శ్రీ హనుమ కధామృతము* 20

P Madhav Kumar


అవతారం అంటే ఏమిటి ?

— సీతా సాధ్వి హనుమకు అవతార తత్త్వం గురించి వివరిస్తోంది .”హనుమా !అవతరణం అంటే క్రిందికి దిగటం .లోకానికి అనుగ్రహం కలిగించటానికి ఒక దేవత కాని ,ముక్త పురుషుడు కాని అవతరిస్తూంటారు .జనుల నిష్కామ కర్మ ల వల్ల అవతారాలు కలుగుతాయి .నిష్కామ కర్మాచరణం అంటే ఏమిటో చెబుతాను విను .భూమి మీద జ్ఞానులు ,ఋషులు ,మునులు ,తాపసులు ,యోగులు ,నిస్సంగులు ,భక్తులు ,సత్పురుషులు మొదలైన వారు స్వార్ధం లేకుండా ,లోక క్షేమం కోసం అభ్యుదయం కోసం సుఖశాంతుల వృద్ధి కోసం ఆ పరమాత్మను ప్రార్దిన్చాతమే .అందరు ఫలాపెక్షతో కర్మ చేస్తే ,వీరు ఫలాపేక్ష లేకుండా చేస్తారు .అదీ తేడా .భగవంతుడిని భౌతిక వాంచల కోసం దగ్గరకు వెళ్ళ రాదు .సర్వలోక హితమే ధ్యేయం గా చేరితే అదిలోకోపకారం అవుతుంది .మనిషికి కావలసిన వన్నీ భగవంతుడు సృష్టిస్తూనే వున్నాడు .కనుక వీటికోసం ప్రార్దిన్చనక్కర లేదు .ఈతి బాధలు వుంటే తానే పరిష్కరించుకోవాలి .సమస్యలను మనిషే సృష్టించు కోని ,భగవంతున్ని పరిష్కరించ మనటం న్యాయం కాదు .


” నిష్కామ కర్మమే యజ్ఞం అంది వేదం .యజ్ఞం అంటే పరిపూర్ణ త్యాగం .సృష్టి ,మానవునికి త్యాగ గుణాన్ని బోధిస్తోంది .జ్ఞాని దాన్ని తెలుసుకొని ముక్తుడు అవుతున్నాడు .అజ్ఞాని ప్రకృతి మాయలో పడి బందితుదవుతున్నాడు .ఈ సృష్టిలో నాలుగు రకాలయిన జీవులున్నాయి .ఉద్బిజములు ,స్వేదజములు ,అండజములు ,జరాయుజములు .అవి ఒక దాని కంటే ఇంకోటి ఉత్తమంగా వుంటాయి .కొండలు జడ ప్రాయం గా భావిస్తారు .వాటికి ప్రాణం వుంది ,అయితే ఆ ప్రాణం సుషుప్తి అవస్థ లో వుంది .

వాటిలోని ప్రాణాన్ని ఆశ్రయించుకొని వాటిపై అడవి పెరుగుతుంది .దాన్ని ఆశ్రయించుకొని పశు పక్ష్యాదులు జీవిస్తాయి .ప్రాణ వికాసమ్ ఊర్ధ్వ గతి లోనే వుంటుంది .ప్రాణం ,పరమాత్మను చేరుకొనే గతిలో ,క్రింది తరగతి సృష్టి ,పైతరగతి సృష్టి కోసం ఎప్పుడు ఆహుతి అవుతూనే వుంటుంది .ఇదే యజ్ఞం .ఇది నిరంతరం జరుగు తూనే వుంటుంది .ఇదే స్థితి కారకుడైన విష్ణు కధల యొక్క అంతారార్ధం .

”శుద్ధ సత్వ రూపుడైన సత్య పురుషుని నుంచి వ్యక్తమైన ఈ సృష్టి ,తమోగుణ ,రాజోగుణాలను వదిలించుకొని ,శుద్ధ సత్వాన్ని సంతరించు కోవటం తో సృష్టి చక్రం పూర్తి అవుతుంది .ఈ తమో గుణ ,రజోగుణ ఆధిక్యం గల సృష్టి అంతా సత్వ గుణ రూపుడైన పరమేశ్వరుని ముందు ఆహుతి కావాల్సిందే .ధర్మం జయించి ,అధర్మం నాశనం అవుతుంది .ఎంత తపస్సు చేసినా ,ఎన్ని వరాలు పొందినా రావణాసురుడు , శుద్ధ సత్వ సంపన్నుడైన రాముని చేతిలో ఓడిపోయాడు .అదే విధి వాక్యం అంటే .జీవులు అంతా ఏదో ఒక నాటికి ముక్తులు కావలసిందే .కనుక మానవులు నిష్కామ కర్మ తో ,సత్వ గుణాన్ని పొంది ప్రకృతి యజ్ఞాన్ని చేస్తూ ,అందులో భాగస్వాములై శాంతి సౌభాగ్యాలతో జరా,మ్రుత్యువులను జయించి ,జీవన్ముక్తులు కావాలి .”అని చాలా వివరం గా హనుమకు అవతార రహస్యాన్ని వివరించింది సీతాదేవి .ఆ తర్వాత తమ అవతార రహశ్యాన్ని తెలియ జేశింది .

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat