శ్రీ వేంకటేశ్వర వైభవం - 14 🌻శుద్దోదకాభిషేకము🌻

P Madhav Kumar


*🌻1.శ్రీ వేంకటేశ్వర స్వామి వారి నిత్యారాధనము🌻*


*🌻శుద్దోదకాభిషేకము🌻*


🍃🌹తరువాత శ్రీవారికి తిరిగి శుద్దోదకాభిషేకము జరుగును. అష్టోత్తర శతకలశములతో (108) అభి షేకము పూర్తియగుచుండ ఆకాశ గంగా జలపూరితమగు సువర్ణశంఖముతో అభిషేకముచేసి అభి షేకమును పూర్తిచేయుదురు. ఆ అభి షేక తీర్థమును పాత్రమునకు సంగ్రహించి, శ్రీస్వామివారి కైంకర్యముచేయు జన్మాస్త్ర సిద్ధ మహాదృష్టశాలియగు అర్చకుడు తన శిరస్సున ప్రోక్షించుకుని సన్నిధానముననున్న అర్చకుల యొక్కయు జియ్యంగార్ల యొక్కయు ఏకాంగులయొక్కయు ఆచార్యపురుషులయొక్కయు అధికారుల యొక్కయు శిరస్సులయందు “పూతో భవ ' అని ప్రోక్షించును.


🍃🌹పిమ్మట యవనికను (తెర) వేయుదురు. అర్చకుడు స్నాన పీఠ మునుంచి దిగును. చతుర్వేదపారాయణము నిలిచిపోవును. వెంటనే జియ్యంగార్లు అధ్యాపకులు ఆచార్య పురుషులు శ్రీ వైష్ణవస్వాములు ద్రావిడవేదము నీరాట్టం 10 పాశురములను అనుసంధానము చేయు చుందురు.


*🌻ప్లోత విమార్జనము🌻*


🍃🌹అర్చకులు శ్రీస్వామివారి స్నానశాటీని తొలగించి ఫ్లోతవస్త్రము (తడితుడిచెడు వస్త్రము)తో శ్రీవారి శరీరమందంతయు తడి లేకుం డునట్లు తుడిచెదరు. శ్రీవారి శిరస్సునకు (కిరీటమునకు) ఒక పొడి వస్త్రమును రమణీయముగా చుట్టెదరు. జియ్యంగార్లు ఆలవట్టముతో (పట్టువిసరెతో) శ్రీవారికి విసురుచుందురు. అర్చకులు శ్రీవారికి 24 మూరపొడవుగల సరిగపట్టంచు ధోవతిని . అతి రమణీయముగా ధరిం పచేసి అట్టి 12 మూరగల ఉత్తరీయమును పల్లెవాటుగా వేసి, కర్పూర పాత్రమునుండి పచ్చకర్పూరమును, కస్తూరిని తీసుకొని శ్రీవారి తిరు ముఖమండల కాంతులు ప్రకాశించునటుల యథా ప్రమాణముగా సుంద రముగా ఊర్ధ్వపుండ్రమును (నీరుతిరుమణికాపును) సమర్పించెదరు.


🍃🌹దివ్య ప్రబంధానుసంధానము ఆగిపోవును. వెంటనే శ్రీవారికి గో నవనీతం (వెన్న) పంచదార నివేదనముచేసి ముఖవాసము (తాంబూ లము)ను సమర్పించెదరు. అంతట సువర్ణ నీరాజన పాత్రమునందు శ్రీవారికి పచ్చకర్పూరహారతి చేయుచూ తెరను తీయుదురు.


🍃🌹అప్పుడు అభిషేక దర్శన సేవాపరాయణులగు భక్తజనులలో మనోహరమైన ఒక కలకలము బయలుదేరును. అందరు, ఆనందమును ఔత్సుక్యమును మొదలగు భావములను అనుభవించుచూ శ్రీవారి స్వతస్సిద్ధ దివ్య సౌందర్య సన్నివేశావహృతచిత్తులై దేవత్వమును పొందిన వారివలె రెప్పలను వాల్చక తదేక ధ్యానముతో ఉద్రీవులై (మెడలెత్తిన వారలై) శ్రీవారిని దర్శించుచుందురు. అభి షేకము పూర్తియగుటచే జియ్యంగార్లు అధికారులు మొదలనవారు సన్నిధినుంచి దేవాలయ పురోభాగమునకు వెళ్లుదురు.


🍃🌹శ్రీవారి పిమ్మట అర్చకులు, ఇతర అధి కారులయొక్కయు కైంకర్య పరులయొక్కయు అభి షేక కైంకర్యపరులయొక్కయు, అభిషేక దర్శక సేవాపరాయణులయొక్కయు శిరస్సులయందు శ్రీవారి అభి షేకో దకమును ప్రోక్షించుచూ వారలను పునీతులను చేయుచూ ఆర్జితమగు శ్రీవారి అభిషేక దర్శనమును పూర్తిచేయుదురు.


   *🙏ఓం నమో వేంకటేశాయ🙏*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat