జై జై జై గణేశ జయమునివ్వు గణేశ
మా బొజ్జ గణపయ్యవే... మమ్మేలగ రావేమయ్య
||జై జై జై గణేశ ||
కాణిపాకములో బావిలోన వెలిసావే - కాపాడగ రావ వరసిద్ది వినాయక
కాపాడగ రావా వరసిద్ది వినాయక ||కోరస్||
శ్రీశైల కొండల్లో సాక్షి గణపతి నీవే సాక్షం చెప్పంగ రావయ్య వినాయక
సాక్షం చెప్పంగా రావయ్య వినాయక ||కోరస్||
|| జై జై జై గణేశ ||
గంగమ్మ గౌరమ్మ గారాల పట్టి నీవే ముల్లోకాలలోన మొదటి పూజ నీకయ్య
ముల్లోకాలలోన మొదటి పూజ నీకయ్య ||కోరస్||
ఎలుక వాహనుడ ఏకదంత రూపుడ వేగ రావయ్య మా బుజ్జి గణపయ్య
వేగ రావయ్య మా బుజ్జి గణపయ్య ||కోరస్||
||జై జై జై గణేశ ||
భాద్రపద మాసాన చవితి నాడు పూజ నీకు పత్రిపూజలు పాయసాలు నీకయ్య
పత్రిపూజలు పాయసాలు నీకయ్య ||కోరస్||
సిధ్ధిని బుధ్ధినేమో ప్రసాదించు దేవుడవే విఘ్నాలు తొలగించ రావయ్య విఘ్నేశ
విఘ్నాలు తొలగించ రావయ్య విఘ్నేశ ||కోరస్||
|| జై జై జై గణేశ॥
శివపార్వతీ తనయ ఓ విఘ్న వినాయక - శబరి కొండల్లో కన్నెమూల గణపయ్య
శబరి కొండల్లో కన్నెమూల గణపయ్య ||కోరస్||
అష్ట రూపాల్లో కొలువైన మా దేవ - ఆది వినాయక ఆదుకొనగ రావయ్య
ఆది వినాయక ఆదుకొనగ రావయ్య. ||కోరస్||
||జై జై జై గణేశ॥
ఈ పాట ను ఎలా పాడాలో ఇక్కడ టచ్ చేసి చూడండి.
లిరిక్స్ పంపినవారు:
*వై. వెంకటసుబ్బారెడ్డి స్వామి*