా విని ,వారితో నేలను రహస్యం తవ్వించి ,ఆను పానులన్నీ వారి ద్వారా తెలుసు కోని విభీషణుడి వేషం లో అక్కడికి చేరాడు .నమ్మకం గా హనుమతో మాట్లాడి తోక కోట లోకి రామ లక్ష్మణులను పరామర్శించే నెపం తో ప్రవేశించాడు .అక్కడ తన మాయా జాలం తో రామ లక్ష్మణులను ఎత్తుకొని పోయి భద్ర కాళి ఆలయం లో ఉంచాడు .
ప్రమాదాన్ని పసిగట్టిన విభీషణుడు వెంటనే హనుమకు విషయం చేర వేశాడు .హనుమ క్షణం కూడా ఆలస్యం చేయ కుండా తన కుమారుడైన మత్య వల్లభుని సాయం తో పాతాళ లంకకు చేరాడు .అక్కడ దుర్దండి అనే రాక్షసి ని మచ్చిక చేసుకొని ,అక్కడి రహస్యాలన్నీ తెలుసు కొన్నాడు .అక్కడ మైరావనుని సేనను సర్వ నాశనం చేశాడు .మైరావనుడిని సంహరించాడు పుత్ర ,పౌత్రులతో సహా .రామ లక్ష్మణులను సురక్షితం గా లంకకు చేర్చాడు .తనకు సహాయ పడిన దుర్దండి కొడుకు కు పాతాల లంకా పట్టాభిషేకం చేశాడు కృతజ్ఞతగా .ఇది తెలుసుకొన్న రావణుడుఖడ్గ రాముడు అనే రాక్షసుణ్ణి ఉసి కొల్పి పంపాడు .ఆంజనేయుడు వాడిని మెడ నులిమి మట్టు పెట్టాడు .ఇలా ధైర్యం తో ,వివేకం తో ఉపాయం తో శ్రీరాముడినీ రామానుజుడినీ ,కపి సైన్యాన్ని దుష్ట రాక్షసుల నుండి రక్షించి తన మంత్రిత్వానికీ ,స్వామి భక్తికీ నిదర్శనం గా నిలిచాడు వాయు పుత్ర హనుమ .