*అధ్యాయము - 9*
*నిశుంభ వధ - 2*
భయంకరపరాక్రముడైన అతని సోదరుడు నిశుంభుడు నేలగూలగా శుంభుడు మిక్కిలి రోషంతో అంబికను చంపడానికి బయలుదేరాడు.
తన రథంపై నిలిచి, మిక్కిలి పొడవై అసమానమైన తన ఎనిమిది చేతులలో మహోత్తమ ఆయుధాలు ధరించి ఆకాసమంతా వ్యాపించి ప్రకాశిస్తున్నాడు.
అతడు రావడం చూసి దేవి శంఖాన్ని పూరించి ధనుష్టంకారం ఒనర్చింది. ఆ శబ్దం అత్యంత దుర్భరమై ఉంది.
మరియు సకలదైత్య సైన్యాల ధైర్యం సడలిపోయే తన ఘంటానాదాలతో ఆమె దిక్కులను నింపివేసింది.
అంతట సింహం తన గొప్ప గర్జినినాదంతో ఏనుగుల మహామదం దిగజారిపోయేట్లు దశదిశలను నిండించివేసింది.
అంతట కాళి ఆకాశానికి ఎగిరి (క్రిందికి దూకుతూ) భూమిని తన రెండు చేతులతో కొట్టింది. ఆ శబ్దంలో అంతకు ముందటి శబ్దాలన్ని మునిగిపోయాయి.