శ్రీ మహాశాస్త చరితము - 117 | స్వామి కొలువైయుండు ముఖ్యమైన కొన్ని ఆలయాలు - 5 | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్త చరితము - 117 | స్వామి కొలువైయుండు ముఖ్యమైన కొన్ని ఆలయాలు - 5 | Sri Mahashasra Charithamu

P Madhav Kumar
స్వామి కొలువైయుండు ముఖ్యమైన కొన్ని ఆలయాలు - 5*
*వేట్టంగరై కావు*

ఇది చాలా చిన్న ఆలయము. పాలక్కాడుకి చెందిన *'కల్పాత్తి'* గ్రామమునకు సమీపముగా
వెట్టెంగరైకాపు శాస్తా ఆలయము నిర్మింపబడినది.

స్వామి పూర్ణా పుష్కలా సమేతునిగా మూడు కత్తుల యందు ఆవాహన చేయబడి యుండును.

మూడు వందల యాభై సంవత్సరకాలము నాటిది ఈ ఆలయము.

*తిరునెల్లాయ్*

పాలక్కాడు నగరమున అతి పురాతనమైన అగ్రహారములలో నొకటైన *'తిరునెల్లాయ్'* అను ప్రదేశమున అమరియున్నది. ఇలా నది యొక్క ఉత్తర తీర ప్రాంతమున శ్రీ పూర్ణా , పుష్కలా సమేతునిగా దర్శనమిచ్చును. ఇచ్చట తూర్పు సరిహద్దు నందునూ , పడమటి సరిహద్దు నందునూ రెండు శాస్తా ఆలయములు రెండుగలవు.

*అస్మత్ కులేశ్వరం దేవం మోహినీ చ సుతం ప్రభుం*
*శ్రీ చంద్రికాపురీనాధం స్వయంభువ మహంభజే||*

*పగరప్పళ్ళి*

తిరుచ్చూరుకి చెందిన *'బుద్ధన్ సిరా'* అను ప్రాంతమున అమరియున్న *'పగరపళ్ళి'* యందు , చేత అమృతకలశము ధరించి , భక్తుల యొక్క వ్యాధులను తొలగించు విధముగా ధన్వంతరి వేషధారియై , శాస్తా కొలువైయున్నాడు.

*విద్యా శాస్తా*

తిరుచ్చూరు నుండి కొడుంగల్లూరునకు పోవుదారియందు పదమూడు కిలోమీటర్ల దూరమున
అమరియున్నది *'తిరువుళ్ళక్కాపు శాస్తా'* ఆలయము. ఈ చోట జ్ఞానమును , బుద్ధిని ప్రసాదించు విధముగా విద్యాశాస్తా రూపముగా వెలసియున్నాడు.

సరస్వతీ కటాక్షము గల ఆలయమైనందువలన , ఈ గుడియందు విజయదశమినాడు అక్షరాభ్యాస
కార్యక్రమాలు నిర్వహించబడును. వేలాదిమంది బాలురు విజయదశమినాడు అక్షరాబ్యాసము చేసుకొను దృశ్యము కమనీయము. అంతేకాక సంవత్సరము పొడుగుననూ ప్రతిదినమూ ఇక్కడ అక్షరాభ్యాస
కార్యక్రమములు జరుగుచునే యుండును.

*నల్లిచ్చేరి శాస్తా*

*'సోట్రుడెయాన్'* కాలువచేత సుభిక్షమైన తంజావూరు జిల్లా *'నల్లిచేరి'* యందు యోగశాసా
రూపున కొలువై యున్నాడు.

ఈ ప్రాంతమున లభించిన తొమ్మిదివ శతాబ్దపు నాటివైన నాణుములు , కొన్ని పురాతన
వస్తువుల మూలముగా ఈ స్వామి యొక్క రూపు మనకు తెలియుచున్నది.

కులదైవము ఎవరో తెలియనివారికి సైతము , తనను తాను తెలియపరచుకొని , వారికి ముక్తిని ప్రసాదించిన అద్భుతమూర్తి.

*ఆరాట్టుపుళా శాస్తా*

తిరుచ్చూరు నుండి పదిహేను కిలోమీటర్ల దూరమున నున్న ఒక అందమైన గ్రామమైన
*'ఆరాట్టుపుళా'* యందు అమరియున్నది. ఈ ఆలయము శ్రీరాముని గురువైన వశిష్టమహాముని
యొక్క తపశ్శక్తిచే నిర్మింపబడినట్లు తెలియుచున్నది.

ఇక్కడ శాస్తా సకలదేవతా స్వరూపునిగా కనిపించుటయే విశేషము. అందువలననే అచట
స్వామికి తప్ప వేరు ఎవరి సన్నిధులూ మనకు కనబడవు.

ఈ ఆలయము చుట్టూ నాలుగు దిశలయందునూ సుమారు ఇరవై ఐదు ఆలయములు కనిపించును. అందు సకల దేవతలూ ప్రతిష్టింపబడియుందురు. శాస్తా ప్రతిసంవత్సరమూ ,
ఫాల్గుణమాసమునందు , ఒకనాడు ఆలయము ముందుండు మైదానమున తక్కిన అన్ని
ఆలయముల నుండి కొనిరాబడిన ఏనుగుల మీద ఊరేగింపుగా వచ్చి వరుసక్రమమున నిలచియుండు
దేవతలను చూచుట కనులవిందైన దృశ్యము.

ఈ ఊరేగింపు సమయమున భక్తులు వరుసక్రమమున నిలచియుండు ఏనుగుల చుట్టూ ప్రదక్షిణము గావింతురు. అట్లు చేసినచో ముక్కోటి దేవతలను ప్రదక్షిణము గావించునట్లే యని
పెద్దలవాక్కు.

*సెరుప్పుళచ్చేరి శాస్తా*

తిరుచ్చూరు - సెరుప్పుళ చేరి ఆలయము వివాహములకు పెట్టినది పేరు. చేత విల్లంబులు
ధరించియున్న శాస్తా పుత్ర సంతానమును ప్రసాదించుటలోనూ సమర్థుడే.

గర్భిణీ స్త్రీలు తమ ఎనిమిదవ మాసము నందు ఇక్కడకు వచ్చి స్వామిని పూజింతురు. అట్లు చేయు పూజను *'ఎట్టు పిరక్కల్'* అందురు. ఇట్లు చేయుట వలన వారికి *మగ* సంతానము కలుగుననియూ , సుఖ ప్రసవము అగుననియూ నమ్ముదురు.

*తిరుక్కున్నపుళా శాస్తా*

*'ఆలప్పుజా'* హరిప్పాడుకు సమీపమున అమరియున్నది. తిరుక్కున్నవుళా. భార్య అయిన ప్రభాదేవితోనూ , కుమారుడైన సత్యకునితోనూ శాస్తా కొలువైయున్నాడు. స్వామి విగ్రహము కేవలము
ఒకటిన్నర అడుగులు మాత్రమే యుండును. ఆ ఆలయము సుమారు ఐదు వేల సంవత్సరముల
నాటిది. శబరిమలై వలెనే ఇచటనూ పదునెనిమిది మెట్లు కలదై *'పడింజారు పదినెట్టాంపడి'* అని
ప్రసిద్ధి చెందుట గమనార్హము.

*నూరణి శాస్తా*

పాలక్కాడు - నూరణి గ్రామము నందు , పూర్ణా పుష్కలా సమేతునిగా మూడు శిలారూపణులుగా
స్వామి కొలువైయున్నాడు. నూరణియందు జరుపబడు *'శాస్తా ప్రీతి'* వైభవము ప్రపంచమంతటా
ప్రసిద్ధి చెందినదనుటలో అతిశయోక్తి లేదు.

మకరజ్యోతి సమయమున , ఎరుమేళి యందు ఆకాశమున గరుడుడు కనిపించినంతనే నూరణి
నుండి శాస్తా బయలుదేరినట్లు సంకేతముగా చెప్పుదురు.
ఈ స్థల విశేషమునకు ఇదియే ఒక ఋజువు.

*తొండికుళం*

పాలక్కాడుకి చెందిప పదునెనిమిది గ్రామములందునూ పేరు పొందినవి నూరణి గ్రామము , తొండికుళ గ్రామములు. ఈ రెండూ ఒకటిగా నుండి విడదీయలేనంతగా ప్రాశస్త్యము వహించినవి.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow