*మహాశాస్తా పూజా విధాన పూర్వాపరములు*
☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️
*అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార సమితి (ABADPS)*
ఆ దైవం యొక్క గొప్పతనం ఎవరికెరుక ? ఎవరికి తెలియును అతడి పూర్వాపరములు !
ఎవరెరుగుదురు ఊరూ , పేరూ తెలియని ఆ జ్ఞానదీపపు ఉనికిని ?
మన హిందూ మతము అతి పురాతనమైనది. దీని ప్రారంభకులు ఎవరో తెలియదు. దీని
ఆగమున కాలము గురించిన ఉనికి కూడా ఎవరికీ తెలియదు. ప్రపంచం ప్రారంభం మొదలు , ఈనాటి వరకూ మన వెన్నంటే యున్నది. మనదైన మన సనాతన ధర్మము.
మన హిందూ మతమున కనిపించు అనేక రూపములుగల దేవతలను గురించి అన్యమతస్థులు
హేళన చేయుట మనము ఎరిగినదే.
*“రూపములు వేరైననూ దైవము ఒక్కడే”*
పరంజ్యోతి స్వరూపుడైన దైవం ఒక్కడే అయిననూ , వేరు వేరు రూపములతో ప్రపంచమును సృష్టించెను. రకరకములైన మనోభావము గల మానవులను ఉద్ధరింపగోరి , అనేక రూపములుగా
ఆవిర్భవించి , మానవ మనుగడను రక్షించుచూ , తన వైపుకు ఆకర్షించుకొనుచున్నాడు.
ఆ విధముగా పరంజ్యోతి యొక్క పలువిధములైన అవతారములలో ఒకటియే కరుణామయ
మూర్తిగా ఆవిర్భవించిన మహాశాస్తాయను అవతారము. ప్రత్యక్ష దైవమైన శాస్తా యొక్క పూజా విధానము పురాతన కాలము నుండియే కానవచ్చుచున్నది.
నేటి ఆధునికులు కొందరు , శాస్తా యొక్క పూజా విధానము ఈ మధ్యకాలమున పుట్టి , ప్రసిద్ధి చెందినదని , మరికొందరు బౌద్ధమతము నుండి హిందూ మతములోనికి రూపాంతరము చెందినదే
యనియూ , ఇంకా మరికొందరు అయ్యప్ప పేరు ఏ పురాణములోనూ చెప్పబడలేదు. కాలక్రమంలో హిందూమతమునకు చేర్చబడినదేననియూ అందురు. వేదమయమైన సనాతన ధర్మంలో అయ్యప్పకు
చోటు లేదనియూ అందురు. మరికొందరు తమిళ గ్రామ సంప్రదాయములో గ్రామదేవతగా పేరు
పొందిన *'అయ్యనార్'ను* దేవతల కోవలో చేర్చుట సమ్మతము కాదు అందురు. శాస్తా యొక్క
సంప్రదాయమును గూర్చి తెలుసుకొనెదము.
*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*
*శ్రీ ధర్మశాస్తావే శరణం అయ్యప్ప*