దీపావళి రాత్రి లక్ష్మీదేవి మంత్రం.....!!*

P Madhav Kumar


🌸దీపావళి రాత్రి లక్ష్మీదేవి ప్రసన్నత కోసం ఒక ప్రత్యేక మంత్రం ఉంది. ఈ మంత్రం యొక్క లాభం  భగవంతుడైనరాముని గురుదేవుడు వశిష్ఠుడు కూడా పొందారు. ఈ మంత్రం యొక్క ప్రభావంతో శ్రీ కృష్ణుడు.. నేను బంగారు ద్వారకను చేసాను అని అన్నాడు.


🌿రావణుడు చెప్పాడు, నేను ఈ మంత్రంతో బంగారు లంక తయారీలో విజయం సాధించాను అని. ఈ రాత్రి ఈ మంత్రాన్ని ఉపయోగించే వారికి సాఫల్యతలో శీఘ్రంగా సహాయం అందుతుంది. 


🌸లక్ష్మి ఒంటరిగా వస్తే మనిషి మూర్ఖుడు ( గుడ్లగూబ ) అవుతాడు., కానీ దివ్య మంత్రము మరియు భగవద్ ఆశ్రయం ద్వారా లక్ష్మీదేవి వస్తే ఆవిడ కమలవాషిని అవుతుంది. ఈ మంత్రం ఎవరైనా రాయదలుచుకుంటే ,   జపించాలంటే ఈ మంత్రంతోనే కుబేర బండారి సంపదలు వైభవము టంకశాల

పొందాడు.


🌿విశ్వామిత్రుడు ఈ మంత్రం ద్వారా సంపదను చేజిక్కించుకున్నారు. శ్రీ కృష్ణుడు కూడ ప్రత్యేకంగా ఈ మంత్రం గురించి చెబుతారు., విశ్వామిత్రుడు కూడా చెబుతాడు, వశిష్ఠుడు, కుబేర్ భండారి, రావణుడు మొదలైనవారు కూడా ఈ మంత్రం యొక్క మహిమను గ్రంధాలలో కొనియాడారు. 


🌸ప్రత్యేకమైన ధైర్యం సాహసం ఉన్నవారు మరియు లక్ష్మిని సరిగ్గా ఉపయోగించుకునే శక్తి ఉన్నవారికి, ఈ మంత్రం కుబేరుడవ్వటానికి, కుబేరు భండారీగా మారడానికి వారి సామర్థ్యాలను పెంచుతుంది. ఇది దేవీ భాగవతంలో వ్రాయబడిన మంత్రం: 


  "*ఓం శ్రీం  హ్రీం క్లీం ఐం* *కమలవాసిన్యై స్వాహా."*


🌸ఇందులో ఐదు బీజ మంత్రాలు ఉన్నాయి. ఓం తనలో తాను పూర్ణమైన బీజ మంత్రం, అయితే శ్రీం కూడా పూర్ణమైన బీజ మంత్రం, హ్రీం కూడా బీజ మంత్రం, క్లీం మరియు ఐం ఎలాగైతే సారస్వత్య మంత్రంలో రెండు బీజ మంత్రాలు ఓం, ఐం ఉన్నాయో అవి పిల్లల జీవితంలో గొప్ప విద్యా శక్తిని వికసింప చేస్తాయి.


🌿*అలాగే లక్ష్మీ ప్రాప్తి కావలసినవారు ఈ మంత్రాన్ని  జపమాల చేసుకోగలరు.

*ఓం శ్రీం హ్రీం క్లీం ఐం కమలవాసిన్యై స్వాహా..స్వస్తి..*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
Follow Me Chat