_*శ్రీ హనుమ కధామృతము 6*_

P Madhav Kumar


విభీషణుని కుమారుడు నీలుడు .ఆయన ఒక రోజూ తండ్రి తో ”లంకలో సంపద అనంతంగా వుంది భోగ భూమి గా లంకా వెలిగి పోతోంది .ప్రజలంతా సుఖ సంతోషాలతో వున్నారు .అయితె ఒక లోపం నాకు కన్పిస్తోంది .మన దగ్గర చింతామణి ,కామధేనువు ,కల్పవృక్షం లేవు .మీరు శ్రీరాముని భక్తులు కదా .వాటిని ఎందుకు పొందలేదు ?నాకు అనుమతి నిస్తే వాటినిసాధించి తెచ్చి మన లంకకు అనంత వైభవం తెస్తాను ”అన్నాడు .అప్పుడు విభీషణుడు ”నాయనా !నీ బల పరాక్రమాలు నాకు తెలుసు .సాధించే సామర్ధ్యం నీకు వుంది .నాకు నా రాముడే చింతామణి ,కామధేనువు ,కల్పవృక్షం .శ్రీ రామ పాద సేవ తప్ప నాకు ఏది ఆనందాన్ని ఇవ్వవు .రామ కృప వల్ల దేవేంద్రుడు మొదలైన దిక్పాలకులు నాకు వశులై వున్నారు .ఇంకా మానవుల గురించి చెప్పక్కర లేదు కదా ?అల్పమైన ఆ మూడిటి తో నాకు పని లేదు .అయితె నీకు వాటి మీద ఆశ కలగటం సహజం .అవి ఎప్పుడు దేవతల చేతనే అనుభవింప బడుతున్నాయి .వాటిని పొందాలంటే గురు శుశ్రూష ,దేవతానుగ్రహం ముందు గా సంపాదించు కోవాలి .వారి అనుగ్రహం వల్లనే పొంద గలవు .ముందు మన కులగురువు శుక్రాచార్యుల వారి అనుగ్రహం పొందు .ఆయనే దారి చూపిస్తారు .నీ కోరిక నెర వేరు గాక ”అని దీవించి కొడుకు నీలుడిని పంపాడు .

నీలుడు శుక్రాచార్యులను దర్శించి పన్నెండు ఏళ్ళు శుశ్రూష చేసి మనసు మెప్పించాడు .సంతోషించిన శుక్రుడు నీలుని కోరిక ఏమిటో తెలుసు కొన్నాడు .”నలుడా !నీ కోరిక తీరి చింతామణి లాంటి అపూర్వ వస్తువు లు పొందాలంటే నువ్వు పంచ వక్త్ర హనుమాన్ వ్రతం చెయ్యాలి .ఆయన అనుగ్రహం వుంటే నీకు అన్నీ సిద్ధిస్తాయి .రేపు మృగశిరా నక్షత్రం వుంది .ఆ నక్షత్రమ్ లో హనుమద్ వ్రతం చెయ్యి .”అని ఆ వ్రత విధిని ఉపదేశించాడు .తాను తెచ్చిన అపార ధన రాసులు గురువుకు సమర్పించి ఆయన సన్నిధానం లో హనుమద్ వ్రతాన్ని భక్తీ శ్రద్ధలతో చేశాడు నీలుడు .సంతోషించిన హనుమ మూడు వేల కోట్ల సేవకా గణంతో నీలుడికి ప్రత్యక్షమైనాడు  .నీలుడు పరమానందం తో లేచి నిలబడి శ్రీ హనుమను పరవశం తో స్తోత్రం చేశాడు ”ఓం జయ జయ జయ -శ్రీ ఆంజనేయ -కేసరీ ప్రియనందన –వాయు కుమార –ఈస్వరపుత్ర –పార్వతీ గర్భ సంభూత —వానర నాయక —————భక్త మనోరధ దాయక -భక్త వత్చల -దీన పోషక -దీన మందార –సర్వ స్వతంత్ర -శరణాగత రక్షక -ఆర్తత్రాణ పరాయణ –ఏక అసహాయ శూరా -వీర -హనుమాన్ -విజయీభవ -దిగ్విజయీభవ -దిగ్విజయీ భవ ”

అనిశరనాగాతుడై ప్రార్ధించాడు .వాయుసుతుడైన హనుమ సంతృప్తి చెంది ప్రత్యక్షమై నాడు .”నీలా !నీ భక్తికి మెచ్చాను .నీ తండ్రి విభీషణుడు నాకు పరమ ఆప్తుడు .అమూల్య వస్తువులను నువ్వు కోరావు .అవి తప్పక నీకు లభిస్తాయి దేవతలలో అపురూప సౌందర్య వతి నీకు భార్య గా లభిస్తుంది నువ్వు కోరక పోయినా వరం అనుగ్రహిస్తున్నాను .నీకు వెంటనే ఫలితం లభిస్తుంది నీకు మృగశిరా నక్షత్రం సకల శ్రేయస్సును అందిస్తుంది .నువ్వు తపస్సు చేసిన ఈ క్షేత్రం ఇక నుంచి ”పురుషోత్తమ క్షేత్రం ”అనే పేరు తో పిలువ బడుతుంది ”అని ఆశీర్వదించి హనుమ రుద్ర రుషి గణాలతో అంతర్ధాన మైనాడు .తరు వాత నీలుడు లంకకు చేరి తండ్రికి ,గురువుకు జరిగినది అంతా చెప్పాడు .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat