అయ్యప్ప సర్వస్వం - 119 | వర్షమును నిలిపిన రాజు | Ayyappa Sarvaswam
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

అయ్యప్ప సర్వస్వం - 119 | వర్షమును నిలిపిన రాజు | Ayyappa Sarvaswam

P Madhav Kumar

వర్షమును నిలిపిన రాజు*


సుందరదేశము అను పేరుగాంచిన కేరళదేశమున పరశురాములచే మాంత్రికమునకని అనుగ్రహించబడిన వంశములో *"కల్లూర్ నంబూద్రి"* కుటుంబము యొకటగును. అంతటి గొప్ప వంశమున శ్రీమహాశాస్తావారిపట్ల అతీతమైన భక్తి ప్రపత్తులు కలిగియుండిన కల్లూర్ నంబూద్రియను భక్తశిఖామణి జీవించు చుండెను. అతడు *"భారత పుయ"* అను నదిమధ్యమున స్వయంభువై ఆవిర్భవించిన శాస్తావారి ఉపాసకులై యుండెను. వారు పిలిస్తే శ్రీస్వామివారు *"ఏమయ్యా ! కల్లూర్ నంబూద్రి యని మారుపలికే అంత శాస్తావారిపట్ల ఉన్నతమైన భక్తినిండినవారగును.


వేదశాస్త్రఅనుష్ఠాన ఆచారములనుండి కించిత్తుకూడా తేడాలేక వాటిని చక్కగా అనుష్ఠిస్తూ జీవించుచుండిన నంబూద్రి తన నిత్య నైమిత్యకర్మానుష్ఠానములతోపాటు శ్రీ శాస్తావారి పూజలను కూడా అమిత శ్రద్ధాభక్తులతో చేయడంతోపాటు , తన శిష్యులనేకులకు కూడా శ్రీ శాస్తా ఆరాధనలోని విశిష్టతలను చెప్పి వారలనుకూడా శ్రీశాస్తా ఉపాసకులుగావించే ప్రయత్నము చేయుచుండెను.


ఒక పర్యాయము నంబూద్రిగారి తండ్రియొక్క శ్రాద్ధము వచ్చినది. మిక్కిలి శ్రద్ధతో చేయవలసినదే శ్రాద్ధము. ప్రితృయజ్ఞ ఫలప్రధాతగా అందులకుగూడ సత్ ఫలితములను ప్రసాదించేది శ్రీమహాశాస్తా వారేగదా ? కనుక కేరళ ఆచార ప్రకారము క్రమముగా శ్రార్ధము చేయనెంచిన నంబూద్రి తన ఇంటిముంగిట ప్రత్యేకముగా కొబ్బరాకులతో యొక పందిరి వేయించెను. కాని అది వర్షాకాలం కావడంవల్లన ఎడతెగని వర్షము కురుయువేళ ఈ పందిరి నిలబడునా యని అందరికీ అనుమానము చెలరేగినది. శ్రాద్ధకర్మలు జరుగువేళ వేరే ఇతర ధ్యాసలు ఉండకూడదంటారు. శ్రాద్ధము జరుగువేళ వర్షము కురిసినచో ఆ పందిరి పడిపోతే శ్రాద్ధకర్మలు ఆగిపోతుంది.


అప్పుడు నంబూద్రి ఏమిచేయగలడు యని పలురీత్యా మాటలాడుకొనసాగిరి. శ్రాద్ధదినము - ఆ సమయము రాగానే వర్షముకూడా నేను వస్తున్నానంటూ ఉరుములు మెరుపులు కనపడసాగెను. చినుకులై మొదలిడిన వర్షము పెనువర్షముగా కురియపోవుటను అందరూ గ్రహించిరి. అందరి మనస్సులోనూ ఆలోచనే. కాని తన మనస్సులోని బాధలు ఎట్టిదైయుండిననూ తన ఇష్టదైవమైన శ్రీశాస్తావారితో మొరలిడే ఆ భక్తుడు ఇప్పుడుకూడా శ్రీశాస్తావారితో మొరలిడితే వర్షము ఆగిపోతుందని దృఢముగా విశ్వసించెను. కావున కరములు జోడ్చి ఆకాశము వైపుచూసి , తన ఇష్టదైవమగు శ్రీశాస్తావారితో ఇప్పుడు కాసేపు (తండ్రిగారి శ్రాద్ధము ముగియువరకు) ఈ వర్షమును నిలిపివేయ వలసినదిగా ప్రార్థించుకొని పది శ్లోకములను లిఖించెను. తన ఇష్టదైవం కోయిల గొనియుండు ఆలయమును చూసి *"శమ్రవట్టం శాస్తా"* అని ఆ తాళప్రతముపై చిరునామా వ్రాసి , సమీపమున ప్రవహించుచుండిన భారతపుయ యను నదిలో దాన్ని పడవేసెను.


తన భక్తుని మొరను శ్రీ శాస్తావారు ఆలకించక యుండునా ? ఆ తాళపత్రము తేలుతూ సరిగ్గా ఆ నది నడిభాగమున యుండిన శ్రీ శాస్తావారి ఆలయపు వాకిటిని తాకి నిలబడిపోయెను. అదే క్షణము ఆశ్చర్యమా అన్నట్లు వర్షము నిలబడి పోయినది. నంబూద్రిగారి ఇంటి శ్రాద్ధము చాలా చక్కగా , క్రమబద్ధముగా జరిగినది. ఎట్టి అటంకము వాటిల్ల పితృరూపములో వచ్చిన బ్రాహ్మణులు భోజనంచేసి సంతృప్తిగా వెళ్లిపోయిరి. ఈ వార్త అందరినోట పలికి నంబూద్రిగారి స్వామిభక్తి మరింతగా కొనియాడ బడెను. *అయ్యప్పస్వామివారి ఆజ్ఞకు కట్టుబడి శ్రాద్ధముముగియుదాక ఆగియుండిన వర్షము తదుపరి రెండురోజులు ఎడతేగక కురిసినది. ఇది ఆ ఊరిలో చాలాకాలం చెప్పుకొనుచుండిన వృత్తాంతమగును.*


*నేటికిను వర్షము పడక కరువుకాటకము వచ్చినపుడుకాని భారీవర్షముతో వరద వచ్చినపుడు గానీ శమ్రవట్టం శాస్తావారికి వళిపాడు చేసినచో ఆ కొరతలు వెనువెంటనే తీరిపోవుట జరుగు చున్నది.*


#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow