శ్రీ మహాశాస్తా చరితం - 12 మోహినీ భస్మాసురుడు

P Madhav Kumar

🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️

*మోహినీ భస్మాసురుడు*

☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️

*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి  (ABADPS)*

*'ఈశానుడ'ను* రాక్షస రాజునకు పుత్రునిగా జన్మించినవాడు *'శ్రీపద్మ'* నామధేయుడు. చిన్ననాటినుండియూ , అతడు తమ దానవ కులజులు ఎంత బలవంతులైనప్పటికీ ఏదో విధముగా దేవతలచే చంపబడుచుండుట చూచినవాడై , వారిపై కోపము పూనివాడై , మాయోపాయము ఏదైననూ చేసి , ముల్లోకములను తన వశము చేసికొననెంచెను. త్రిమూర్తులలో క్షిప్ర ప్రసాదియూ , భోళాశంకరుడూ అయిన పరమేశ్వరుని గూర్చి తపస్సు చేయగా , మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై వరమును కోరుకొమ్మనెను. తాను అడుగబోవు వరము ఎట్లుండవలెనో ముందుగానే అతడు ప్రణాళిక వేసుకొని యుండెను. ఆ ప్రకారముగానే తనకు ఎవరి వలననూ మరణము సంభవించనటులుగానూ , తాను ఎవరి తలపై
చేయి వేసిననూ వారు భస్మమగునట్లుగానూ , వరము నడిగెను. పరమశివుడు అట్లే యనెను.

వెనువెంటనే , ఇచ్చిన వరమును ప్రయోగింపనెంచిన రాక్షసుడు పరమశివుని తలపైననే చేయి వేయుటకు ఉపక్రమించెను.

తన రుద్ర తాండవము ద్వారా ముల్లోకములను సంహరించు , రుద్రమూర్తి అయిన పరమశివుని
సంహరించుట ఎవరి తరము ? రాక్షసుడు చేసినది జరుగనిచో , తానిచ్చిన వరము తప్పు అగును. నిష్ప్రయోజనము అగును కదా అని తలచిన పరమశివుడు దాన్ని నివారింపనెంచి , ఒక ఉపాయమును
ఆలోచించెను. తాను సృష్టించిన సత్యధర్మములకు తాను సైతము కట్టుబడి యుండుటయే ధర్మముగా
భావించెను. ఒక మంచి సందర్భమునకై అదను చూచుచూ ఒక స్వర్ణగన్నేరు కాయలో దాగియుండెను. ఈశ్వరుడు కనుమరుగు అగుట చూచిన రాక్షసుడు , తనను చూచి పరమశివుడు పారిపోవుచ్నుట్లుగా భావించి అతడికై వెదుకసాగెను.

అంతలో మోహిని రూపధారి అతడి ఎదుట ప్రత్యక్షమాయెను. మోహిని సౌందర్యమునకు
మైమరచిపోయిన అసురుడు శివుని వెదకుటయూ మరచిన వాడయ్యెను. మోహిని పట్ల ఆకర్షితుడైన
అతడు తాను పొందిన వరములను గూర్చి గొప్పగా చెప్ప సాగెను.

ఈ సందర్భము కొరకే వేచియున్న మోహిని అతడితో  *"ఓ రాక్షసరాజా ! ఒక మంత్రమును నేర్చినంత మాత్రమున సరిపోదు. దానికి ఋషి , ఛందస్సు చెప్పి అంగన్యాస , కరన్యాసములు చేయవలెను. అది చేయని మంత్రము నిష్ప్రయోజనము. ఆ పద్ధతి నీకు తెలిసినట్లుగా లేదు. అయిననూ నీవు చెప్పినదంతయూ నిజమని నమ్మజాలను”* అని కించపరచగా , రోష పూరితుడైన శ్రీపద్ముడు కేవలము ఒక ఆడది తనను హేళన చేయుటయూ అను కోపములో మందబుద్ధి
అనుచూ తన తలపై
కలవాడై , అంగన్యాసము ముగించి , కరన్యాసము చేయబోగా ,  *'శిరసే స్వాహా , చేయిపెట్టగా , పరమశివుని వరఫలితముగా భస్మీభూతుడాయెను. అతడి మరణమునకు అతడే కారణభూతుడైనాడు. ఎవరివలననూ అతడి మరణము సంభవించలేదు.

భస్మీ భూతుడైన అతడు భస్మాసురునిగా పిలువబడినాడు. రాక్షస మరణానంతరము , స్వర్ణగన్నేరు
కాయలో  దాగియున్న పరమశివుడు బయటకు వచ్చి మోహిని రూపధారి అయిన విష్ణువును
పలువిధముల స్తుతించెను. ఆ సమయమున మోహినిపట్ల ఆకర్షితుడైన పరమశివుడు మోహావేశము ఉప్పొంగగా ఆమెను ఆలింగనము చేసికొనెను. వారి సంగమ ఫలితముగా , లోకోద్ధరణ గావించుటకై *భూతనాధుడు అవతరించెను.*

*దృష్ట్యామాయా స్వరూపం శివహృదయహరం , భస్మదైత్యేనశత్రుం*
*విష్ణుం దేవో మహేశో మధన పరవశాత్ తాప సంభోగ మస్మార్థ*
*జాతం లోకోపకారే హరి హర తనయం , ధన్వినం బాణహస్తం*
*వందే భూతాదినాధం సకల రిపుహరం సూర్యకోటి ప్రకాశం.*

అసురుని సంహరించిన మోహిని వేషధారియైన మహావిష్ణువు పట్ల ఆకర్షితుడైన పరమేశ్వరుడు,
ఆమెతో సంగమించగా , అఖిల జగత్తునకు మేలుచేయగోరి , హరిహరసుతునిగా శాస్తా జనియించెను. కోటి సూర్యప్రభలతో వెలుగొందుచూ , పగవారిని వధించుటకై చేత బాణములు , విల్లు ధరించి వెలుగొందు భూతనాధునికి చేయెత్తి నమస్కరించుచున్నాను.

పరంజ్యోతి స్వరూపుడైన శాస్తా లీలలు మానవమాత్రుల ఊహకందనివి. మహాశాస్తా యొక్క అవతార మహిమలను మూడు చరితములు మడు విధములుగా వివరించుచున్నవి. అవి

1. అమృతమధనమోహిని

2. శాస్తు ఉద్భవము

3.లలితోపాఖ్యానము.

భస్మాసురవధ అనంతరము , శాస్తా ఉద్భవించిన తీరును వర్ణించునది పాద్మము.
శైవమహాపురాణము.

దారుకావన సందర్భమున జరిగిన శాస్తా జననమును తెలియజేయునది శ్యుతపురాణము అను
వళువూర్ మహాత్మ్యము. *'కాడంతేత్తి మహాశాస్తా 'పురాణము'* వంటి గ్రంధముల ఆధారముగా
తెలియును.

ఈ వేరుపాట్లకు కారణము , ఇవన్నియూ వేర్వేరు కల్పములందు జరిగినవి. పురాణములను
రచించు మహా ఋషులు , భవిష్యత్తున జరుగబోవు వాటిని తమ దివ్య దృష్టితో చూచువారు గావున ,
ఒక్కొక్కరికీ ఒక్కొక్క కల్పమున గోచరించియుండవచ్చును. వాటినే వారు వ్రాతపూర్వకముగా రచించి యుండవచ్చును. అంతమాత్రమున అవన్నీ నిజముకాదు అనుట సరికాదు.

పరబ్రహ్మస్వరూపుడైన మహాశాస్తా , ఒక్కొక్క కల్పమున ఒక్కొక్క విధముగా హరిహర పుత్రునిగా అవతరించెను.

మహాగణపతి యొక్క అవతార విశేషములు , సుబ్రహ్మణ్యస్వామి యొక్క అవతార విశేషములు తెలియజేయు గాధలు , రెండు మూడు విధములుగా కనబడుటకు కూడా , ఇదియే కారణమై
యుండవచ్చును.



*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*

*శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణువే*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat