*శ్రీ హనుమ కధామృతము 10*

P Madhav Kumar


🌸🌸🌸🌸🌸🌸

శ్రీ రాముడు మెచ్చిన హనుమ

లంకా పట్టణం లో సీతా సాధ్వి ని దర్శించిన హనుమ సుగ్రీవుని తో వున్న రామ లక్ష్మణులను చేరి తాను సీతా దేవి దర్శనం చేశానని ముందుగా ఒక్క మాట తో చెప్పాడు .ఆ తర్వాత వివరం గా తాను సముద్రాన్ని దాటటం ,దారిలో ఏర్పడిన ఆటంకాలను అధిగమించటం ,లంకిణి అనుమతి తో లంకను ప్రవేశించటం ,రావణుని దురహంకారం ,సీతాదేవి తల్లడిల్లిన విధానం ,ఆడ రాక్షసులు సీతను బాధ పెట్టిన తీరు ,త్రిజటా స్వప్న వృత్తాంతం ,తాను సీతా మాత తో సంభాషించిన తీరు ,ఆమె ఆవేదన ,ఆమె జ్ఞాపకం చేసిన కాకాసుర వృత్తాంతం ,లంకకు తాను చేసిన విధ్వంసం ,ఇంద్రజిత్ బ్రహ్మాస్త్రానికి పట్టుబడిన వైనం ,రావణుని కొలువు చేరి అతనిని హెచ్చరించిన విధం ,రావణుడు తనను చంపాలనుకోన్నప్పుడు మతిమంతుడైన విభీషణుడు రావనుణునికి చేసిన హితోపదేశం ,చివరికి తన తోకను కాల్చమని రావణుడు ఆదేశించటం ,తోకకు రాక్షసులు నిప్పు అంటించటం ,తాను రెచ్చి పోయి ,ఆ అగ్నితోనే లంకా దహనం చేయటం ,అగ్ని హోత్రుడు తనకు అండగా నిలిచి శరీరానికేమీ అగ్ని ప్రమాదం లేకుండా కాపాడటం ,సీతాదేవి ,విభీషణుడు వున్న ప్రదేశాలు తప్ప లంకా అంతా భస్మీ పటలం అవటం ,తాను సముద్ర జలం తో ,తోకను చల్లార్చుకోవటం ,మళ్ళీ సీతా దర్శనం చేసి చూడా మణిని గుర్తు గా పొందటం ,రెండు నెలల గడువు లోపల తనను రక్షించక పొతే తాను దక్కనని రామునికి సీత ఇచ్చిన సందేశం వివరించాడు హనుమ .

సాధారణం గా చాలా ముక్తసరి గా మాట్లాడే శ్రీ రామ చంద్రుడు ,వివశుడై ,సీతా దేవి పొందుతున్న వేదనకు విహ్వలుడై హనుమ చేసిన ఉపకారానికి చలించి ఇలా స్తుతి చేశాడు .”ఆంజనేయా !నీ వల్లనే ఈ కార్యం సఫలం అయింది .ఇంకెవ్వరి వల్ల కాని పని నువ్వు చే సిక్రుతక్రుత్యుడివి అయినావు . .మా రఘు వంశాన్ని నువ్వే ఇప్పుడు రక్షించావు .అందు కోసమే మారుతి గా అవతరించావు అని నాకు అని పిస్తోంది .a సముద్రాన్ని లంఘించటం మామూలు వాళ్లవల్ల ఆయె పని కాదు .ఒక వేళ దాటినా ,మహా భయంకరుడైన దశగ్రీవుని లంకను చేరటం సాధ్యం కాదు .అంతేనా అక్కడి శత్రువు ఆనుపానులన్నీ తెలుసు కో గలిగావు .లంకా దహనం చేసి వాళ్ల గర్వాన్ని ఖర్వం చేశావు .గరుత్మంతుడు ,వాయువు లంకను దాటగాలరేమోకా ఇంతటి స్వామి కార్యాన్ని వాళ్ళు చేయ లేరు .కార్య సాధకులు కాలేరు వాళ్ళిద్దరూ .లంకా లోకి ప్రవేశించటమే ప్రాణాంతక మైన పని .ప్రవేశించి దిగ్విజయం గా తిరిగి వచ్చావు .ఇది రుద్రునికైనా అసాధ్యమైన విషయం .రుద్రవంశ సంభూతుడివి .కనుక నీకు సాధ్యమైంది .ఈ పని నీకే చెల్లింది .నిన్ను కీర్తించటానికి నాకు మాటలు రావటం లేదు ,చాలటమూ లేదు .ఇతరులకు అసాధ్యమైన దానిని సుసాధ్యం చేశావు .నీ బుద్ధి ,ధీ శక్తి ,సాహసం ,ధైర్యం ,వివేకం ,విచక్షణ ,పరిపూర్ణ భక్తీ ,విశ్వాసం ,కార్యం చేయగలను అనే నమ్మకం అహంభావం లేకపోవటం ,అకున్తిత దీక్ష ,కష్ట సహిష్ణుత ,నిన్ను మాహాను భావుడిని చేశాయి .దీనికి నేను ప్రత్యుపకారం గా ఏమీ ఇచ్చుకో లేని స్థితి లో వున్నాను .ఒక్క సారి నిన్ను ఆలింగనం చేసు కోని నా కృతజ్ఞతను నీకు తెలుపు కొంటాను .అంత కంటే నేనేమీ చేయ లేను”అని కీర్తించి హనుమను శ్రీరాముడు గాఢ ఆలింగనం తో తన కృతజ్ఞతను వెల్లడించాడు .హనుమకు అదొక దివ్య అనుభూతి గా అని పించింది .అంతటి మహాను భావుడు ,లోకోద్దారకుడు ,అసహాయ శూరుడు ,రావణ సంహారి తనకు గాఢ ఆశ్లేషణం చేయటం తన పూర్వ జన్మ సుకృతం గా ,మహద్భాగ్యం గా భావించాడు .కృతజ్ఞతతో మారుతి కూడా పులకాన్కురాలతో చలించి పోయాడు .అదొక అనిర్వచనీయ అను భూతి .భగవద్ ,భక్తుల సమ్మేళనం .అసలు భగవంతునికీ ,భక్తునికీ ,భేదం లేదు .ఇద్దరు ఒకరే త్వమేవాహం .అదో అపూర్వ సన్ని వేశం .ఇద్దరు ఇద్దరే .మర్యాదా పురుషోత్తములు .ఎవరి కార్యం వారు నెర వేర్చారు .లోకానికి ఆదర్శం గా నిలి చారు .అందుకే ఇప్పటికీ వారి గుణ గానాన్ని చేసి తరిస్తున్నాం .

ఈ విధం గా శ్రీ హనుమ సీతా రాములకు పునర్జీవనాన్ని కల్పించి మహోపకారం చేశాడు .అందుకే రామాయణం లో మణి పూస అనిపించుకొన్నాడు. తన ఆరాధ్య దైవం శ్రీరాముని కోసం ఎన్నో లోకోపకార కృత్యాలు చేశాడు సంజీవ పర్వతోద్దారి హనుమ .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat