శ్రీ మహాశాస్తా చరితము - 118 | శాస్త్రు లోకము | Sri Mahashasra Charithamu
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം

శ్రీ మహాశాస్తా చరితము - 118 | శాస్త్రు లోకము | Sri Mahashasra Charithamu

P Madhav Kumar

శాస్త్రు లోకము*

రాత్రీపగలూ నీ ధ్యానమే. మంచి ఆలోచనలు కలుగునట్లు ఆశీర్వదింతువుగాక. మహా మునులచేతనూ , ఋషులచేతనూ పొగడబడు పూర్ణ పుష్కలానాధా శరణు , శరణు.

*భూతపతి*
నీ కరుణ మాటలకందనిది కదా. *మణిదాసుడు*

హరిహర పుత్రుడైన స్వామి పూర్ణాదేవిని కుడి భాగము నందునూ , పుష్కలాదేవిని ఎడమ
భాగము నందునూ కలిగి , తన నివాసస్థలమైన మహాకాళము నుండి మనలను పరిపాలించుచుండును.

శ్రీహరి వైకుంఠమును ఏలునట్లుగా , పరమేశుడు కైలాసమునందు కొలువై యుండునట్లుగానూ ,
స్కంధుడు స్కందలోకమును తనదిగా చేసుకొనినట్లుగానూ , స్వామి తన నివాస స్థలముగా ఎంచుకొని ,
కొలువై యుండునని *'మహాకాళము'* అనబడుచున్నది. ఇది కైలాసము నందలి ఒక భాగము. ఇదే
*శాస్త్రు లోకము*. స్వామి కొలువై యుండు కాంత పర్వతమే మహాకాళము అనియూ కొందరి ఉవాచ.

స్వామియొక్క ఇచ్ఛా శక్తికి పూర్ణాదేవి , క్రియాశక్తికి పుష్కలా దేవి , చేతియందున్న శ్రీ దండము జ్ఞానశక్తికి ప్రతిరూపములు ఇచ్ఛాశక్తి , జ్ఞానశక్తి , క్రియాశక్తి స్వరూపముగా స్వామి కొలువైయుండి
మనలను పరిపాలించుచున్నాడు.

సిద్ధి , బుద్ధులతో పాటువల్లభని గజముఖుడు పొందినట్లుగా , పూర్ణా , పుష్కలా దేవులతో పాటు
ప్రభావతిని కూడా స్వామి తన తోడుగా అనుగ్రహించెను. సత్యస్వరూపుడైన స్వామికి ఈ దేవేరులతో
పాదు సత్యకుడు అను కుమారుడు కూడా కలిగియుండెను.

ముమ్మూర్తుల అంశలను స్వామి ఒక్కటిగా పొందినట్లుగా , త్రిశక్తుల అంశలను సైతము
ఒక్కటిగా కలవాడైయుండెను.

వీణను ధరించియున్న ప్రభాదేవి ఎడమ భాగమున అమరియుండగా కుడి భాగమున సత్యకుడు
అను తన కుమారుని చెంతనుంచుకున్న స్వామి అందమైన సింహాసనము నందు అమరియుండెను.

స్వామియొక్క భవనము నలువైపులా అతడి యొక్క పరివార గణములు కాపలా భటులై కావలి కాచుచుండిరి.

తూర్పు దిక్కును విశ్వాంగి అను శక్తితో ఛండుడు , స్వరూపి అను శక్తితో ఆగముదు కాపలా
కాయుచుండిరి.

పడమర దిక్కును వికృతియను శక్తితో షడద్వార పాలకుడు , విషతియను శక్తితో ప్రతిషడ్ ద్వారపాలకుడు కాపలా కాయుచుండిరి. ఉత్తర దిక్కును శంఖిణి దేవితో పాటు సువర్ణాతుడు ,
చంఢమాలాదేవితో రుద్రప్రియుడు కాపలా కాయుచుండిరి.

దక్షిణ దిక్కును భద్రాదేవితో ఛండాక్షరనుడు , విశ్వపతి దేవితో విమలుడు కాచుచుండిరి.

ఇంకా , తూర్పు దిశను సంవర్ధనుడు, ఆగ్నేయమును ఉన్మత్తుడు , దక్షిణమును గుండోధరుడు ,
నైఋతియందు దీర్ఘకాయుడు , పశ్చిమమును హ్రస్వపాదుడు , వాయువ్యమును సింహరూపుడు ,
ఉత్తరమును గజముఖుడు , ఈశాన్యమును ప్రియముఖుడు ఇట్లు శాస్తా యొక్క పరివార భూతగణములు
ఎనిమిది దిక్కులందునూ తమ చేతులయందు దండముబూని కాపలా కాయుచుండిరి.

స్వామి కొలువైయుందు చందక్కావు నందు పది చిక్కులయందూ అతడి కోటను రక్షించు నిమిత్తమై పలు పరివార మూర్తులను కొలువైయుండుటను మణిదాసుడు వర్ణించుచున్నారు.

స్వామి యొక్క ఆజ్ఞను వెంటనే శిరసా వహించునట్లుగా , తన కట్టుబాట్లకు లోనైయుండునట్లుగా ,
మాడనుడు , కరుప్పణుడు మొదటి స్థానమున నిలిచియుండిరి.

సావలుడు , ముద్దుబిడ్డ ఇరువురూ స్వామియొక్క సన్నిధిని కాచుటకై ప్రధాన సేవకులుగా
నియమించబడిరి.

కానగమును కాపాడు బాధ్యత సట్టియన్ వెళ్ళెయన్ అనువానికి , తూర్పు వాకిలిని కాపాడు
బాధ్యతను నెట్టియన్ , పట్టాణివీరున్ మొదలగువారికి ఈయబడినది.

చాముండి , బేతాళగణములు పరివేష్టింపబడియుండగా , సుంగిలి భూతములు పడమర వాకిలికి
కాపలా కాయుచుండిరి.

కుండాందడి అను భూతము , కేరళ యక్షిణులు ఉత్తర వాకిలికి కాపలా యుండగా , ఇడైమలెయోన
తలైమలెయోన మొదలగువారు దక్షిణ వాకిలికి కాపలాగా యుండిరి.

శ్మశాన భైరవుడు , మాముఖయక్షులు ఈశాన్య దిక్కునకు , వీరడి , పాతాళముండన్ ఆగ్నేయ దిశకు కాపలాగా యుండిరి.

వన్నిర మచ్చెడైచ్చి , పాతాళ యక్షులతో కూడి కన్నిమూలను కాచుచుండిరి.

ఆయ్యత్తురై మాడన , ఆలడి వీరన్ అనువారు వాయవ్యమూలను , ఏకాంత భూతములు
మూడుకోట్ల యక్షులు ఆగ్నేయ మాడవ వారితో చేరి ఆకాశమును కాపాడుచుండిరి.

వరాహ సింహ భూతము. పాతాళ భైరవుడు పాతాళలోకపు బాధ్యతను , యక్షులు , మాకాళి
మోహిని వీరంతా స్వామి యొక్క సంపదలను కాపాడుచుండిరి.

పుష్యరాగములనుకొనిన భూతము , వీరడిభూతము , స్వామియొక్క ఆకాశ విమానమును
కాపాడుచుండిరి.

ముల్లోకములకు అధిపతియై విలసిల్లు మహాశాస్తా , భూతనాథుడు అను పేరుతో ప్రసిద్ధి గాంచి
యుండెను.

ప్రేమే దైవము అని పొగడబడుచూ శూలము , ఢమరుకము చేతియందు ధరించి ముల్లోకములను
కాపాడు బాధ్యత వహించిన ఈశ్వరుని యొక్క భూతగణముల నాయకుడైన , భూతనాథుడు. కొన్ని
సమయములందు క్రూరముగా బాధించువారైన క్షుద్ర దేవతలను సైతము అణగదొక్కి తన ఆజ్ఞకు
లోబడియుండునట్లుగానూ చేసుకొనుచుండెను. భూతగణములను తన ఆజ్ఞకు లోబడియుండునట్లుగా
మలచుకొనే పరమశివుని అంశ వలన భూతములను అణగదొక్కుచూ , పరంధాముని అంశ వలన
భూతగణములను కాపాడుచూ భూతేశునిగా కొనియాడబడుచూ అందరినీ తనకు లోబడియుండునట్లుగా
చేసుకొని , వారిని కాపాడి రక్షించు బాధ్యతను కలిగిన వేదనాయకుడు.

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
💬 Chat 📢 Follow