దేవని సుతుడే వాడు దేవదేవుడే వాడు
గ్రామ బహుళ అష్టమి నాడు పుట్టినాడు ఈ పుడమిని బ్రోవగ
1. పుట్టేను కంకుని చేరలో పెరిగెను యశోద వడిలో
బాలకృష్ణుడే గోపాలకుడే నిండేను వనితల గుండెల గుడిలో
దేవని సుతుడే వాడు దేవదేవుడే వాడు
గ్రామ బహుళ అష్టమి నాడు పుట్టినాడు ఈ పుడమిని బ్రోవగ
2. ఊదెను వేణువు వాడు ఊగెరు జగమానాడు
స్వరము స్వరములో విరిసెను గానము
పృధువును చిలికిన వాడు
దేవని సుతుడే వాడు దేవదేవుడే వాడు
గ్రామ బహుళ అష్టమి నాడు పుట్టినాడు ఈ పుడమిని బ్రోవగ
3. అతివలు పొందిన అల్లరి కృష్ణుడు
అసురుల పాలిట నారసింహుడు
గీతాసారము జగతికి పంచిన
జగద్గురువు అతడు జగన్మాథుడు
దేవని సుతుడే వాడు దేవదేవుడే వాడు
గ్రామ బహుళ అష్టమి నాడు పుట్టినాడు ఈ పుడమిని బ్రోవగ