శ్రీ లలితా హారతి పాట - Sri Lalitha Haarathi Song - Telugu

P Madhav Kumar


శ్రీ లలితా శివజ్యోతి సర్వకామదా శ్రీగిరి

నిలయ నిరామయా సర్వమంగళా ||శ్రీ లలితా||


జగముల చిరునగవుల పరిపాలించే జననీ

అనయము మము కనికరమున కాపాడే జననీ

మనసే నీ వశమై స్మరణే జీవణమై

మాయని వరమీయవే పరమేశ్వరి మంగళ నాయకి ||శ్రీ లలితా||


అందరికన్నా చక్కని తల్లికి సూర్య హారతీ

అందాలేలే చల్లని తల్లికి చంద్ర హారతీ

రవ్వల తళకుల కలకల లాడే కర్పూర హారతీ

సకల నిగమ వినుత చరణ శాశ్వత మంగళ హారతీ ||శ్రీ లలితా||


లోకాలేలే చల్లని తల్లికి చంద్ర హారతీ

రవ్వల తళకుల కళాజ్యోతుల కర్పూర హారతీ ||శ్రీ లలితా|| 

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat