_*శ్రీ హనుమ కధామృతము 7*_

P Madhav Kumar
1 minute read


చింతామణి ,కామ ధేనువు ,కల్పవృక్షం లను సాధించి తెచ్చుకోవాలనే సంకల్పం తో విభీషణుని కుమారుడు నీలుడు గురువు,శుక్రాచార్యుల ,తండ్రి విభీషణుల దీవెనలతో శ్రీ హనుమద్ వ్రతం చేసి ,ఆ స్వామి అనుగ్రహం పొంది మళ్ళీ లంకకు చేరాడని చెప్పుకొన్నాం .అందర్నీ సంప్రదించి దేవలోకం మీద దండ యాత్ర చేయాలనే సంకల్పం లోకి వచ్చాడు .ఒక దూతను ఇంద్రుని దగ్గరకు రాయబారిగా పంపాడు .”ఇంద్ర!నువ్వు మా రాక్షసులకు చాలా కష్టాలు కల్గిన్చావు .నిన్ను మా సోదరుడు జయించి లంకకు తెచ్చిన సంగతి గుర్తుంచుకో .అప్పుడే అతనికి ఇంద్రజిత్ అనే పేరు వచ్చిందన్న సంగతి నీకు గుర్తుండి వుంటుంది .ఇంకా నీకు మాతో యుద్ధం చేసే ధైర్యము ,శక్తి లేవని మాకు తెలుసు .నీ దగ్గరున్న చింతామణి ,కామధేనువు ,కల్పవృక్షం మొదలైన అపూర్వ సంపద అంతా మజేయి .లేక పొతే పరిణామాలు తీవ్రం గా వుంటాయి ”అని తన సందేశాన్ని ఇంద్రునికి తెలియ జెప్పమని తెలియ జేశాడు .

దూత మాటలు విన్న ఇంద్రుడు కోపం తో ”నేను దేనినీ ఇవ్వను ”అని తేల్చి చెప్పాడు .యుద్ధభేరి మోగింది .ఇంద్ర ,నీలులకు ఘోర యుద్ధం జరిగింది ..యుద్ధ భూమి లో ఇద్దరు తారస పడ్డారు .నీలుడు ఇంద్రునితో ”గౌతమ భార్యను చేరబట్టిన నీకు వావి వరుసలు లేవు .ఇంద్రజిత్ చేతిలో ఓడిపోయావు .ఇప్పుడు నన్ను జయించు దమ్ము వుంటే ”అన్నాడు ఇంద్రుడు కూడా రావణాసురున్ని వాలి చంకలో బంధించి అన్ని సముద్రాలలో ముంచిన సంగతి ఎత్తి పొడుపు గా చెప్పాడు .ఇద్దరు పెద్ద యుద్ధం చేశారు .నీలుని బాణాలను ఇంద్రుడు వమ్ము చేశాడు .ఇంద్రుని వజ్రాయుధాన్ని నీలుడు పనికి రాకుండా చేశాడు .ఇద్దరు కత్తులు దూసి చంపుకో బోయారు

అప్పుడే బ్రహ్మ ప్రత్యక్షమై ”నీలుడా !నీ తండ్రి విభీషణుడు విష్ణు భక్తుడు .ఇంద్రుడు విష్ణువుకు సోదరుడు ..యుద్ధం వద్దు ”అనీ,, ఇంద్రునితో ”ఇంద్ర ! వజ్రాయుధ౦ ఉపసంహరించు .స్నేహంతో మెలుగు నీలుడు అడిగినవన్నీ ఇచ్చేయి ”అని నచ్చ జెప్పాడు .ఇద్దరు అంగీకరించారు .ఇంద్రుడు నీలుడు అడిగిన అమూల్య వజ్రాలు మాణిక్యాలు ,చింతామణి ,కామధేనువు ,కల్పవృక్షం ఆనందంగా ఇచ్చి వేశాడు .వనకన్య అనే దేవకన్యను కూడా ఇచ్చి వేశాడు .వాటిని తీసుకొని నీలుడులంకా చేరాడు .రాక్షస గణమంతా సంతోషించింది .నీల వనకన్యలకు వైభవం గా వివాహం జరిపించారు .అప్పటి నుంచి నీలుడు ప్రతి సంవత్చరం శ్రీ హనుమద్ వ్రతం చేస్తూ జీవితాన్ని ధన్యం చేసుకొని చివరికి సాయుజ్యం పొందాడు .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat