శ్రీ మహాశాస్తా చరితము - 119 | గణనాయకులు | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 119 | గణనాయకులు | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

*గణనాయకులు*

శాస్తా యొక్క గణనాయకులుగా ముఖ్యముగా కొలువబడువారు మహాకాలుడు , మహావీరుడు
అనువారు.

సకల గణములను తనకు లోబడియుండునట్లు చేసికొని ప్రథమ గణేశ్వరునిగా కొలువబడువాడు
శాస్తా.

స్వామి , భూతగణముల నాయకుడై వెలుగొందు వైభవమును శ్రీ భూతనాధోపాఖ్యానము
వివరించుచున్నది.

*వాబర కటు శబ్దశ్చ వీర భద్రోది వీర్యవాన్*
*కూపన్నేత కూపకర్లో ఘంటాకర్లో మహాబలి*

వాబరుడు ,
కటుశబ్దుడు , వీరభద్రుడు , కూపనేత్రుడు , కూపకర్ణుడు , ఘంటాకర్ణుడు ,
మహాబలి
మొదలగు వారైన ఏడుగురు భూతసేనయొక్క అధిపతులై వెలసిల్లుచుండినట్లుగా భూతనాధోపాఖ్యానము
వివరించుచున్నది.

వీరంతా మహిషి సంహారమునకై స్వామి దేవలోకముపై దండెత్తి వెళ్ళిన సమయమునందు ,
స్వామి యొక్క సేవానాయకులై , దళపతులుగా తమ బలాబలములను ప్రదర్శించినవారే.

అడవులందు నివసించుట యందు మక్కువ కలిగిన స్వామి , నిత్యవాసము చేయు స్థలమైన
ద్వారకాపురికి సమీపమున నున్న రైవతగిరి. *'బృహస్పతి స్మృతి'* అను గ్రంధమునందు ఈ వివరణ మనకు కనిపించును. ఈ స్థలమునందు , స్వామి తన భక్తుల కోరికలను అడిగినదే తడవుగా
నెరవేర్చు విధముగా అభీష్టనాయకునిగా భాసిల్లుచుండును. చేత దండమును ధరించి కొలువై యుండు స్వామికి అష్టదిక్పాలకులుగా ఎనిమిదిమంది పరివార వీరులు కాపలా కాయుచుందురు.
ఈ విషయమును మంత్రమహోదధి పేర్కొనుచున్నది.

*“తలేష్యష్ట గోపాం పింగలాక్షం తతఃపరం*
*వీరసేనం శాంభవం ఛత్రి నేత్రం శూలినం దధా*
*దక్షంచ భీమరూపం చ దక్ పాలానస్త్ర సంయుతాన్||*

గోప్తుడు , పింగలాక్షుడు , వీరసేనుడు , శాంభుడు , త్రినేత్రుడు , శూలుడు , దక్షుడు , భీమరూపి
నాయకునిగా కొలువైయుండెను. ఇవియేగాక
మరికొంతమంది భూతగణములు
స్వామియొక్క ఆజ్ఞకు లోబడియుండి , ఆస్వామి పరివారములలో ఒకరిగా ఉంటూ స్వామి పాదములను సేవించుచూ , అతడి ఆజ్ఞకై ఎదురుచూచుచుండిరి.

చిదంబర రహస్యము అను పురాతన గ్రంధమునందు

*వీరాగ్రేసర శృంఖలాధర జటామున్యంత కృత్తాలభృత్*
*పంకుజ్యేష్ ఋహుతాశవక్ర తురగస్వానే భవాహాతిమః*

సేనానామధిపై నిషేదిత పదః సర్పాపతో వారయన్ సర్వాన్ శాస్త్రి నిరాకృతిః సకరుణం బ్రహ్మ శాస్తా విభుః తెలుపబడినది. ఏమనగా

వీరుడు , మున్నిడియాన్ , శృంఖలావీరుడు , జటాముని , ఇరుళన్ , పనైమరత్తాన్ , నొండి ,
పెరియణ్ణన్ , నిప్పులుగ్రక్కు కోరలుగల భూత గణములచేతనూ.

అశ్వవాహనము , కుక్కవాహనము పూని సేనాధిపతుల చేతనూ , కొలువబడు శాస్తా , కారుణ్యమూర్తియై భక్తుల ఆపదలను పారద్రోలి సకలజనులనూ కాచువాడు అని అర్థం.

ఇదియేకాక , ఆర్యంగావు , శబరిమల , అచ్చన్ కోవిల్ వంటి ఆలయములందు కాపలాదేవతలుగా
పిలువబడు కరుప్పన్ , మాడన్ , భూతత్తాన్ , యక్షి , వీరన్ , వావాడైరాయన్ వంటివారు కూడా స్వామి
యొక్క ఆజ్ఞకు లోబడి యుండు గణములవారే.

ఇందులో కరుప్పన్ , వీరన్ ఇరువురూ చెప్పుకోదగినవారు. *'శాస్తా ప్రీతి'* ఉత్సవమునందు కూడా
భూతనాధుడు , యక్షి , భూతాన్ వంటి వీరులను స్వామికి ఇష్టులుగా పేర్కొనబడుదురు.

*(పైన తెలిపిన నామములు తమిళభషలోనివే)*

స్వామి సేవకై తపించు *'మణిదాసన్'* రచించిన ఆణిముత్యముల వంటి గానములందునూ
ఇండలయన్ , వెళ్ళెక్కల్ భూతం , వెరిక్కల్ యక్షి , సాపాలన , పెరియన్ , ఇరుళన్ , మాడన్ మొదలగు
(తమిళభాషల పేర్లు) వారు భూతనాధుని పరివారముగా పేర్కొనబడిరి.

స్వామి యొక్క పరివార గణములను లెఖించనలవికాదు. ముఖ్యమైన పరివార గణములుగా వెళ్ళెక్క భూతం , యక్షి , మాడన్ , చెల్లపిళ్ళై , వంటి వారితో పాటు వీరభద్రుడు , భైరవుడు వంటి వారి పేర్లు కూడా కావచ్చును.

*ఓం శ్రీ స్వామియే శరణం అయ్యప్ప*

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow