లడ్డు హనుమంతుడు
ఒరిస్సా లో పూరి జగన్నాధ క్షేత్రం వుంది .అక్కడ శ్రీ కృష్ణ ,బల రామ ,సుభద్రా దేవి ల కర్ర విగ్రహాలున్నాయి .దీనినే దారుకా వనం అంటారు .ఇక్కడ దేవుని ప్రసాదాలను మట్టి కుండలతో వండి నైవేద్యం పెట్డారు .చూడ ముచ్చటగా వుంటుంది .సముద్రం ఆలయానికి దగ్గర గా వుంటుంది .చాలా అల్ల కల్లోలం గా వుంటుంది .ఆషాఢ శుద్ధ తదియ నాడు రధోత్సవం అత్యంత వైభవం గా జరుగు తుంది .లక్షలాది జనం వస్తారు .ఇక్కడి ప్రసాదాలు అంటూ ,ఎంగిలి లేకుండా అంతా కలిసి తినడం ప్రత్యేకత .అందుకనే ఎవరింట్లో నైన అంటూ సొంటు లేకుండా వుంటే సర్వం జగన్నాధం అంటారు .అది సామెత గా నిలిచి పోయింది .మహా భక్తుడు చైతన్య మహా ప్రభువు ఇక్కడి నుంచే తన శ్రీ కృష్ణ తత్వాన్ని దేశం అంతటా ప్రచారం చేశాడు .ఆయన ఆశ్రమం వుంది .శ్రీ ఆది శంకరా చార్యులు ”జగన్నాధ స్వామీ నయన పద గామీ భవతుమే .”అనే మకుటం తో జగన్నాధ స్తోత్రం రాశారు ..చాల అద్భుతమైన రచన .చదువుతుంటే మనసు పులక రిస్తుంది .”కదాచిత్ కాళి౦దీ” ‘అని ప్రారంభం అవుతుంది .భక్త కవి జయదేవుడు ఇక్కడి వాడే .ఆయన రచించిన గీత గోవిందం మధుర.భక్తికి నిదర్శనం అలాంటి మహాపుణ్య క్షేత్రానికి దగ్గరలోనే కోణార్క సూర్య దేవాలయం వుంది .దాని దగ్గర సముద్రం మీద సూర్యోదయ అస్తమయాలు చూడటం వింత అనుభూతి ..
ఈ పూరీ క్షేత్రం ను ఒకప్పుడు సముద్రుడు తన ఉత్తుంగ కెరటాలతో ము౦చివేశాడు .జగన్నాధ మందిరం మునిగిపోయింది .ఆయన ఏమి చేయలేక శ్రీ రాముని దగ్గరకు వెళ్లి జరిగిన విషయం చెప్పి సముద్రుడు శ్రీ రాముని వంశం వాడు కనుక అతనికి చెప్పి మళ్ళీ ప్రమాదం రాకుండా చూడమని చెప్పాడు .రాముడు సముద్రున్ని పిలిపించి అలలతో ఆలయాన్ని ము౦చవద్దని హితవు చెప్పాడు .సరేనని వెళ్లి పోయాడు సముద్రుడు ..కొంత కాలమ్ బాగానే వున్నాడు .మళ్ళీ కెరటాలతో అలజడి సృష్టించాడట ..పాపం జగన్నాధుడు శ్రీరామునికి విషయం తెలియ జేశాడు .ఆయన ఆ౦జనేయుడిని పిలిచి సముద్ర తీరం లో ఉంది. సముద్రుడు ము౦చెత్తకుండా కాపలా కాస్తూ ఉ౦డమన్నాడట..రామాజ్న గా భావించి హనుమ కాపలా కాస్తున్నాడు .సముద్రుడు హనుమకు భయపడి జాగ్రత్తగానే వున్నాడు .కొంతకాలానికి హనుమ రాత్రిపూట కాపలా కాయకుండా తనకు ఇష్టమైన లడ్డులు తినటానికి అయోధ్య వెళ్లి తిని పొద్దున్నే వచ్చే వాడు ..ఇది గమనించిన సముద్రుడు మళ్ళీ విజ్రు౦భి౦చి కెరటాలతో అంతా ముంచేశాడు .మళ్ళీ శ్రీ రామునికి నివేదించాడు స్వామి ..రాముడు హనుమను పిలిపించి జిహ్వ చాపల్యంతో విధిని సరిగ్గా నిర్వహించక పోయినందుకు హెచ్చరించి సముద్ర తీరం లో ఎల్లవేళలా నిలిచి ఉండేట్లు చేసి కాళ్ళకు ఇనుప గొలుసులతో బంధింప జేశాడట ..మరి హనుమకు లడ్డులుఅంటే మహా ప్రాణం కనుక రోజూ జగన్నాదునికి లడ్డులు చేయించి చేయించి నైవేద్యం పెట్టె ఏర్పాటు చేశాడట అప్పటినుంచి .. సముద్రం అతి జాగర్తగా వుంది ఏ రకమైన ఇబ్బంది ఆలయానికి ,పూరీకి కల్గించలేదట .పూరి సముద్రపు ఒడ్డున ఇప్పటికి కాళ్ళకు గొలుసులతో వున్న హనుమ దర్శన మిస్తాడు. ఆయన్ను ఇక్కడ ”బేడీ హనుమాన్ ”అంటారు .బేడీలు అంటె. సంకెళ్ళు .జిహ్వాచాపల్యం హనుమకే ఇబ్బంది కలిగించిందంటే మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిపే కధ ఇది .దీనిని శ్రీ శ్రీ ప్రభుదత్త బ్రహ్మ చారి గారు చెప్పారు .