స్వామి కొలువైయుండు ముఖ్యమైన కొన్ని ఆలయాలు - 2
**ధృపయార్*
*'కాంచితిని సీతాదేవిని'* అని వనవాసస్థలముననున్న శ్రీరామునితో హనుమ తెలిపిన స్థలమిది.శ్రీరామునికి ప్రధాన
ఆదియందు ఈ స్థలము స్వామికి చెందినదిగానే ఉండిననూ , స్వామి , శ్రీరామునికి దైవముగా ఈ స్థలమును ఇచ్చివేయుటచేత ఇందు శ్రీరామునికి కూడా పూజలు జరుపబడును.
ఈ స్థలమున శాస్తా సుందర రూపము బూని , బాలుని రూపము ధరించినవాడై , చేతియందు అమృత
కలశమును , గరిటెను కలిగియుండును.
*పాక్కిల్*
ఒకసారి , లోకోద్ధరణ గావించుటకై చతుర్ముఖుడైన బ్రహ్మ ఒక యాగమును చేబట్టెను. యాగ ఫలితముగా , యజ్ఞగుండము నుండి అందమైన విగ్రహము ఆవిర్భవించినది. లోకులను కాపాడునిమిత్తమై జనియించిన ఆ విగ్రహమును బ్రహ్మదేవుని వద్ద నుండి పరశురాముడు గైకొని తన
దేశమునందు ఆలయము నిర్మించగోరి ధ్యానించెను.
నారాయణుని అంశను పొందిన భార్గవుడు పెరియార్ సహాయముతో ఈ ఆలయమునందు
ప్రతిష్టించెను. అందుచేత పాక్కిల్ అని ప్రసిద్ధి చెందినది.
*పాండవం*
కౌరవుల యొక్క దురాలోచన చేత కాననములకేగిన పాండవులు , తమ వనవాస కాలమునందుతమను కాపాడుమని పూజించిన స్థలము. *'కొట్టాయం'* నగరమునకు సమీపమున గల *'కుడుయాంబాడి'*
అను ఊరియందు అమరియున్న ఈ ఆలయము 1500 ఏండ్లకు ముందటిది.
ఒకప్పుడు , వయోధికభారము చేత శబరిమలకు వచ్చి స్వామిని దర్శించుకొనలేని తెక్కంగూర్ మహారాజు స్వప్నమునందు స్వామి ఇచ్చిన ఆనతి ప్రకారము , పాండవులచేత పూజింపబడిన స్వామి
విగ్రహము లభ్యమై , ఆలయము నిర్మించబడినది. మరి ఎక్కడునూ కానరాని విధంగా స్వామి పూర్ణా
పుష్కలాసమేతుడై , దేవేరులను తన తొడపై ఉంచుకొనునట్లుగా దర్శనమిచ్చును.
*బ్రహ్మశాస్తా*
సభాపతియై పరమశివుడు నటనమాడు క్షేత్రము చిదంబరము , పంచభూత స్థలములలో ఆకాశ తత్వమును పొందియున్న స్థలము. శివాలయములు అనగానే ముందుగా స్ఫురించునది చిదంబరము. కైలాసమునకు సాటియైనది. ఈ స్థలమునందు బ్రహ్మదేవుని కోరిక మేరకు మహాశాస్తా ఎనిమిదిరూపములను పొంది , చిదంబరమునందు ఎనిమిది దిక్కులకూ కావలి దైవముగా నిలిచియున్నాడు.
*తదాక్షీ తిల్లెగాంధారే పెతరాం భావనానిచ*
*అషైన క్షేత్రాణి సంత్యత్ర తేష్వాకం క్షేత్రముత్తమం.*
(చిదంబర రహస్యం)
ఈ ఎనిమిది రూపములతో *'తిరుక్కాళింజి'* అను కొలనుకు సమీపముగా అమరియున్న బ్రహ్మశాస్తాను దర్శించుట మిక్కిలి విశేషము. బ్రహ్మదేవుని కోరికపై తన పరివార గణములచేత
పరివేష్టింపబడి యుండుటచే *బ్రహ్మశాస్తా* అనియూ , ఆకాశ క్షేత్రముగా పిలువబడుటచే , చిదంబరము
నందు , రూపములేని ఆకాశతత్వముగా కొలువై యుండుట వలన *'ఆకాశశాస్తా'* అనియూ
పిలువబడుచున్నాడు.
*సొరిముత్తయ్యనార్ కోవెల*
భూత , బేతాళ , యక్షులు సేవించుచుండగా , పూర్ణా పుష్కలా సమేతునిగా స్వామి కొలువైయున్నస్థలము. ఈశ్వరుని కల్యాణోత్సవమునకుగాను, దక్షిణదిశగా పయనమై వచ్చిన అగస్త్యునికి , తన
పరివార గణములతో సహా స్వామి అనుగ్రహించిన స్థలము. చాలాకాలము అజ్ఞానతముననుండి ,
తనను తాను బహిరంగ పరచుకొనిన స్థలము. స్వామి యొక్క మూలాధార స్థలముగా భావింతురు.
*'ముత్తయన్ పంచక'* ము నందు పై విధముగా వివరించబడి యున్నది.
*కాడత్తి*
జాప్యేశ్వరము అనియూ , అవి ముక్తి క్షేత్రమనియూ , ఆదినాధపురి అనియూ పలు పేర్లతో ప్రసిద్ధిచెందిన క్షేత్రము. బ్రహ్మాది దేవతలు స్వామిని పూజించిన స్థలము. మహాశాస్తా నిత్యకల్యాణ
సుందరునిగానూ , అయ్యనారుగాను కొలువైయుండి అనేక లీలావినోదములు సలిపిన స్థలము.
మారేడు దళములైన బిల్వవృక్షము క్రింద స్వయంభువునిగా స్వామిని , సత్యపూర్ణమహర్షి
దర్శించిన క్షేత్రము. కాడాసురుడు అను రాక్షస రాజును స్వామి దండించి , వానిని మనిషిగా మార్చిన
స్థలమగుటచే *కాడా తిరుత్తి - కాడన్ తేత్తి* అనబడుచున్నది. తిరుత్తి అనగా తమిళమునందు సరిదిద్దబడిన అని అర్థము.
వేదారణ్యమునకు చెందిన తిరుత్తరైపూండికి సమీపమునగల జ్ఞాయిరు అగ్రహారము నందు
వెలసియున్నది. ఈ అద్భుతపుణ్యక్షేత్రము.
*వళువూర్*
ప్రసిద్ధి చెందిన శివాలయములలో నొకటి ఈ వళువూర్ అనునది. కర్మాను సారమే అంతయునూ జరుగదగునని మొండిగా వాదించుచున్న తారుకావనమునకు చెందిన మునులను , తాము మాత్రమేశీలవంతులమని విర్రవీగుచున్న వారి పత్నులను సరిదిద్దుటకై , ఈశ్వరుడు భిక్షువుగానూ , మహావిష్ణువు
మోహినిగానూ రూపుదాల్చి , వారిని అనుగ్రహించిన స్థలము.
*కూత్తూర్శాస్తా*
తిరువయ్యారు నుండి తిరుక్కాట్టుపళ్ళికి పోవు మార్గమున అమరియున్నది కూత్తూర్ అయ్యనార్ ఆలయము.కేరళదేశమునుండి కొందరు వ్యాపారులచే తీసుకొని రాబడిన ఒక విగ్రహము నందు దాగియున్న
స్వామి , ఈ స్థలమునందున్న వినాయకుని ఆలయమునందలి గర్భగృహమునందే శిలారూపమై , వెవరూ
కదల్చలేని విధముగా కొలువైయున్నాడు.
ఆలయ గర్భగృహము నందు స్వామి పూర్ణా పుష్కలా సమేతునిగా ఉండగా , పక్కనే వినాయకుడు
కొలువైయున్నాడు.
