దేవతొచ్చినాదిరో చూడరో చూడరా
దుర్గమ్మ తల్లిరో, వచ్చెరో వచ్చెరా
ఓయమ్మా - హొయ్, మాయమ్మా - హొయ్, మాకోసమే వచ్చెనమ్మా
1. ముక్కోటి శక్తులను ముందుగానే కొలిచాము
నీవే మా తల్లివని ఇపుడు తెలుసుకున్నాము
మనసంతా-హొయ్, విప్పేసి-హొయ్, బాధలన్నీ చెప్పేద్దాం
అమ్మలకు అమ్మవే - ఆది పరాశక్తివే
విజయవాడ పురమునందు వెలసినా తల్లివే ॥దేవతొచ్చినాదిరో॥
2. వేపాకు తోరణాల పందిళ్ళే వేసినాము
పులిహోర పొంగళ్లు నైవేధ్యం పెట్టినాము
పాదాలే - హొయ్, కడిగాము- హొయ్, నీ పూజలే చేసాము
అమ్మలకు అమ్మవే - ఆది పరాశక్తివే
విజయవాడ పురమునందు వెలసినా తల్లివే ॥దేవతొచ్చినాదిరో॥
3. రంగు రంగు పూలుతెచ్చి హారాలే వేసినాము
పసుపు కుంకుమతో పూజలే చేసినాము
నిమ్మకాయలు కట్టేము నీ నామం మొక్కేము
కంచీ కామాక్షివే, మధుర మీనాక్షివే
విజయవాడ పురమునందు వెలసినా తల్లివే ॥దేవతొచ్చినాదిరో॥
4. పగలంతా పనిచేసి అలసిపోయి ఉన్నాము
సంధ్యవేళ కాగానే నీ భజనలు చేసేము
పాదాలే-హొయ్, కడిగాము- హొయ్, నీ పూజలే చేసాము
కంచీ కామాక్షివే, మధుర మీనాక్షివే
బెజవాడ పురమునందు దుర్గా భవానీవే ॥దేవతొచ్చినాదిరో॥